[శ్రీ కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం రచించిన ‘జాతీయ జెండా’ అనే కవితను పాఠకులకు అందిస్తున్నాము.]


పిలుస్తోంది.. పిలుస్తోంది
మువ్వన్నెల జెండా
జయహో.. జయహో..
అంటూ జాతీయ జెండా (“పిలుస్తోంది”)
కథం త్రొక్కుతూ.. పదం పాడుతూ
ఎదనిండా దేశ భక్తి ఉప్పొంగి పోతూ
కదలిరండి.. కలసి రండి భారతీయులారా
ప్రపంచాన మన కీర్తిని చాటి చెప్పరారా (“పిలుస్తోంది”)
గతం స్మరిస్తూ.. ఘనం స్తుతిస్తూ
మదినిండా త్యాగ నిరతి గుర్తుతెచ్చుకుంటూ
కదలి రండి.. కలసి రండి భరత బిడ్డలారా
సరిహద్దున మన జెండా ఎగురవేయగ రారా (“పిలుస్తోంది”)
