తల్లీకూతుళ్ళు ఒకరిని చూసి ఒకరు అసూయ పడనూ వచ్చు..
అక్కచెల్లెళ్ళు ఏదేని సందర్భంలో స్థితిగతుల తారతమ్యాలతో కుళ్ళుపడనూ వచ్చు…
దీర్ఘకాల స్నేహితురాళ్ళు అనుకోని వైరుధ్యాలతో వైరపడనూ వచ్చు…
జీవిత భాగస్వాముల మధ్య మటుకు అసూయా ద్వేషాలకు అవకాశాలు చాలా అరుదు.
మేరీ థెరిస్సాలు మనసా వాచా కర్మేణా జీవిత భాగస్వాములై సహజీవనం చేస్తున్నారు.
వారిది లవ్ ఎట్ ఫస్ట్ సైట్…
తొలిసారి థెరిస్సాను చూసిన సందర్భమే మేరీ తనను తాను తెలుసుకున్న సందర్భం కూడా.
ఆనాటి ఆ సంఘటనను మేరీ ఎప్పటికీ మరువలేదు. తనకు పురుషుల పట్ల ఆకర్షణ లేదని తొలిసారిగా ప్రాక్టికల్‌గా తెలిసిన సందర్భం అది…
ఆ రోజున మేరీ పబ్‌లో కూర్చుని వుంది. అప్పుడే మూడో పెగ్గు తాగుతోంది. ఆమె మనసంతా ఆందోళనగా వుంది. తెలియని కలకలం, చెప్పనలవి కాని ఉద్వేగం. పక్కన కూర్చున్న జోసెఫ్ స్పర్ష తనలో ఎటువంటి భావోద్వేగము, రస స్పందన కలిగించక పోవటమే కాకుండా చిత్రంగా చిరాకు కలిగిస్తోంది.
తానేమిటో తనకే అర్థం కావటం లేదు. అర్థం అవుతున్న కొద్దీ భయాందోళనలు పెరిగిపోతున్నాయి. ఆ భయాన్ని కప్పి పుచ్చుకోవటానికి తనకు తాను ధైర్యం చెప్పుకోవటానికి పెగ్గు మీద పెగ్గు తాగేస్తోంది. మత్తు ఎక్కే కొద్దీ తన లోని అసలు తను ఆమె కళ్ళ ముందు ప్రత్యక్షంగా సాక్షాత్కరించటం మొదలయ్యింది.
ఎంతో కాలంగా ఆమెతో స్నేహం చేస్తూ ఆ రోజు డేటింగ్‌కి వచ్చిన జోసెఫ్ తదేకంగా తమకంగా మేరీ మొహంలోకి చూస్తున్నాడు. మధువుతో మెరుస్తున్న ఆమె గులాబీ తడి పెదవులు చూసిన అతను తనను తాను సంబాళించుకోలేక పోతున్నాడు. ఎంత అదుపు చేసుకున్నా వశం తప్పిన అతను అమాంతం మేరీని దగ్గరకు తీసుకుని ఆమె తడి పెదవుల లోని చమ్మను జుర్రుకోసాగాడు. ఆ పెదవుల స్పర్షతో అతని నరనరంలోకీ పాకిన విద్యుత్తు అతని శరీరంలో సన్నటి ప్రకంపనలు కలగ జేసి లోపల కోరికల కుంపటిని రాజేసింది.
పబ్ లోకి వచ్చిన దగ్గర నుండీ మేరీ దృష్టి రెండు టేబుల్స్ అవతల ఒక్కర్తి కూర్చుని వైన్ సిప్ చేస్తున్న థెరిస్సా పైనే వుంది. జోసెఫ్ మేరీ తనువంతా తాకరాని చోట్ల తడుముతూ గట్టిగా నొక్కుతూ తన నాలుకతో, పెదవులతో ఆమె చెవులు, చంపలు, మెడ వంపులు స్పృశిస్తూ మైమరిచిపోతున్నాడు.
అతని చర్యలకు ఏ అలజడికి గురి కాని మేరీ అతని భుజాల మీదుగా థెరిస్సా ఎత్తయిన కుచద్వయాన్ని చూస్తూ ఆమె వెచ్చని వక్షస్థలం పైన తన మొహాన్ని ఊహించుకుంటూ తన్మయంగా కళ్ళు మూసుకుంది.
తీగలు శృతి చేసిన వీణలా ఆమె తనువు అతని వేలి కొసల స్పర్శతో ప్రేమరస సంగీతామృతాన్ని ఒలికిస్తోందని అతను భ్రమ పడుతున్నాడు. మేరీ తన్మయత్వానికి తన మగతనమే కారణమనుకున్న జోసెఫ్ ఆమెను అమాంతం రెండు చేతుల్లోకి ఎత్తుకుని దగ్గరలోనే వున్న ఏకాంతం లోకి తీసుకెళ్ళాడు.
అప్పటికే ఆరు పెగ్గుల నిషా నషాళానికి ఎక్కిన మేరీ కళ్ళు అరమోడ్పులై కలల లోకాన తేలుతూ ఆపిల్ పళ్ళలాంటి థెరిస్సా బుగ్గలను, ఫిల్లర్స్‌తో పరిమాణం పెంచుకున్న ఆమె దొండపండుల్లాoటి ఎర్రని పెదవులను ఊహించుకుంటూ అపస్మారకంలోకి వెళ్ళిపోయింది.
సుషుప్తిలోకి జారిపోయిన మేరీని జోసెఫ్ ఆసాంతం తన సొంతం చేసుకుని మన్మథ సామ్రాజ్యాన్ని ఏలుతూ ఆమెతో రసమయ శృంగార భవితవ్యాన్ని ఊహించుకుంటూ కమ్మని కలల ప్రపంచంలో తేలియాడుతూ తృప్తిగా నిద్రలోకి ఒరిగిపోయాడు.
ఒకే పరుపు పైన ఆదమరిచి పవళించి వున్న, ప్రకృతి సహజ ప్రేమ కాముకుడైన అతనిని, ప్రకృతి విరుద్ద విపరీత వ్యక్తిత్వమున్న ఆమెను, చూసిన చంద్రుడు క్షోభ మనస్కుడై మబ్బుల మాటున మాయమైపోయాడు. వెన్నెల కాంతిని మబ్బులు కమ్మేయటంతో ఆ రాత్రి మరింత చీకటిని కాటుకలా పులుముకుంది.
మేరీ జీవితంలో ఆ రాత్రితో కారు చీకట్లు తొలగిపోయాయి. తనేమిటో తనకేమి కావాలో తేటతెల్లమైపోయింది. ఆ తరువాత ఆమెకు ఆకాశంలో చంద్రునితో అవసరం కలగలేదు. చంద్ర వదనంతో థెరిస్సా వెన్నెల వెలుగును ఆమె జీవితంలోకి తెచ్చింది. జోసెఫ్‌తో మేరీ మనసు విప్పి మదిలో మాట చెప్పింది. అతను సహృదయంతో థెరిస్సాకి ఆహ్వానం పలుకుతూ మేరీ జీవితంలో నుండి శాశ్వతంగా తప్పుకున్నాడు.
ఆ రోజు ప్రారంభమైన వారిద్దరి సహజీవనం రసరమ్యంగా సాగుతోంది. ఒకరికి ఒకరై, ఇద్దరూ ఒకటై ఏ అడ్డంకులు లేకుండా పూర్తి స్వేచ్ఛతో స్వతంత్రంగా వాళ్ళ ఇంటిని ఒక ప్రేమాలయంగా తీర్చి దిద్దుకుని ఒకే కంచం, ఒకే మంచం, ఒకే మనసు, ఒకే జీవితంలా ప్రాణానికి ప్రాణంగా మసులుకుంటున్నారు. వాళ్ళకు ఒకరిపై ఒకరికున్న ప్రేమ, కోరిక, మక్కువ రోజురోజుకీ అంతకంతకూ పెరుగుతూ వచ్చాయే కాని వాటికి డెప్రిసియేషన్ సూత్రం అంటలేదు.
ఇప్పుడు వాళ్లది ఇరవై ఏళ్ళ దాంపత్య జీవితం. కాని ఒకరిని చూస్తే మరొకరి కళ్ళల్లో మెరుపులు ఇప్పటికీ మొదటిసారి కలిసినంత ఆర్తిగానూ మురిపెంగానూ వుంటాయి.
వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళిద్దరి స్నేహితుల జీవితాల్లో ఎన్నో స్త్రీ పురుష సంబంధాలు తెగిపోయాయి. ఎన్నో వివాహాలకు విడాకులు అయ్యాయి. వాళ్ళు మటుకు ఒకరి చేతిని ఒకరు వదలలేదు. కలిసి ప్రయాణం ఆపలేదు. వాళ్ళిద్దరూ ఒకరి కోసం మరొకరు పుట్టామన్నంత ప్రాణప్రదంగా వుంటారు.
ఎందరో లెస్బియన్ జంటలకు వాళ్ళు ఆదర్శప్రాయమయ్యారు.
ఇంతకీ ఈ ప్రేమ పావురాల కథ ఎందుకు చెప్పాల్సి వచ్చిందో చెప్పనేలేదు కదూ…
మా ఎనిమిదేళ్ళ నిక్కీ స్నేహితురాలు, క్లాస్మేట్ లూసీ సెలవల్లో ప్లే డేట్ కోసం రెండు సార్లు మా ఇంటికి రావటం జరిగింది.
లూసీ చాలా అందమైన, తెలివైన, మంచి మనసున్న ఎనిమిదేళ్ళ అమ్మాయి. మొదటిసారి ఒకావిడ లూసీని దింపి వెళ్ళింది.
‘లూసీ మమ్మీ థెరిస్సా’ అని పరిచయం చేసింది మా అమ్మాయి.
సాయంత్రం మరొక స్త్రీ వచ్చి లూసీని తీసుకెళ్లింది.
ఆమె ఎవరన్న ప్రశ్నకు మళ్ళీ ‘లూసీ మమ్మీ మేరీ’ అని జవాబిచ్చింది మా అమ్మాయి.
భ్రుకుటి ముడి వేసి మా అమ్మాయి వంక చూసా.
అమ్మాయి ఏదో పనిలో బిజీగా వుంది.
ఒకరు కన్న తల్లి, మరొకరు సవితి తల్లి అయ్యుంటారులే అనుకుని నేను ఇక రెట్టించలేదు.
రెండోసారి ప్లే డేట్ కి వచ్చినప్పుడు మూడో స్త్రీ వచ్చింది.
ఆవిడ వెళ్ళిపోయాక “ఈవిడ కూడా మదరేనా…” వేళాకోళంగా నవ్వుతూ అడిగాను మా అమ్మాయిని.
మా అమ్మాయి జవాబు చెప్పే లోపు వెనుక నుండి నిక్కి “యస్ మమ్మ, షీ ఈజ్ జెనెటిక్ మదర్..” అంది.
“మరి క్రితం వచ్చిన వాళ్ళెవరు…” నిజంగానే అమాయకంగా అడిగాను నిక్కీని.
“ఫస్ట్ వన్ ఈజ్ మదర్ హూ గేవ్ బర్త్ అండ్ సెకండ్ వన్ హూ రేస్డ్ లూసీ…” ఆరిందాలా టక్కున విడమర్చి జవాబిచ్చింది ఎనిమిదేళ్ళ నిక్కి.
నోరు వెళ్ళబెట్టి అమ్మాయి వంక చూస్తే “మమ్మీ, క్రితం వచ్చిన ఇద్దరు పార్టనర్స్. కలిసి వుంటారు. వాళ్ళు సంతానం కావాలనుకున్నారు. డోనర్ స్పెర్మ్‌తో ఒక బిడ్డను కనాలనుకున్నారు. దురదృష్టవశాత్తు థెరిస్సాకు అండం ప్రాబ్లం అయ్యింది. ఇవాళ వచ్చిన ఆవిడ అండం తీసుకున్నారు. ఆ అండాన్ని డోనర్ స్పెర్మ్‌తో ఫలదీకరించి థెరిస్సా గర్భంలో పెట్టారు. థెరిస్సాది స్థూలకాయం అవటం వలన మేరీ లూసీని శ్రద్దగా పెంచింది. మూడో ఆవిడ జన్యుపరంగా తల్లి కావటం వలన అప్పుడప్పుడూ వెళ్ళి కలుస్తుంటుంది. ఇవాళ వాళ్ళిద్దరికీ సెలవు లేకపోవటం వలన ఈవిడ వచ్చింది లూసీని తీసుకువెళ్లటానికి…అలా లూసీకి ముగ్గురు అమ్మలు” అంది.
నేను ఎనిమిదో ప్రపంచ వింత విన్నంత విడ్డూరంగా విన్నాను కాని నిక్కీకి ఇవన్నీ క్షుణ్ణంగా తెలుసట. ఇది ఈ దేశ సంస్కృతికి సర్వసాధారణం కావచ్చు కాని నాకు కాదు.
నా పిల్లలు ఇలాంటి వాతావరణంలో పెరగటం కూడా నాకు కష్టంగా అనిపించింది.
నిక్కి లూసీ ఇంటికి ప్లే డేట్‌కి వెళితే, ఇద్దరు స్త్రీలను చూడకూడని విధంగా సన్నిహితంగా చూస్తే, దాని చిట్టి బుర్ర పైన ఎలాంటి ప్రభావం పడుతుంది…?
ఆలోచించలేకపోయాను. మా అమ్మాయితో ఒకే మాటన్నాను.
“నిక్కీని మటుకు వాళ్లింటికి ప్లే డేట్ కి పంపకు…”
మా అమ్మాయి కూడా నాతో ఒకే మాటంది.
“మమ్మీ, యు హావ్ టు గ్రో… నువ్వు ఎదగాలి…”
స్వలింగ సంపర్కాలను ఆమోదించి గౌరవించటమే ఎదగటం అనుకుంటే నాకు ఎదగాలని లేదు.
(మళ్ళీ కలుద్దాం)
ఈ రోజుల్లో హైటెక్ వేగంతో నవలలు, కథలు, కవిత్వం, సమీక్షలు రాస్తున్న రచయితల్లో శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టి ముందు వరుసలో ఉంటారు. ఇప్పటి పాఠకులకు ఝాన్సీగారు కొత్త రచయిత్రి కానీ ఆవిడ యుక్త వయసులోనే రచించిన కథలు, కవితలు వివిధ పత్రికలలో వెలువడ్డాయి. కొన్ని వ్యక్తిగత కారణాల వలన మధ్యలో వారి రచనా వ్యాసంగానికి గండి పడింది. తిరిగి గత రెండేళ్ళుగా మళ్ళీ కలం పట్టిన ఝాన్సీగారి అనేక కథలు కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. వీరి కథలు, కవితలు ప్రతిలిపిలో అనేక బహుమతులు గెలుచుకున్నాయి. వీరు హైదరాబాదుకు చెందిన వారైనప్పటికీ ప్రస్తుత నివాసం ఆస్ట్రేలియా. తెలుగు సాహిత్యం పట్ల అమిత ప్రేమ ఉన్న ఝాన్సీగారు ఆంగ్లంలో కూడా పట్టభద్రులు. 2019లో ముద్రితమైన ‘అనాచ్చాదిత కథ’ అనే వీరి తొలినవల అసంఖ్యాక పాఠకుల అభిమానం చూరగొని అంపశయ్య నవీన్ గారి ప్రత్యేక బహుమతిని పొందినది. వీరి రెండో నవల ‘విరోధాభాస’.
నిజమే, మీకే కాదు,మాకు, ఎదగాలని లేదు. ఇలాంటి విషయములలో..! ma’am.. మీ శైలి లో, కథ..ok 👍! బాగుంది
Thank you పద్మా…. నిజమే మనకా ఎదుగుదల వద్దు😍😍😍
ప్రకృతి విరుద్ధం నిబద్ధం భావోద్వేగం ఏదైనా.. కొన్ని సార్లది మది నియంత్రించ లేనిదన్నది నిజమేమో కదా.. సోషల్ ఏక్సెప్టెన్స్ చటబద్ధత పక్కన పెడితే.. మీ రచనా శైలిలో ఎంత క్లిష్టమైన అంశమైనా ఇట్టే ఇమిడి పోతుంది. సామాజిక ప్రామాణికత కోణంలో తీవ్ర చర్చకు తెరతీసే అంశం, రానున్న రోజుల్లో. తెలుగులో మీరు విభిన్నంగా ఆరంభించారు. చక్కని ప్రజంటేషన్ అండీ.
మీ ఆత్మీయ స్పందనకు మీ అభిమానానికి హృదయ పూర్వక ధన్యవాదాలండీ🙏🏻🙏🏻
A day will come which slips from Indian orthodox thinking and become universal. And so , stopped thinking about tomorrow. If tomorrow is there, it comes .Navneeth ❤️
Yes brother, who knows what’s in our fate for tomorrow… Let’s live in today😀😀😀
విదేశాల్లో స్టిర పడే వాళ్లు అక్కడి సంస్కృతికి అలవాటు పడక తప్పదు.నూటికి నూరు పాళ్లు భారతీయ సంస్కృతిని నర నరాన జీర్ణించుకున్న వారు అక్కడి విదేశ సంస్కృతిని అంత త్వరగా జీర్ణించు కో లేరు.పెద్దలు తమ పిల్లలి దగ్గరకు వెళ్లినప్పుడు ఇటువంటి సన్నివేశాలను సీరియస్ గా పట్టించుకొవద్దని హెచ్చరించడం మామూలే! అక్కడివారి సంస్కృతి–వారి స్వేచ్చ మనకు ఎప్పడూ భిన్నమే! ఆ.. జబ్బు మనకు అంటకుండా చూసుకోవడమె ముఖ్యం. ఇటువంటి ప్రత్యేకమైన కథనాలు అందిస్తున్న చిరంజీవి ఝాన్సీ కి అభినందనలు.
మీ ఆత్మీయతకు నా నమస్సులు డాక్టరుగారూ… 🙏🏻🙏🏻🙏🏻
మీ నరనరాల్లో బారతీయ సంస్కృతి జీర్ణించుకుని ఉన్నందున ఇలాంటి విషయాలను మీరు అంగీకరించలేరు అనేది వాస్తవమే. కానీ పరిస్ధితుల ప్రభావం అలాంటిది అని సర్ధాచెప్పుకోక తప్పదు అని నా అభిప్రాయం మేడమ్ . ఇలాంటి విషయాలతో రచనలను చేస్తున్న మీకు అభినందనలు, మరియు ధన్యవాదములు.
మీ అమూల్యమైన స్పందనకు ధన్యవాదాలు సాగర్ గారూ🙏🏻🙏🏻🙏🏻
Jansi Jhansi Srinivas ❤️ Manam edagalemu Manaki digest chesukovadam kashtam 🙃
…..Anuradha Bandi
పరిపక్వత అనేది వయసుకు కాదు మెదడుకు అని తెలుసుకున్న రోజు అందరూ మెచ్చే పదబంధం మీ కవనం….. విభిన్నతను గొప్పగా చెప్పారు…
….Emgies Maddineni
ఎలాంటి విషయాన్ని అయినా సూటిగా,స్పష్టంగా ..చదవటానికి ఇబ్బంది లేకుండా…భలే చెప్పగలరు… కొత్త సంస్కృతులు, పరిస్థితులు గురుంచి తెలుస్తున్నాయి..
…… Ramadevi Yenumala
😲🙄😶 కొత్త, కొత్త విషయాలు తెలుస్తున్నాయి… ఏంటో……ఎలా ఐపోతున్నారో….
…..రమాదేవి
Jhansi Garu! Mee rachanalu prathyekam!! Vaatini prathyekamgaane chadavaali!!! Appude aa rachanallo amsham,saaraamsham ardham chesukogalamu!!!! Antha goppagaa vraasthunnanduku meeku Dhanyavaadaalandi 🙏🙏🙏
సాంబశివరావుగారూ, మీ అభిమానానికి ధన్యవాదాలండీ…🙏🏻🙏🏻🙏🏻
ప్రకృతి కి, సృష్టి ధర్మానికి, విరుద్ధమైన ప్రక్రియలను, శాస్త్రీయత మాటున అంగీకరించటం మాతృత్వాన్ని త్రునీకరించటమే. దాన్ని నిర్హేతుక తతో వ్యతిరేకించాలి.మీభావన సహేతుకం, వ్యక్తీకరణ శైలి బాగుంది.
వేణుగోపాలనాయుడుగారూ, మీ స్పందనకు హృదయ పూర్వక ధన్యవాదాలండీ🙏🏻🙏🏻
ఎంతటి సంక్లిష్టమైన విషయాన్ని అయినా సరే మీరు రాసిన విధానం చాలా అద్భుతంగా ఉంది ప్రత్యక్షంగా చూస్తున్నట్లు గా ఉంది మీ కథనం. ఇదే మీ రచనలో ఉన్న గొప్పతనం.
మనిషి యూనివర్సల్, సంస్కృతి ప్రాంతీయం.
…..Saleem Mohammad
స్రి పురుష అనే లింగ భేదంలేకుండా ఎవరి స్పర్శ ఆనందాన్ని ఇస్తుందో .. ఎవరి సాన్నిహిత్యాన్ని మనసు కోరుకుంటుంది అనేది ముఖ్యం.. ఆలోచించాల్సిన విషయమే.. సృష్టి ధర్మం ప్రకారం లైంగిక వాంఛలు సహజం.. అది ఆపోజిట్ సెక్స్ వారైతే మంచిదే.. కాని పక్షంలో వారి మనోభావాలకు అనుగుణంగానే జీవించ నియాలి కదా.. సమాజంలో మనం పెరిగిన విధానాన్ని బట్టి ఇవన్నీ ఘోరమైనవిషయం గా భావిస్తూ ఉంటాం.. ఎవరి అభిరుచి వారిది అని వదిలే యటమా.. నిగ్గదీసి తుంచే యడమా..
చత్రపతిగారూ, మీ స్పందన ఆలోచనాత్మకంగా బావుంది… ధన్యవాదాలు. తిరిగి నాకే ప్రశ్న సంధించారా🤣🤣🤣
… ప్రతివారం మీ గువ్వ ఒక బాంబు పేలుస్తూ ఉంటుంది మా మెదళ్లలో ….నిజంగా చాలా కొత్త అంశాలు నచ్చినవీ… నచ్చనివీ…. అర్ధం అవుతున్నవీ…కానివీ…. చాలా దైర్యంగా,బోల్డ్ గా రాస్తున్నారు….హాట్సాఫ్…చివర్లో మీరన్నది నిజమే ఆ స్థాయికి మన మనస్సులు ఎదగాలంటే చాలా కష్టం…💐
…….నాగజ్యోతి
మనం జీర్ణించుకోలేని విషయం….కానీ వింటున్నాము..చూస్తున్నాము.కొన్నిదేశాలు చట్టబద్దత కలిపించిన విషయం ను చూస్తే దీని తీవ్రత సమాజంపై ఎంత ఉందో తెలిసిపోతుంది.చాలా బాగా వ్రాశారు జాన్సీ👌👍💐
Thank you మాధవీ, మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు డియర్💖💖
నాకు మీ కవితలు గానీ కధలు గానీ వ్యాసాలు కానీ చదివేటప్పుడు ఝాన్సీ లక్ష్మీ బాయి గుర్తు వస్తుంది ఆ డేరింగ్ నెస్ కు సలాం.చదవడానికి మేము తడబడాలి కానీ మీలో వ్రాయడానికి ఎటువంటి తడబాటు ఉండదు కదా…. సరి క్రొత్త విషయాలను శోధించి , సరియైన శైలి జోడించి సుమధురంగా అందిస్తున్న మీ గువ్వ కు హాట్సాఫ్ హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు ఝాన్సీ గారు 💐👏💐👏💐👏💐👏💐👏💐👏💐
వలీషా, thank you darling… Thanks a lot for your lovely compliment 💖💞💞
మీ కథ, కథనం రెండూ చాలా బాగున్నాయి. కానీ కథలో కనపడిన సౌందర్యం తర్వాత మీరు చెప్పిన మాటల్లో కొరవడింది. కథలో అంత అద్భుతంగా లెస్బియన్ ప్రేమనని ప్రెజెంట్ చేసిన మీరు, ఆ కథ వ్రాయడానికి కారణవైన మీ అనుభవంలో మాత్రం, లెస్బియన్ ప్రేమ మన హెట్రో సెక్స్ ప్రేమలాగానే అదికూడా ఒక సహజవైన ప్రేమ, అదికూడా శరీరం నుంచి మాత్రవే కాదు, మనసు నుంచి స్రవించే ప్రేమ అని వప్పుకోలేకపోయారు. మీ కథలో ఆ ప్రేమని అంత అద్భుతంగా చిత్రీకరించిన మీరు, అది ఒక ఆడా, మగ మధ్య ప్రేమ లాగే సహజవయినది అని వప్పుకోడానికి భయపడిపోయారని నేను అనుకుంటున్నాను ఆ తర్వాత వచ్ఛే కామెంట్లకి వెరసి.
మీ కథ మీద వఛ్చిన కామెంట్లని కూడా చదివేను. ఈ ఇరవై ఒకటవ శతాబ్దం లో కూడా, సైన్సు అది సహజవే అని మళ్ళి మళ్ళీ చెబుతున్నా కూడా, మనసులో ఆ మాలిన్యం మిగిలిన విమర్శలనిచూసాను, వాటికి మీ సపోర్టు చదివేను.
దాదాపు ఆ కామెంట్ల అన్నింటిలో ఒక కామన్ త్రెడ్ కనిపిస్తుంది. అత్యంత ఉత్తమమైన భారత సంస్కృతి, డైరెక్టుగానో ఇండైరెక్టుగానో. ఈ ఉత్కృష్టవైన భారత సంస్కృతి అనే అబద్దపు భావన ఈ మధ్య చాలా ఎక్కువ మంది నోళ్ళలో వింటున్నాను. ఏవిటి ఉత్కృష్టవైన భారత సంస్కృతి, విదేశీయులు కూడా ప్రశంసించే ఈ సంస్కృతి (😂😂😂😂?) బ్రిటిషోళ్ళు వచ్ఛేదాకా అసలు భారత దేశవె లేదు, చిన్న, చిన్న రాజ్యాలు, తర్వాత చాలా వరకు మొఘల్ సామ్రాజ్యం తప్ప. భారత దేసవనే భావన అంటే, but it has no existence till the arrival of British. పోనీ భావనైనా ఉంది కదా అనుకుంటే ఆ ఉత్కృష్టవైన భారత సంస్క్రుతి కోసం ఎంత వెనక్కి పోదాం. బ్రిటిష్ రాజ్ కంటే వెనక్కా? దానిని కూడా దాటేసి, మొగ్గలు సామ్రాజ్యాన్ని వదిలేసి, ఇంకా వెనక్కా, ఇంకా ఇంకా వెనక్కా? పరవాలేదు ఎంత వెనక్కిపోయినా, ఎక్కడకి పోయినా, మనం కూడా ఒక మానవ సమూహవే, ఒక కలసి బతకడం నేర్చుకున్న సంఘవే. కాకపొతే వెనక్కిపోయే కొద్దీ ఇప్పటి అబద్దాల్లో జయధ్వనాలు చేస్తున్న ఆ భారత సంస్కృతి రంగుమాసి పేలవంగా అయిపోతుంది.
ఇప్పటి మన మన విలువలు చరిత్రలో నాలుగు అడుగులు వేసినా సరే అప్పటి విలువలతో కయ్యానికి కాలుదువ్వుతాయి. మనం ఇప్పుడు ముగ్గురు నలుగురు పెళ్లాలని ఒక మగాడికి వప్పుకోవు. వాళ్ళు చాలక డబ్బు అధికారం ఉంటే ఒక వందో, వెయ్యో ఉంపుడుగత్తెలనిఅసలు వప్పుకోవు. మరి ఆ చరిత్రనిండా, ఆ పురాణాలనిండా ఆవేకదా, చక్రవర్తినుంచి, రాజగురువు నుంచి, వర్తక శ్రేష్ఠినుంచి, డబ్బు అధికారం ఉన్న ప్రతి మగాడినుంచి! ఒక్క సారి, ఒక్క రాత్రి, తెలిసి తెలియని ఆ స్పర్శ అంతే ఇక బతుకులో ఇక అది లేదు. వస్తు పరవైన అవసరాలకి లోటు లేదు, కడుపునిండా మృష్టాన్న భోజనం ఆ అంతఃపురాలు, ఆ ఆశ్రమాలు, ఆ జనానాలు, మనసుకుకి తోడు తప్ప మారే లోటు లేదు. చుట్టూ వీచ్చు కత్తుల పహారా (గురువుల ఆశ్రమాలలో ప్రాణాంతకవైన వేలి,) కదం తొక్కే కోరికలు, చుట్టూ ఎటుచూస్తే అటు తనలాటి అభాగినులే, ఆ కారిన కన్నీరు ఇంకెవరికి అర్థం అవుతుంది? తనలాటి వాళ్ళకిగాక? ప్రాచీన భారతం లో లెస్బియనిజం ఒక నిజం ఎవరు వప్పుకోకపోయినా.
మీరు కాదు, కానీ ఇప్పటి జనాలు ఈ అబద్దాన్ని ఎంతకాలం ఇలా మోస్తారు, ఈ ఉత్కృష్టవైన భారత సంస్కృతి అనే అబద్దాన్ని? యూనివర్సిటికి పోవడవే చదువు కాదు, చరిత్రని చదవకపోతే, మారే చదువున్నా ఆ బావిలో కప్ప మెంటాలిటీనే.
కాకపొతే వ్రాయటం చేతనైన మీలాటి వాళ్ళు వ్రాయాలా, కానీ వ్రాసిన దానికి సిగ్గుపడకుండా, భయపడకుండా.
ఆఖరుగా మీ కథ అద్భుతంగా ఉంది.
రవికిరణ్ గారూ, hats off to your in depth knowledge👍👍👍 మీరన్నట్టు ప్రాచీన భారతంలో లెస్బియనిజం ఒక నిజమే కావచ్చు గాక…. ! తరతరాలుగా పితృస్వామ్యం నరనరాల్లో జీర్ణించుకుపోయి భర్త అధికార దురహంకారాలకు ఇప్పటికీ భార్య తలవంచటం ఎంత నిజమో స్వలింగ సంపర్కం సహజమేనని అంగీకరించకపోవటం కూడా అంతే నిజం…. ఇది భయపడి మాత్రం కాదు…భయపడే దాన్నయితే అసలు ఈ ఎపిసోడ్ రాయను… ఒకవిధమైన ఏవగింపు.. అయిష్టత… అంతకన్నా వివరించి చెప్పలేను.
Anyways Heartfelt thanks for your analytical comment🙏🏻🙏🏻🙏🏻
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™