సంచికలో తాజాగా

Related Articles

11 Comments

  1. 1

    Yamini Devi

    గురువర్యా ఈ భాగం కూడా బావుంది. ఎన్నికల్లో కుటుంబం సపోర్ట్ గురించి మీరు చెప్పింది అక్షరాలా నిజం. ఇంట గెలిచాక రచ్చ గెలవాలి అన్న సామెత గుర్తు వచ్చింది.
    పోటీ చేయడం సహజం అనుకుంటే.. గెలుపుఎవరిదో ఒకరిదే అవుతుంది.
    *గెలుపు ఎంత బావుంటుందో ఓటమి కూడా అంతే బావుంటుందని త్రిపురగారి హాయి నవ్వు చెప్పింది. ఆ హాయి నవ్వు మాది కూడా.. ధన్యవాదాలు మీకు 🙏💐

    Reply
    1. 1.1

      BhuvanaChandra

      యామీజీ హృదయపూర్వక ధన్యవాదాలు చక్కని కామెంట్ పెట్టినందుకు
      వారం వారం మీరిచ్చే ఈ కానుకలు నాకు ఎంతో స్ఫూర్తిని ఆనందాన్ని ఇస్తున్నాయి మరోసారి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు.. భువనచంద్ర

      Reply
  2. 2

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    “జరుగుబాటు సమస్యలు” ఎంత కరెక్ట్ గా చెప్పారు భువన్ జీ! ఇలాంటివారు ఏమీ తోచక, ఏమీ లేని దగ్తాగర తామే సమస్యని సృష్టిస్తారు, గలాభా చేస్తారు, చివరికి తామే పరిష్కరించినట్టు నటించి తమ సబ్బం గడుపుకుంటారు. “జరుగుబాటు” చేసుకుంటారు. ఒక్క గ్రామంలోని… ఒక్క మహిళా మండలి లోనే ఇన్ని రాజకీయాలు ఉంటే, రాష్ట్రంలో, దేశంలో రాజకీయాలు ఎలా నడుస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. బ్రాందీ షాపులకి గాంధీజీ పేరు పెట్టుకుంటున్న రోజుల్లో ఝాన్సీ లక్ష్మీబాయి పేరు పెట్టుకున్న మహిళా మండలిలో నీచ రాజకీయాలు చేయడం, నిజాయితీ గల త్రిపుర గారు ఓడిపోవడం ఆశ్చర్యమేముంది!.
    ఇంతకీ మహతి వాళ్ళమ్మా నాన్న ముభావం వెనుక కారణం ఏమిటో సస్పెన్స్ లోనే ఉంచారు –
    తరువాయి భాగాల కోసం ఎదురుచూసేలా!

    Reply
    1. 2.1

      BhuvanaChandra

      సుశీల గారు హృదయపూర్వక ధన్యవాదాలు
      మీ స్పందన నా సీరియల్ కి ఆక్సిజన్
      ఎందుకంటే మీరు కేవలం పైపైన చదవకుండా లోతుగా చదివి స్పష్టమైన స్పందన ఇస్తారు చాలా చాలా సంతోషం. గుండెల్లో మీకు కృతజ్ఞతలు నమస్సులతో భువన చంద్ర

      Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమాదేవి గారి స్పందన: *నమస్కారం భువన చంద్ర గారూ.
    ఈ సంచికలో మీరు చూపించిన స్త్రీల మనోభావాలు ఎలా ఉంటాయో, పర్యవసానం ఎలా ఉంటుందో చూపించారు.
    ఏ పని చేసినా స్త్రీ పురుషులు కంటే ఎక్కువ బలంగా ఉండగలదు. శక్తిమంతురాలు. ఏమైనా చేయగల శక్తి ఉంటుంది.
    త్రిపుర గారి పాత్ర పోషణ బాగుంది.
    బంధాలు స్నేహం విషయంలో మీ అభిప్రాయం అభినందనీయం.
    స్త్రీ మనసుని అన్ని కోణాల్లో చూపిస్తూ సాగే మీ రచనకు నా ధన్యవాదాలు అండీ.

    Reply
    1. 3.1

      BhuvanaChandra

      హృదయపూర్వక ధన్యవాదాలు రమాదేవి గారు చాలా చాలా చక్కగా వారం వారం మీ స్పందనని తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు. పాఠకుల స్పందన రచనకి గీటురాయి
      మరోసారి కృతజ్ఞతలతో ధన్యవాదాలుతో భువనచంద్ర

      Reply
  4. 4

    Sobharaja

    🙏 మనిషి జీవితంలో ఎందులో రాజీపడినా పడకపోయినా ఫరవాలేదు కానీ తన మనసుతో రాజీపడడం చాలా ముఖ్యం మీరు రాసినట్లు. లేకపోతే మనశ్శాంతి లేక జీవితంలో ప్రశాంతతను కోల్పోతాము.
    నేటి తరం ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకొని తల్లుల ప్రభావంతో విడాకులు దాకా వెళ్ళడం సహజమైపోయింది. స్త్రీ స్వాతంత్ర్యం పేరుతో మహిళాభ్యుదయానికి పాటుపడాల్సిన మహిళా మండలి నిర్వాహకులు ఇలా విజృంభించడం కూడా సామాన్యమై పోతోంది.ఇద్దరి మధ్య సఖ్యతను కుదర్చడం మానేసి, వారిని విడదీయాలనే తలపే తప్పు దానికి తోడు అందర్నీ సపోర్టు చెయ్యమని అడగడం, నిజంగా ఈ మార్పు ఎక్కడికి దారితీస్తుందో!?!?!?
    ఇంతటి నీచ నికృష్ట ప్రెసిడెంట్ ను ఎందుకు గెలిపింప జేసారు?నాకర్థంకాలేదు. నచ్చలేదు కూడా. అందులోనూ “సలక్షణంగా”ఓడిపోయారనడం.
    ధన్యవాదాలు 🙏🌹🙏

    Reply
    1. 4.1

      Rohini

      శ్రీ భువన చంద్ర గారికి నమస్సులు. రాజకీయాలు మహిళా మండలాలలో కూడా ఎలా ప్రవేశం చేస్తాయో డబ్బు సంపాదనకు కుటుంబ సమస్య లను అడ్డం పెట్టుకొని ఇల్లాలకు వెలయాలికి బేధం లేకుండా నేడు జరిగే తంతు బాగా శెలవు ఇచ్చారు..నేటి సమాజం లో ప్రతీ కారం, డబ్బు సంపాదన ఈ రెండూ మనిషి మనసును ఆక్రమించి ఎన్నో అకృత్యాలకు కారణం అవుతున్నాయి. జీవితం అనే నదిలో స్నేహమనే కాలువలు కలసి పోయి జీవితాన్ని సులభం చేస్తాయి ” సత్యం చెప్పారండీ. రాజకీయ లలో గెలవాలంటే మంచి లాభం లేదు అడ్డదారులే గెలుపు తెస్తాయి. సామాన్యుడు తాత్కాలిక ప్రయోజనమే ఆశిస్తున్నాడు ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే వాడికే ఓటు త్రిపుర లాంటి వాళ్ళు ఎలా గెలుస్తారు. ఓడినా నవ్వుకోవటం😄 👌-ధన్యవాదాలు అండీ -రోహిణి

      Reply
    2. 4.2

      BhuvanaChandra

      శోభ రాజా గారు చాలా చక్కని విషణతో మీ స్పందనని తెలిపినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా చక్కగా చదివి మంచి విషయాలు ప్రస్తావించారు
      ఇందులో త్రిపుర ఎన్నికలలో ఓడిపోవడం అనేది తాత్కాలికం ఎందుకంటే ప్రతి ఓటమి గెలుపుకి ఒక మెట్టు లాంటిది
      ఆ విషయం రాబోయే సంచికలలో చూస్తారు
      చక్కగా చదివి మీ స్పందన తెలియజేసినందుకు మరోసారి మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు
      భువనచంద్ర

      Reply
  5. 5

    Sobharaja

    త్రిపుర లాంటి వాళ్ళు ఓడిపోవడం నేటి సామాజికపరిస్థితుల్లో సర్వసాధారణం.కనీసం నవలలోనైనా నైతికంగా దిగజారిపోయినసమాజాన్ని దూరం పెట్టి నీతిని న్యాయాన్ని గెలిపించి ప్రజల్లో ఉత్తేజాన్ని కలుగ చేయాలనే చిన్ని ఆశ నా స్పందనకు స్పూర్తి🙏

    Reply
    1. 5.1

      BhuvanaChandra

      శోభ గారు నమస్కారం. ఓడిపోవడం గెలవడానికే.. దూరం ఉండటం దగ్గర అవడానికే
      రాబోయే సంచికలలో త్రిపుర గారి నిజమైన గెలుపుని చూస్తారు మరోసారి మరోసారి మీకు ధన్యవాదాలు తో భువనచంద్ర

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!