అజమీఢుని రెండో కుమారుడైన నీలుని వంశస్ఢుడైన భర్మ్యశ్వుని కుమారుడు ముద్గలుడు. ఇతనికి అవినరుడు-సృంజయుడు-కాంపిల్యుడు అనే సోదరులు ఉన్నారు. ముద్గలుడు అతనికి దివోదాసుడు అనే కుమారుడు అహల్య జన్మించారు. అహల్య గౌతమముని దంపతులకు శతానందుడు జన్మంచాడు. అతనికి సత్యధృతి అతనికి శరద్వంతుడు అతను ఊర్వశి ని చూసి మోహించగా కవలపిల్లలు కలిగారు. వారికి కృపి-కృపుడు అనిపేర్లు పెట్టి శంతనుడు అనేరాజు పెంచాడు, కృపి ద్రోణాచార్యుని భార్య అయింది. దివోదాసుకు మిత్రాయువు అతనికి చవ్యనుడు అతనికి సుధాసుడు అతనికి సహదేవుడు అతనికి సోమకుడు అతనికి సుజన్మకృత్తు అతనికి పలువురు సంతతి కలిగారు. వారిలో పెద్దవాడు జంతువు, చివరివాడు ప్రషతుడు. అతనికి ద్రుపదుడు అతనికి ధృష్టద్యుమ్నుడు-శిఖండి-ద్రౌపది జన్మించారు.
ధృష్టద్యుమ్నుడికి ధృష్టకేతువు జన్మించాడు. అజమీఢునికి బుక్షుడు అతనికి సంవరుణుడు ఇతను సూర్యుని కూతురు తపతిని వివాహం చేసుకున్నాడు. వారికి కురువు జన్మించాడు. ఇతను శుభాంగిని వివాహంచేసుకున్నాడు. వీరికి పరిక్షిత్తు-సుధనువు-జహ్నువు-నిషాదుడు-అనే పుత్రులు సంతానం కలిగారు.
సుధనువు కుసుహాత్రుడు అతనికి చవ్యనుడు అతనికి కృతి అతనికి ఉపరిచర వసువు అతనికి బృహధ్రదుడు-కుసుంభవుడు-మత్స్యుడు-ప్రత్యగ్రుడు-ఛేదిషుడు మెదలగువారు జన్మించారు. బృహద్రదునికి కుశాగ్రుడు అతనికి బుషభుడు అతనికి సత్యహితుడు అతనికి పుష్పవంతుడు అతనికి జహ్నువు జన్మించారు. ఈ బృహద్రధునికి జరాసంధుడు అతనికి సహదేవుడు అతనికి సోమాపి అతనికి శ్రుతశ్రవుడు జన్మించారు.
జహ్నువుకు సురధుడు-అతనికి విధూరధుడు అతనికి సార్వబౌముడు అతనికి జయత్సేనుడు అతనికి రధికుడు అతనికి అతాయువు అతనికి క్రోధనుడు అతనికి దేవాతిధి అతనికి బుక్షుడు అతనికి భీమసేనుడు ఇతని భార్య కుమారి. వీరికి పరిశ్రవసుడు అతనికి ప్రతీపుడు ఇతని భార్య సునంద. వీరికి దేవాపి-శంతనుడు-బాహ్లికుడు కలిగారు. వీరిలో దేవాపి తపస్సుకై అడవులకు వెళ్ళాడు. శంతనుడు రాజు అయ్యడు. గంగ భీష్మునికి జన్మనిచ్చివెళ్ళిపోయింది. శంతనుడు దశరాజు పుత్రిక సత్యవతిని (మత్స్యగంధి) వివాహం చేసుకోగా చిత్రాంగదుడు-విచిత్రవీర్యుడు జన్మించారు. సత్యవతి పెండ్లికి ముందే పరాశరముని వరాన వ్యాసునికి జన్మనిచ్చింది. తండ్రి కొరకు బ్రహ్మచారిగా మారిన భీష్ముడు కాశీరాజు కుమార్తెలు అయిన అంబిక-అంబాలికలను తెచ్చి తన తమ్ముళ్ళతో వివాహం జరిపించాడు. అంబ సాళ్వుడిని ప్రేమించింది అని తెలిసి గౌరవంగా ఆమెను పంపించాడు. తన పేరే కలిగిన గంధర్వుడితో పోరాడి చిత్రాంగదుడు మరణంచాడు. క్షయరోగ పీడితుడై విచిత్రవీర్యుడు సంతానహీనుడిగా మరణించాడు. అతని భార్యలకు సత్యవతి కోరిక మేరకు వ్యాసమహర్షిచే ధృతరాష్ట్రుడు-పాండురాజు-విదురుడు జన్మించారు.
రచనలతో పాటు సంఘసేవకుడిగా ప్రసిద్ధిచెందిన బెల్లంకొండ నాగేశ్వరరావు 12-05-1954 నాడు గుంటూరులో జన్మించారు. వీరి నాలుగు వందలకు పైగా రచనలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. రాష్ట్రేతర బాలసాహితీవేత్తగా జాతీయస్థాయి గుర్తింపు పొందిన నాగేశ్వరరావుకి రావూరి భరధ్వాజ స్మారక తొలి పురస్కారం లభించింది. చెన్నైలో తెలుగులో చదివే బాలబాలికలకు ప్రోత్సాహక బహుమతులు అందిస్తూ తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్నారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™