(విహస్య) హంహో బహ్మణ, అత్తకేరకస్స జెవ్వ, మహ ధమ్మ భాదుణో ఘరం హోది. తా దేహి మే పవేసం జావ దే ఉవజ్జాఅస్స జమపడం పసారిఅ ధమ్మం ఉవదిసామి. (అహో బ్రాహ్మణ, ఆత్మీయ స్యైవ, మమ ధర్మభ్రాతు ర్గృహంభవతి। తస్మాద్ దేహి మే ప్రవేశం, యావత్తవోపాధ్యాయస్య యమపటం ప్రసార్య ధర్మ ముపదిశామి।)
(విహస్య=నవ్వి), అహో+ బ్రాహ్మణః= ఒయ్యోయి బాపనయ్యా!, ఆత్మీయస్య+ఏవ= కావలసిన వారిదే, మమ+దర్మభ్రాతుః=నా వృత్తి ధర్మం వల్ల సోదరుడైనవాడి, గృహం+భవతి= ఇల్లులాగుంది (అతడి ఇల్లే ఇది), తస్మాత్+మే+ప్రవేశం+దేహి=కనుక నాకు దారియ్యి (నన్ను లోపలికి పోనియ్యి), తవ+ఉపాధ్యాయస్య=నీ గురువుగారికి, యమపటం+ప్రసార్య= (ఈ) యమపటాన్ని పరిచిపెట్టి, యావత్+ధర్మ+ఉపశామి=తగినంత ధర్మం బోధిస్తాను.
(సక్రోధమ్) ధిఞ్ మూర్ఖ, కిం భవాన్ అస్మ దుపాధ్యాయా దపి ధర్మవిత్తరః?
ధిక్+మూర్ఖ=ఛీ, మొద్దా! (బుద్ధిహీనుడా!), భవన్=నువ్వు, అస్మాత్+ఉపాధ్యాయాత్+అపి=మా గురువుగారి కంటే కూడా, ధర్మవిత్ తరః+కిమ్=ఎక్కువ ధర్మం తెలిసినవాడివా ఏమి?
హంహో బహ్మణ. మా కుప్ప, ణ హి సవ్వో సవ్వం జాణాది. తా కిం వి తే ఉవజ్జయో జాణాది, కిం వి అహ్మా రిసా జాణన్ది. (అహో బాహ్మణ! మా కుప్య। న హి సర్వః సర్వం జానాతి। తత్ కి మపి తవ ఉపాధ్యా యో జానాతి, కి మప్యస్మాదృశా జానన్తి।)
అహో+బ్రాహ్మణః= ఒయ్యోయి బాపనయ్యా, మా+కుప్య=కోపగించకయ్యా! సర్వః+సర్వం+న+జానాతి= ప్రతి మనిషికీ అన్నీ తెలియవు, తత్ (కారణాత్)=అందువల్ల, తవ+ఉపాధ్యాయః+కిమ్+అపి+జానాతి=నీ గురువుగారికి ఏ మాత్రం తెలుసునో, కిమ్+అసి=అంతమాత్రం, అస్మాదృశాః=మా బోటి వాళ్ళు (కూడా), జానంతి=ఎరిగినవాళ్ళై వుంటారు.
మూర్ఖః సర్వజ్ఞతా ముపాధ్యాయస్య చోరయితు మిచ్ఛసి.
మూర్ఖః=బుద్ధిహీనుడా!, ఉపాధ్యాయస్య+సర్వజ్ఞతాః= (మా) గురువు (గారి) పాండిత్యాన్ని, చోరయితుం+ఇచ్ఛసి=దొంగిలించాలనుకుంటున్నావు!
హంహో బహ్మణ, జఇ తవ ఉవజ్ఝాయో సవ్వం జాణాది, తా జాణాదు దావ కస్స చన్దో అణభిప్పేదోత్తి. (అహో బ్రాహ్మణ, యది తవోపాధ్యాయః సర్వం జానాతి, తర్హి జానాతు తావత్ కస్య చన్ద్రో అనభిప్రేత ఇతి.)
అహో+బ్రాహ్మణః= ఒయ్యోయి బాపనయ్యా, తవ+ఉపాధ్యాయః=నీ గురువు (గారు), యది+సర్వం+జానాతి+తర్హి=అన్నీ తెలిసినవాడే అయితే, కస్య=ఎవడికి, చన్ద్రః=చంద్రుడు, అనభిప్రేతః+ఇతి=ఇష్టుడు కాడో అనే విషయం, జానాతు=తెలుసుకోమను.
మూర్ఖ, కి మనేన జ్ఞాతే నాజ్ఞాతేన వా?
మూర్ఖ=ఓరి మొద్దా! అనేన=దీనిని, జ్ఞాతేన+అజ్ఞాతేన+వా+కిం=తెలిస్తే ఎంత తెలియకపోతే ఎంత?
తవ ఉవజ్ఞాఓ ఎవ్వ జాణిస్సది, జం ఇమిణా జాణిదేణ హోది. తుమం దావ ఎత్తి అం జాణాసి, కమలాణం చన్దో అణబ్భిప్పే దొత్తి. ణం పేక్ఖ. (తవ ఉపాధ్యాయ ఏవ జ్ఞాస్యతి య దేతేన జ్ఞాతేన భవతి। త్వం తావ దేతావత్ జానాసి, కమలానాంచన్ద్రో నభిప్రేత ఇతి। నను పశ్య.)
ఏతేన+జ్ఞానేన=దీనిని తెలుసుకొనడం వల్ల (తో), తవ+ఉపాధ్యాయః=నీ గురువు (గారే), జ్ఞాస్యతి+భవతి=తెలిసినవారవుతారు (అవుతాడు), త్వం=నువ్వు, తావత్+ఏతావత్=ఈపాటి… (అంటే), కమలానామ్=తామరపువ్వులకు, చంద్రః=చంద్రుడు, అనభిప్రేతః=ఇష్టుడు కాడని, జ్ఞాస్యసి=తెలుసుకుంటావు, పశ్య+నను=చూడవయ్యా!
కమలాణ మణహరాణ వి రూఆహిన్తో విసంవదఇ సీలమ్।
సంపుణ్ణమణ్ణలమ్మ వి జాఇం చన్దే విరుద్ధాఇం॥ -19
[కమలానాం మనోహరాణా మపి రూపా ద్విసంవదతి శీలమ్।
సంపూర్ణ మణ్డలేఽపి యాని చన్ద్రౌ విరుద్ధాని॥]
యాని=ఏ పద్మాలైతే, మనోహరాణాం+అపి+కమలానాం=అందమైనవైనప్పటికీ పద్మాల (యొక్క), శీలం=స్వభావం, రూపాత్=రూపానికైతే (వలన), విసంవదతి=తగి ఉండదు, సంపూర్ణమణ్డలే+అపి=పరిపూర్ణత్వం (గుండ్రనిదనం) ఉన్నా, చన్ద్రే=చంద్రుని పట్ల (యందు), విరుద్ధాని (భవన్తి)=విరోధం కలవే కాగలవు.
చారుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. చాణక్యుడి శిష్యుడే కదా అని చనువుగా తన రహస్యం బయటపెట్టడం లేదు. అయితే గూఢంగా ‘చంద్ర’, ‘కమల’ సంబంధాల విమర్శ ద్వారా, చాణక్యునికి తన వార్త ఎంత ముఖ్యమో యీ శిష్యుడికి వ్యంగ్యంగా సూచించాలని ప్రయత్నిస్తున్నాడు. అది శిష్యుడి తలకెక్కడం లేదు.
చంద్రుడికీ పద్మాలకీ చుక్కెదురు. అవి గుండ్రంగా (పరిపూర్ణంగా) చక్కగా ఉండవచ్చు గాక – స్వభావం చేత అవి చంద్రుడికి వ్యతిరేకం – అని సూచన.
చంద్రుడంటే ఇక్కడ చంద్రగుప్తుడు. కమలాలంటే శత్రుపక్షంవాళ్ళు. ‘సంపూర్ణ మండలం’ అనే ప్రయోగం ద్వారా రాజ్యాధికార సూచన.
ఇంటి లోపలి నుంచి వీరి సంభాషణ విన్న చాణక్యుడికి పరిస్థితి అర్థమయింది.
అప్రస్తుత ప్రశంసాలంకారం.
ఇక్కడ చంద్రుడు – కమలాలు – ప్రశంస అవసరం కాదు. అయితే ప్రస్తుత సందర్భాన్ని అనుసరించే వుంది.
ఆర్యావృత్తం.
(ఆకర్ణ్య ఆత్మగతమ్) అయే చన్ద్రగుప్తా దప రక్తాన్ పురుషాన్ జానా మీ త్యుపక్షిప్త మనేన।
(ఆకర్ణ్య=విని, ఆత్మగతమ్=తనలో), అయే=ఓహో!, చంద్రగుప్తాత్=చంద్రగుప్తుని పట్ల (వలన), అపరక్తాన్+పురుషాన్=వ్యతిరేకులైనవారిని, జానామి+ఇతి=ఎరుగుదునని, అనేన=ఈ గూఢచారి (చేత), ఉపక్షిప్తం=వెల్లడిస్తున్నాడు (వెల్లడించబడుతోంది).
మూర్ఖ, కి మిద మసంబద్ధ మభిధీయతే?
మూర్ఖ=ఓరి మూఢుడా, కిం+ఇదం+అసంబద్ధం+అభిధీయతే=తల తోక లేని మాట మాట్లాడుతున్నావేం? (మాట్లాడబడుతోంది?)
హంహో బహ్మణ, సుసంబద్ధం జ్జేవ ఏదం భవే. (అహో బ్రాహ్మణ సుసంబద్ధమే వై తత్ భవేత్)
అహో+బ్రాహ్మణ=ఓయ్ బాపనయ్యా!, ఏతత్=ఇది, సు+సంబద్ధం+ఏవ=సందర్భశుద్ధి ఉన్నదే, భవేత్=కాగలదు.
యది కిం స్యాత్?
యదిస్యాత్+కిమ్=అయితే ఏమిటి (చెప్పు).
తాది సుణిదుం జాణన్తం లహే. (యది శ్రోతుం జానన్తం లభే.)
శ్రోతుం=వినడానికి, నాన్తం+యది+లభే+యది= వినేవాడు దొరికితే – అలాగే (దొరికే మాటుంటే).
భద్ర! విస్రబ్ధం ప్రవిశ. లప్స్యసే శ్రోతారం జ్ఞాతారం చ.
భద్ర=నాయనా!, విస్రబ్ధం=జంకు లేకుండా, ప్రవిశ=పంపించు (రానియ్యి), శ్రోతారం+జ్ఞాతారం+చ=వినేవాడు, తెలుసుకునేవాడు, లప్స్యసే=దొరుకుతారులే (నీకు).
ఏసో పవిసామి (ప్రవి శ్యోపసృత్య చ) జేదు అజ్జో (ఏష ప్రవిశామి. జయతు ఆర్యః)
ఏషః+ప్రవిశామి=ఇదిగో వచ్చాను. జయతు+ఆర్యః=అయ్యగారికి జయమగుగాక!
(విలోక్య, ఆత్మగతమ్) కథ మయం ప్రకృతిచిత్త పరిజ్ఞానే నియుక్తేనిపుణకః। (ప్రకాశమ్) భద్ర, స్వాగతమ్ – ఉపవిశ।
(విలోక్య=చూసి, ఆత్మగతమ్=తనలో), కథం+అయం+ప్రకృతి+చిత్త+పరిజ్ఞానే+నియుక్తం+నిపుణకః= ఏమిటీ! ఇతడు ప్రజల మనస్సులు తెలుసుకునేందుకు నియమించబడిన – (మన) నిపుణకుడు! (డే!), (ప్రకాశమ్=పైకి), భద్ర=నాయనా!, స్వాగతం, ఉపవిశ=కూర్చో!
జం అజ్జా ఆణవేది. [య దార్య ఆజ్ఞాపయతి] (భూమా వుపవిష్టః)
యత్+ఆర్యః+ఆజ్ఞాపయతి= అయ్యగారి ఆజ్ఞ, (భూమి=నేలమీద, ఉపవిష్టః=కూర్చున్నాడు).
(సశేషం)
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™