నేస్తమా మన స్నేహం
పువ్వులా ఒక్క రోజులో వాడి పోకూడదు.
ఆకులా కొన్ని రోజులలో రాలి పోకూడదు.
మంచులా కొన్ని గంటలలో కరిగిపోకూడదు.
అలలా కొన్ని క్షణాలలో తిరిగి పోకూడదు.
గాలిలా ఒక్కసారి వీచి ఆగిపోకూడదు.
చిరకాలం నన్ను వీడని నీడలా
కంటికి రెప్పలా మన స్నేహం నిలిచిపోవాలి.
ఆగిపోకు కాలమా ఆశతీరే వరకూ.
జారిపోకు మేఘమా జల్లు కురసే వరకూ.
రాలిపోకు పుష్పమా వసంతము వచ్చేవరకు.
మరిచిపోకు మిత్రమా ప్రాణం వున్నంతవరకూ.
2 Comments
Radhika naren
Very nice,
శ్రీధర్ చౌడారపు
పిల్లల స్నేహాన్ని వారి భాషలో ఆ స్థాయిలోనే బాగా వర్ణించారు పిల్లల శంకర్రావు గారూ….