సంచికలో తాజాగా

Related Articles

11 Comments

  1. 1

    జి.వి.శ్రీనివాస్

    కథనం చక్కగా కుదిరింది. స్వార్ధం కళ్ళు మూసినప్పుడు మనసు చీకటి అవుతుంది. మంచి కథ అందించిన వివేకానంద్ గారికి అభినందనలు

    Reply
    1. 1.1

      Dr.. Vivekanand Rayapeddi

      ధన్యవాదములు

      Reply
  2. 2

    రాయ పెద్దీ అప్పా శేషశాస్త్రి

    నీ కథ చదివాను ఆనంద్. అద్భుతంగా ఉంది. దీన్ని హారర్ స్టోరీ అనడం కంటే ఒక విషాదాంత కథ అనడం సముచితంగా ఉంటుందేమో. ఉత్కంఠభరితంగా సాగిన కథ చివరిలో ఒక అనూహ్యమైన మలుపుతో పాఠకులకు కళ్ళల్లో కన్నీళ్లు పెట్టించింది, గుండె లోతుల్ని తడిమింది. హృదయపూర్వక అభినందనలు.

    Reply
    1. 2.1

      Dr.. Vivekanand Rayapeddi

      థాంక్యూ వెరీ మచ్ అన్నా

      Reply
  3. 3

    HVSN Prasad Rao

    హారర్ నేపథ్యంలో మొదలైన కధ కాస్తా అనూహ్యమైన మలుపు తీసుకుంది ! పాఠకుల ఊహకు ఏమాత్రం అందని ముగింపు ఇది!

    తాము ఆర్థిక పరమైన కష్టాల నుంచి గట్టెక్కడానికి ! కన్న కొడుకునే (తెలియక) దొంగగా భ్రమించి! కడతేర్చడం దారుణమైనా! పాఠకులకు కళ్లు చెమ్మగిల్లేలా చేసింది!

    కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన కొడుకుని! తలిదండ్రులే హతమార్చడం విధి ఆడిన వింత నాటకం కాక మరేమిటి!

    రివ్యూలో ఈ సస్పెన్స్ బ్రేక్ చేసేస్తే! ఇంకా కధ చదవని పాఠకులు అసంతృప్తిగా ఫీలౌతారేమో!

    కధనం చాలా బాగుంది! ఆ కాళరాత్రి నాడు ప్రకృతి , వాతావరణ వర్ణన చాలా బాగున్నాయి!

    జోరుగా వర్షం పడుతూ వుంటే దూరంగా వస్తున్న కార్ హెడ్ లైట్ల కాంతిలో! చినుకులు పగిలిన గాజు ముక్కల్లా అహల్యకు కనిపిస్తున్నాయి! వాతావరణం కళ్లకు కట్టినట్టుండే ఇటువంటి వర్ణనలు పాఠకులను సన్నివేశంలో లీనం అయ్యేలా చేస్తాయి! నవలా సాహిత్యానికి ఇటువంటి వర్ణనలు ప్రాణం పోస్తాయి !

    ఇంతకీ క్లైమాక్స్ సుఖాంతమా? దుఃఖాంతమా? ఎక్కువగా చర్చించకుండా! ఆ కోణంలో నైతిక విలువలు ! పాప పుణ్య విచారణను! పాఠకుల విచక్షణకే వదిలేసి ! Moral of the Story ని విజ్ఞులైన పాఠకులకు సంధించిన ప్రశ్నగా వదిలేసి! కథకుడిగా మంచి విజయం సాధించారు!

    మంచి కధ సర్!

    👏👏👏👏👌👌👌👍👍👍🌹

    Reply
    1. 3.1

      Dr.. Vivekanand Rayapeddi

      యధాప్రకారం మీ రివ్యూ అత్యంత ప్రోత్సాహకారంగా ఉంది.
      ముఖ్యంగా కథ యొక్క ఆత్మని పట్టుకుంటారు మీరు.
      ఈ రోజు ఉదయాన్నే మా అన్న అందజేసిన ప్రశంసలు పులకితుడ్ని చేశాయి. ఎంత మాట్లాడినా అవి ప్రేమ పూర్వక ఆశీస్సులే కదా అని మనసుకు అనిపిస్తుంది. ఆయన తో ఫోన్లో కూడా మాట్లాడాను. ఆయన నిజంగానే మనసుతో చెప్పారు కథ గూర్చి అని అర్ధము అయింది.
      మీ విశ్లేషణ ఏ రచయితని అయినా ముగ్దులను చేస్తాయి.
      ‘నువ్వు పట్టు చీర కడితే ఓ పుత్తడి బొమ్మా!
      ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ ‘ అని వేటూరి వారు కథానాయిక సోయగాన్ని వర్ణిస్తారు.
      అలా “కావ్యకన్యల”జన్మ మీ విశ్లేషణ తో జన్మ సాఫల్యాన్ని పొందుతాయి అనడం అతిశయోక్తి కాదు.
      గండ్రకోట, ఉమా శర్మ, మల్లేశ్వరరావు గార్ల సాక్షిగా చెబుతున్నాను.
      మీలాంటి పాఠకుడిని పొందిన నా కథ జన్మ ధన్యం.
      ఇక నా కథలోని మానవీయా కోణం విషయానికొస్తే, ఇది నేను డిగ్రీ లొ ఉండగా ఒక సాధారణ ఇంగ్లిష్ లెక్చరర్ వెంకటప్పయ్య అనే ఆయన అతి పేలవంగా ఈ కథని బోధించినా, అందులోని ఆత్మ నన్ను కట్టి పడేసింది. అప్పట్లో కొన్ని రోజులు నాకు తిండి సయించలేదు, నిద్ర సరిగ్గా పట్టలేదు. కూర్చుంటే లేస్తే ఈ కథ నన్ను వెంటాడేది ఆ రోజుల్లో. స్మృతిలో విస్మృతి లొ ఇదే నా మదిలో ఆ రోజుల్లో .
      కాకపోతే పాశ్చాత్యు రచనా ప్రక్రియ కావటం వల్ల కావచ్చు ఇందులో వారు కరుణారసాన్ని నేను ఆశించిన స్థాయిలో అందజేయలేదు.
      నేను ఈ కథ వ్రాస్తే ఎలా వ్రాస్తాను అని దాదాపు నలభై అయిదేళ్లుగా అలోచించి అలోచించి, మనసులో ఎన్నో చెత్త ప్రతుల్ని వ్రాసి పారవేసి, ఇదిగో చివరికి ఇది వ్రాసాను.
      రెండు భాషల్లో చదివిన వారు కూడా నాదే బాగుంది అనాలి అనేది నా టార్గెట్.
      అయ్యా అది ఈ కథ వెనుక కథ.
      మీలోని పాఠక దేవునకు మరొక్క సారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
      మీ
      డా. రాయపెద్ది వివేకానంద్

      Reply
  4. 4

    Ravi

    A story that is full of twists and turns! Wonderfully written 👌👌

    Reply
  5. 5

    సూర్య గండ్రకోట

    అద్భుతమైన కథనం.. వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లు వర్ణనలు.. సూపర్బ్ వివేకానంద గారూ!

    ఎప్పుడో తప్పిపోయిన కొడుకు అప్పుడక్కడికి రావటం, ఆ విషయం తెలియని అతని తల్లికే అతన్ని హత్య చేయాలన్న ఐడియా రావటం.. అంతా అతని దురదృష్టం.

    డబ్బుకోసం మనిషి ఎంత ఘాతుకం చెయ్యటానికైనా వెనుకాడడనటానికి ఇంతకన్నా తార్కాణమేముంటుంది.

    ‘ఆహా’లో అనుకుంటాను ఇలాంటి ఇతివృత్తంతో ‘అనుకోని అతిథి’ అనే మూవీ ఎప్పుడో చూసినట్లు గుర్తు.

    Reply
    1. 5.1

      Dr.. Vivekanand Rayapeddi

      సదరు సినీ దర్శకుడు అది గోదావరి జిల్లాలో జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా అని అబద్దాలు వ్రాశారు సినిమా ప్రారంభం లొ. ఇది నిజానికి 100 ఏళ్ళ క్రితం వ్రాయబడ్డ రష్యన్ ఏకాంకి నాటిక.
      నేను ప్రారంభం లోనే ఎడిటర్ గారికి ఈ విషయం తెలిపాను.
      కథ చివర కూడా ఆ విషయం పేర్కొన్నాను.మీరు కూడా గమనించి ఉండాలి. కొందరు సన్మిత్రులు దీన్ని పోటీకి పంపమని అడిగారు. వేరే వారి సృజనని నా కథగా పోటీకి ఎలా పంపను?
      ఆ మాత్రం సంస్కారం లేకుంటే మనం రచయితలం అని ఎలా చెప్పుకుంటాం?
      మీకు ఇవన్నీ తెలియనివి కావు.
      మీ అభిమానానికి ధన్యవాదములు

      Reply
  6. 6

    శ్రీధర్ చౌడారపు

    చక్కని కథ. మీరు కుడి‌చెంప మీద మచ్చను గురించి చెప్పగానే ఇది ఎటు దారి తీస్తోందో తెలిసిపోయింది. కానీ పోలీసులు రావడం ఇత్యాదివి కొత్తగా ఉన్నాయి. నేనూ అనుకోని అతిథి సినిమా చూశాను. కథ దానికి దగ్గరగానే నడిచింది. కథ బాగుంది. కథనం మరింత బాగుంది. అభినందనలు

    Reply
  7. 7

    Ramkumar Bharatam

    ఈ కథ ఆల్రెడీ సినిమాగా వచ్చింది వివేకానంద్ గారు ! ఆహా OTT లో అనగనగా ఓ అతిధి అనే పేరుతో సినిమా వుంది ! బహుశా వాళ్ళు కూడా రష్యన్ ఏకాంకిక నాటిక లిథువేనియా ఆధారంగానే తీసినట్టున్నారు !

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!