సంచికలో తాజాగా

సికిందర్ గారి ప్రాంతీయ సినిమా

ప్రాంతీయ సినిమా-1: మరాఠీ సినిమాలు మళ్ళీ పుంజుకుంటాయా?

సుప్రసిద్ధ సినీ విశ్లేషకులు సికందర్ సంచిక కోసం వారం వారం ప్రాంతీయ చలన చిత్రాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు అందిస్తారు. ఈ వారం మరాఠీ సినిమాలను విశ్లేషిస్తున్నారు.

ప్రాంతీయ సినిమా – 2: ఓలివుడ్ ఒడిదుడుకుల మయమే!

ఒడిశా సినిమా మార్కెట్‌ని హిందీ సినిమాలు ఆక్రమించాయని చెబుతూ ఎనిమిది దశాబ్దాల చరిత్ర గల ఓలివుడ్ సినిమాలను విశ్లేషిస్తున్నారు సికందర్.

ప్రాంతీయ సినిమా -3: జాలీవుడ్‌కి కొత్త జాయ్!

“దేశంలో ఇతర భాషల్లో సినిమా చరిత్రలు పౌరాణికాలతో ప్రాణం పోసుకుంటే, అసోంలో  అభ్యుదయవాదంతో సినిమా చరిత్ర శ్రీకారం చుట్టుకుంది” అంటూ జాలీవుడ్ సినిమాలను విశ్లేషిస్తున్నారు సికందర్.

ప్రాంతీయ సినిమా-4: చోలీవుడ్‌తో రాజకీయం!

“స్వర్ణ యుగంలా వెలిగిన 2000 – 2012 మధ్య కాలంలో 60 సినిమాలు నిర్మించారు. ఇవన్నీ మసాలా సినిమాలే. వాస్తవికత జోలికి వెళ్ళే సమస్యే లేదు” అంటూ చోలీవుడ్ సినీరంగపు ధోరణులను వివరిస్తున్నారు సికందర్.

ప్రాంతీయ సినిమా – 5: టులువుడ్‌లో తూర్పు రేఖలు

దేశంలో అన్ని ప్రాంతీయ సినిమాల చారిత్రక మలుపులూ ఇలాగే వున్నాయంటూ, తుళు సినిమాల గురించి విశ్లేషిస్తున్నారు “టులువుడ్‌లో తూర్పు రేఖలు” అనే ఈ వ్యాసంలో సికందర్.

ప్రాంతీయ సినిమా-6: మాలీవుడ్ మంత్రమే వేరు!

“సీడీల కాలంలో కష్టపడి పనిచేసే వాళ్ళు, వంద కోట్ల టర్నోవర్ గల ఒక సామ్రాజ్యంగా నిలబెట్టారు. ఇక సినిమాలే తీయాల్సి వచ్చేసరికి ఎందుకో ఆసక్తి తగ్గింది” అంటూ మాలీవుడ్ సినిమాలను విశ్లేషిస్తున్నారు సికందర్.

ప్రాంతీయ సినిమా -7: కొంకణికి ఫెస్టివల్స్ ఫార్ములా!

తి చిన్నది, పరిశ్రమ అన్న పేరే లేదు, లాభార్జనే లేదు, ఆపేక్షతోనే సినిమాలు తీస్తారు, చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించుకుని ప్రేక్షకుల్లోకి తీసికెళ్తారు… ఐదు లక్షలే జనాభా, రెండు లక్షల మంది కూడా చూడరు, పేరుకి గోవాకి అంతర్జాతీయ ఖ్యాతి వుంది, అయినా గోవాలో నిర్మించే స్థానిక కొంకణి సినిమాలకి స్థానికంగానే మార్కెట్ కష్టమవుతోంది… మరి కొంకణి సినిమా ఇవాళ్ళ పుట్టలేదు. సుమారు ఏడు దశాబ్దాల క్రితమే 1950 లోనే పుట్టింది. అయినా ఇప్పటికీ నిలదొక్కుకోలేదు. ఏడాదికి ఒకటి […]

ప్రాంతీయ సినిమా -8: జాలిగొల్పే ఝాలీవుడ్

దేశ చరిత్రలో ఒక భాషలో నిర్మించిన మొట్ట మొదటి చలన చిత్రం విడుదల కాకపోవడం ఎక్కడా జరగలేదంటూ; పలికే మాటలు, పాడే పాటలు మాత్రమే స్థానికం, మిగతా కథా కథనాలూ, నేపధ్యాలూ సమస్తం బాలీవుడ్ మసాలాల్లోంచి అరువుదెచ్చుకుంటున్నవే అంటూ ఝార్ఖండ్ ప్రాంతీయ సినిమాలని విశ్లేషిస్తున్నారు సికందర్ ” జాలిగొల్పే ఝాలీవుడ్” అనే ఈ వ్యాసంలో. 

ప్రాంతీయ సినిమా – 9: మూతబడ్డ థియేటర్లతో పహారీవుడ్!

“పాతతరం వారు తప్ప, మొత్తానికి మొత్తం ఆ తర్వాతి తరం వెండి తెర మీద సినిమాలే చూడని తరంగా ఎదిగారు” అంటూ పహారీవుడ్ కళ కోల్పోయిన కారణాలనీ, జరుగుతున్న పునరుద్ధరణ ప్రయత్నాలనీ విశ్లేషిస్తున్నారు సికందర్ “ప్రాంతీయ సినిమా – 9: మూతబడ్డ థియేటర్లతో పహారీవుడ్” వ్యాసంలో.

ప్రాంతీయ సినిమా -10: భోజీవుడ్ ఫుల్ భోజనం

“సినిమాల తీరు పూర్తిగా ద్వందార్ధాల,  అశ్లీలాల, మాస్ మసాలాల ప్రదర్శనగా మారిపోయింది. ఇలా ఉంటేనే ప్రేక్షకులకి ఫుల్ భోజనం ఆరగించినట్టు వుంటోంది” అని భోజ్‌పురి సినిమాల గురించి విశ్లేషిస్తున్నారు సికందర్ “ప్రాంతీయ సినిమా – 10: భోజీవుడ్ ఫుల్ భోజనం” వ్యాసంలో.

ప్రాంతీయ సినిమా – 11: కోసలీకి ఆదివాసీ అండ

“1989లో తొలి కోసలీ సమాంతర సినిమా ప్రాణం పోసుకుంది. ప్రాణం పోసుకున్న దరిమిలా ఇప్పటి వరకూ ఇతర ప్రాంతీయ సినిమాల్లాగా కమర్షియలైజ్ అవకుండా దాని మౌలిక స్వరూపాన్ని కాపాడుకుంటోంది” అని సంబల్‌పురీ సినిమాల గురించి విశ్లేషిస్తున్నారు సికందర్ “ప్రాంతీయ సినిమా – 11: కోసలీకి ఆదివాసీ అండ” వ్యాసంలో.

ప్రాంతీయ సినిమా – 12: పురులు విప్పిన మణిపురి

“ముప్ఫై లక్షల జనాభాగల మణిపూర్‌లో సినిమాల కొచ్చిన ఇబ్బందేమిటంటే, ప్రేక్షకుల కొరత. అందుకని మణిపురి సినిమాలు చలన చిత్రోత్సవాల బాట పట్టి పోయి అక్కడ పురస్కరాలు పొందుతూంటాయి” అని మణిపురి సినిమాల గురించి విశ్లేషిస్తున్నారు సికందర్ “ప్రాంతీయ సినిమా – 12: పురులు విప్పిన మణిపురి” వ్యాసంలో.

ప్రాంతీయ సినిమా -13: వారి దారి ఎడారి

“ప్రభుత్వం ఎర వేయాల్సింది తాయిలాలతో ప్రేక్షకుల్ని కాదు. క్వాలిటీ సినిమాలు ఉత్పత్తి చేయగల తగిన టాలెంట్‌ని, మౌలిక సదుపాయాల్నీ అభివృద్ధి చేసే చర్యలు తీసుకోవడమే” అంటున్నారు సికందర్ రాజస్థానీ సినిమాలను విశ్లేషిస్తూ.

ప్రాంతీయ సినిమా -14: ఖాసీ సినిమా కష్టాలు

“ఔత్సాహిక దర్శకులు ఎందరున్నా నిర్మాతలు కరువైపోయారు. థియేటర్లే లేనప్పుడు ఏ పాలసీలైనా ఏం చేస్తాయి?” అంటున్నారు సికందర్ ఖాసీ సినిమాలను విశ్లేషిస్తూ.

ప్రాంతీయ సినిమా -15 : డాలీవుడ్ కోసం ఘాలీవుడ్

“రాష్ట్రం ఏర్పడి దశాబ్దంన్నర అయినా ప్రభుత్వం సినిమా రంగాన్ని పట్టించుకున్నది లేదు. చివరికి 2015లో ఒక విధాన ప్రకటన చేసింది. ఉత్తరాఖండ్ ఫిలిం డెవలప్‌మెంట్ కౌన్సిల్‌ని ఏర్పాటు చేసింది. కానీ ఈ కౌన్సిల్‌లో నిపుణులైన సభ్యులు లేక మూలన బడింది” అంటూ ఘర్వాలీ సినిమాలను విశ్లేషిస్తున్నారు సికందర్.

ప్రాంతీయ సినిమా -16 : స్వయంకృషితో గాలీవుడ్

“కొత్త తరహా సినిమాలతో ముంబాయి మల్టీప్లెక్సుల్లో కూడా స్థానం సంపాదించుకుంటున్న యువతరం కళాకారులు, ఖాయిలా పడ్డ గాలీవుడ్‌ని స్వయంకృషితో పునరుద్ధరించుకుని, ఎందరికో ఉపాధి కూడా కల్పిస్తున్నారు” అంటూ గుజరాతీ సినిమాలను విశ్లేషిస్తున్నారు సికందర్.

ప్రాంతీయ సినిమా – 17: పంజాబీ పదనిసలు

“బాలీవుడ్ ప్రభావంలోంచి బయటపడ్డా, పంజాబీ సినిమాలు గ్లోబలీకరణ ప్రభావానికి దూరంగా వుండలేకపోయాయి. గ్లోబలీకరణ అన్ని అస్తిత్వాలనీ చదును చేసేసి దాని వ్యాపార సంస్కృతి ఒక్కదాన్నే పెంచి పోషించుకుంటోంది” అంటూ పంజాబీ సినిమాలను విశ్లేషిస్తున్నారు సికిందర్.

ప్రాంతీయ సినిమా -18: టాలీవుడ్ ఉత్థాన పతనాలు!

“బెంగాల్లో 1975 – 90 మధ్యకాలం ఒక శూన్యమావరించింది. ఆర్ట్ సినిమాలకి కాలం చెల్లడంతో ప్రత్యామ్నాయం ఎవరూ పట్టుకోలేకపోయారు” అంటూ బెంగాలీ సినిమాలను విశ్లేషిస్తున్నారు సికిందర్.

ప్రాంతీయ దర్శనం -15: రాజస్థానీ – నాడు

ప్రాంతీయ దర్శనం సిరీస్‌లో భాగంగా రాజస్థానీ సినిమా ‘బాయీ చలీ ససరియే’ని విశ్లేషిస్తున్నారు సికిందర్.

ప్రాంతీయ దర్శనం -16: రాజస్థానీ – నేడు

ప్రాంతీయ దర్శనం సిరీస్‌లో భాగంగా రాజస్థానీ సినిమా ‘మేరో బద్లో’ని విశ్లేషిస్తున్నారు సికిందర్.

ప్రాంతీయ దర్శనం -24: భోజ్‌పురి – నాడు

ప్రాంతీయ దర్శనం సిరీస్‌లో భాగంగా భోజ్‌పురి సినిమా ‘గంగమయ్యా తొహే పియరీ చడయీ బో’ని విశ్లేషిస్తున్నారు సికిందర్.

ప్రాంతీయ దర్శనం -25: భోజ్‌పురి – నేడు

ప్రాంతీయ దర్శనం సిరీస్‌లో భాగంగా భోజ్‌పురి సినిమా ‘దబంగ్ సర్కార్’ని విశ్లేషిస్తున్నారు సికిందర్.

ప్రాంతీయ దర్శనం -26: నాగపురీ – నాడు

‘గుయా నంబర్ వన్’ లీవుడ్ అంటే, ఝార్ఖండ్ ప్రాంతీయ సినిమా పరిశ్రమ 2000లో ఝార్ఖండ్ రాష్ట్రం ఏర్పాటయిన వెంటనే 2001లో ప్రారంభమైంది. ప్రారంభం ప్రారంభమే కమర్షియల్ సినిమాతో ప్రారంభమైంది. 2001లో ఆభాస్ శర్మ అనే కొత్త దర్శకుడు ‘గుయా నంబర్ వన్’ (వీరుడు నంబర్ వన్) అనే మసాలా తీశాడు. ఇది అక్కడి నాగపురీ భాషలో. ఈ భాషలో 1988లోనే ‘ఆక్రంత్’ అనే ఆర్టు సినిమా వచ్చింది. అప్పుడు రాష్ట్రం బీహార్‌లో కలిసి వుంది. బీహార్‌లో కలిసున్నప్పుడు […]

ప్రాంతీయ దర్శనం -27: నాగపురీ – నేడు

ప్రాంతీయ దర్శనం సిరీస్‌లో భాగంగా నాగపురీ సినిమా ‘కర్మ’ని విశ్లేషిస్తున్నారు సికిందర్.

ప్రాంతీయ దర్శనం -29: మీరట్ – నేడు

ప్రాంతీయ దర్శనం సిరీస్‌లో భాగంగా మీరట్ సినిమా ‘డియర్ అండ్ బేర్’ని విశ్లేషిస్తున్నారు సికిందర్.

ప్రాంతీయ దర్శనం -34: డెక్కన్ వుడ్ – నాడు

ప్రాంతీయ దర్శనం సిరీస్‌లో భాగంగా హైదరాబాదీ ఉర్దూ సినిమా ‘ది అంగ్రేజ్’ని విశ్లేషిస్తున్నారు సికిందర్.

ప్రాంతీయ దర్శనం -35: డెక్కన్ వుడ్ – నేడు

ప్రాంతీయ దర్శనం సిరీస్‌లో భాగంగా హైదరాబాదీ ఉర్దూ సినిమా ‘పైసా పొట్టీ ప్రాబ్లం’ని విశ్లేషిస్తున్నారు సికిందర్.

ప్రాంతీయ దర్శనం -36: కచీ సినిమా

‘ది గుడ్ రోడ్’ దేశంలో కల్లా వయస్సులో అతి చిన్నదైన ప్రాంతీయ సినిమా పరిశ్రమ కచీ సినిమా. గుజరాత్ రాష్ట్రం అరేబియా తీరంలోని జిల్లా కచ్. దీన్నే రాన్ ఆఫ్ కచ్ అని కూడా అంటారు. తెల్లటి ఉప్పు స్ఫటిక మైదానాలు ఇక్కడ ప్రసిద్ధి. ఇక్కడే తెలుగులో ‘మగధీర’ పోరాట దృశ్యాలు కొన్ని తీశారు. కచ్ జిల్లా జనాభా 21 లక్షలు. బాగా వెనుకబడ్డ ప్రాంతం. అయినా సుప్రసిద్ధ వ్యక్తులెందర్నో ఈ ప్రాంతం అందించింది. పారిశ్రామిక వేత్త […]

All rights reserved - Sanchika™

error: Content is protected !!