సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ధూళిపాళ అన్నపూర్ణ గారి స్పందన: *ఎంత గొప్ప పుస్తకమో అది మీ సమీక్ష చెప్తోంది. శ్రీకృష్ణుని కొత్త రూపాన్ని సాక్షాత్కరింపచేశారు. మీరు ఆ పుస్తకం యొక్క ఆత్మను పట్టుకున్న తీరు అద్భుతం. ఆ సమీక్షలో కొన్ని పేరాలు పేరాలు చాలా విలువైనవి.. మళ్ళీ మళ్ళీ చదువుకోవలసినవి. రచయితకు మీకు శుభాభినందనలండీ.*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శాంతిశ్రీ బెనర్జీ గారి స్పందన: *కృష్ణుడు గారి అనువాద కావ్యం ‘రాధికా ఆలకించు!’ పైన నువ్వు రాసిన విశ్లేషణా వ్యాసం నీ పరిణితిని, గంభీరమైన, లోతైన నీ అవగాహనా సామర్థ్యాన్ని ఆవిష్కరించింది. కృష్ణుడు, రాధల ప్రేమ బాహ్య ప్రపంచాన్ని దాటి, సమాజ హితాన్ని కోరుతూ, మానవీయతను ప్రముఖంగా నిలిపే అద్వితీయ తాత్విక భావనగా కళ్ళ ముందుకొచ్చింది. కృష్ణుడు తన పరిమితులను, ఆలోచనలను, ఆవేదనలు తనను సమగ్రంగా అర్థం చేసుకునే రాధ ముందు వ్యక్తపరచడానికి వెనుకాడని వ్యక్తిగా గోచరిస్తాడు. కుబ్జ, ద్రౌపది గురించి చెబుతూ, స్త్రీల అస్తిత్వ పోరాటాన్ని, పితృస్వామ్య ఆధిక్యతను ప్రశ్నించిన వైనాన్ని వివరించడం అవసరమైన స్పందన. కృష్ణుడు గారి అనువాదాన్ని నువ్వు చాలా ప్రశంసించావు. కానీ అత్యంత నైపుణ్యంతో పరిశీలించి రాసిన నీ వ్యాసం ఆయన అనువాదాన్ని తప్పక చదవాల్సిన పుస్తకంగా నిలబెట్టింది. వ్యాసం కోసం నువ్వు వాడిన పదజాలం, భావాల పరంపర నీ భాషా సౌందర్యాన్ని సాక్షాత్కరించింది. హృదయపూర్వక అభినందనలు.*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గొల్లపల్లి లక్ష్మీనారాయణగారి స్పందన: *”అత్యంత నైపుణ్యంతో పరిశీలించి రాసిన వ్యాసం ఆయన అనువాదాన్ని తప్పక చదవాల్సిన పుస్తకంగా నిలబెట్టింది”.
    శాంతిశ్రీ గారు, మీరు అన్న ఈ మాట అక్షరసత్యం. ఎందుకంటే శ్రీమతి శ్రీదేవి మురళీధర్ గారు వ్రాసిన వ్యాసం వినూత్నకతో, ఎక్కడా విరామం ఇవ్వకుండా చదవాలనే ఆసక్తిని పాఠకులలో కలిగించి ఆసాంతం ఏకబిగిన చదివించేలా ఉంది. నిద్రకు ఉపక్రమించడానికి సిద్ధమవుతూ ఎందుకనో ఒక్కసారి వాట్సాప్ చూసాను. మీ పోస్ట్ ఉంది తెరిచి చూశాక శ్రీదేవి గారి వ్యాసం చదవకుండా ఉండలేక చదవడం మొదలుపెట్టాక చదివేశాను ఆసాంతం. ఇప్పుడు సశేషం.. ఎందుకంటే ఎ. కృష్ణారావుగారి అనువాదం తప్పక చదవాలి.
    ఒక పుస్తకంపై శ్రీదేవిగారు విశ్లేషణాత్మకంగా వ్రాసిన వ్యాసం నాలో ఇంత ఉత్సుకతను రేకెత్తిస్తే ఇక అసలు పుస్తకం, కృష్ణ పరమాత్మ అంతరంగాన్ని ఔపోసన పట్టిన బృందావనేశ్వరి అయిన రాధిక గురించి ఎలా వివరించారో తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది.
    ఎందుకంటే సాధారణంగా రాధాకృష్ణుల ప్రేమానురాగాలను స్థూల దృష్టితోనే చూస్తాము కానీ ఇంత సూక్ష్మంగా ఎప్పుడు పరిశీలించలేదు. ఇదే మొదటిసారి. ఒక పురుషుడు తన మనోభావాలను ఎటువంటి దాపరికం లేకుండా వ్యక్తపరిచేది ఒక్క ప్రియురాలి ముందే. అది మంచి అయినా చెడు అయనా. అన్ని కాలాలకి ఇది అన్వయిస్తుంది. ఇకపోతే శ్రీదేవి గారి వ్యాసం చదువుతుంటే వేటూరి గారు రాసినటువంటి ఒక పాట వెంటనే మదిలో దొర్లింది అది కూడా ఈవిడ గారి వ్యాసం లాగానే ప్రశాంతంగా నిండు గోదావరిలా సాగిపోతుంది.. “సిరి మల్లె నీవే విరిజల్లు కావే వరదల్లె రావే వలపంటే నీవే”
    మనసులో పెల్లుబికిన భావాన్ని వెలువరించకుండా నివారించలేకపోయాను.*

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డాక్టర్ వాణి దేవులపల్లి గారి స్పందన: *‘సునో రాధికా‘ అంటూ మాధవ్ కౌశిక్ గారు హిందీ లో రాసిన గొప్ప ఖండ కావ్యానికి అంతే గొప్ప గా ‘ రాధికా ఆలకించు’ అంటూ కృష్ణుడు గారు తెలుగులో అనువదించిన కావ్యానికి అద్భుత విశ్లేషణ మీది Shridevi Muralidhar !!
    పేరు చూసి, నేనూ, ముందు శ్రీకృష్ణుని, రాధిక ల ప్రణయ గాధ గూర్చి మాత్రమే ఈ ఖండ కావ్యం అనుకున్నాను. కానీ, తన అంతరంగంలోని వేదనా భరిత భావనలను రాధిక ముందు పరచి, తన గుండె భారాన్ని దింపుకునే మరో కృష్ణుణ్ణి చూస్తామిక్కడ.
    “చరిత్ర తనపై ఆపాదించిన పాత్రలను, తనపై ఉంచిన బాధ్యతలను, రాజకీయం మిగిల్చిన మానని గాయాలను, యుద్ధం కలిగించిన నైతిక సంక్షోభాన్ని, స్త్రీ అస్తిత్వం పై, సమాజం చేసిన దురాక్రమణ ను, మానవ సంబంధాల నిజమైన విలువను రాధ ముందు పునః పరిశీలనతో, కృష్ణుడు తన అంతరంగాన్ని బహిర్గత గావించే దీర్ఘ సంభాషణ ఈ కావ్యం..” వెంటనే పుస్తకం చదవాలనిపించే విశ్లేషణ!!
    శ్రీదేవి మురళీధర్ గారికి, కృష్ణారావు గారికి, మూల రచయిత మాధవ్ కౌశిక్ గారికి అభినందనలు!!💐💐💐*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®