నీ లేత అర చేతులు ఆకాశాన్ని చూసినపుడుచుక్కలు చిరునవ్వులు చిందించాయి!చందమామని తెచ్చి దుప్పటి కప్పిమా పక్కనే బజ్జోపెట్టుకోవడం ఎంత గర్వకారణం!ప్రేమ నుండి ప్రేరణ పొందడం,ప్రాణం నుంచీ ప్రాణం మొలవడంసృష్టి రహస్యమని నిన్ను చేతుల్లోకితీసుకున్నప్పుడే తెలిసింది!నీ లేత బుగ్గల్లో లాలిత్యం,నా గుండెని తాకినప్పుడుతియ్యని సంగీతమేదోనా కళ్ళల్లో చెమ్మగా ప్రవహించింది.నువ్విచ్చే చిరునవ్వు కానుకల్నినీ పెదవుల్లో విచ్చుకున్న రోజాపూల కాంతుల్నిఆ మృదుత్వాన్ని అమృతత్వాన్నిఅమరత్వంగా మార్చమనినిన్ను సృష్టించిన వాణ్ణి ప్రార్థిస్తాను!!
చాలా మంచి కవిత 👏
Great lines, smooth flow and very well narrated “the motherly love”.
chala bagundi kavitha
ధన్యవాదాలు !!
Beautiful feeling. Of a mother.
Beautiful feeling.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™