శునకో వృషభో న స్యాత్ మశకశ్చ మహాగజః । శశకస్తు న శార్దూలః లుబ్ధో దాతా కథం భవేత్ ॥
తేటగీతి శునక మెప్పుడు వృషభమై చనగ లేదు మశక మెప్పుడు ఏనుగై మనగ లేదు శశక మెప్పుడు వ్యాఘ్రమై మసల లేదు లుబ్ధు డెట్టుల దాతయౌ లోక మందు ౪౧
***
సర్వ తీర్థమయీ మాతా సర్వ దేవమయః పితా । మాతరం పితరం తస్మాత్ సర్వ యత్నేన పూజయేత్ ॥
ఆటవెలది సర్వ తీర్థమయిర జన్మ ధాత్రి యనగ సర్వ దేవమయుడె జన్మ దాత గాన యత్న పూర్వకముగ అవని యందు వారి సేవ చేయు వాంఛ తోడ ౪౨ అమ్మ నాన్న లనగ ఆది దేవులే, అనఘ !
విద్యా వినయ సంపన్నే విద్యా హీనే జడే నతి । స్వజనే పరకీయే చ పండితాః సమదర్శినః ॥
ఆటవెలది అరయ జ్ఞాను లందు అజ్ఞాను లందును సాధు జనులు యందు జడుల యందు బంధు జనుల యందు పరులందు పండితు లొకటె దృష్టి గలిగి ఉందు రెపుడు ౪౩ సకల జీవు లందు సమత కలిగి యుండు
స్వీయం తపో సతీరూపం పాండిత్యం తనయస్య చ । మూలికా స్వగృహోత్పన్నా న స్తుత్యా నీతి కోవిదైః ॥
ఆటవెలది తాను చేయు తపము తన భార్య అందమ్ము చూడ ముచ్చటైన సుతుల ప్రతిభ పెరటి చెట్టు కున్న వరమైన గుణమును వినుతి జేయ బోరు విజ్ఞు లెపుడు ౪౪
గ్రామస్తు సస్యహీనశ్చ స్వామిహీనం చ మందిరమ్ । పంథాః సహాయ శూన్యశ్చ రుద్రభూమి సమాః స్మృతాః ॥
ఆటవెలది సాయ మసలె లేక సాగించు పయనాన దీర్ఘ మైన యట్టి మార్గ మంత భర్త లేని ఇల్లు పంట పండని యూరు రుద్ర భూమి గానె రూఢి యగును ౪౫
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™