సిగ్గుల మొగ్గలా నన్నల్లుకునేవేళ తొలకరి చినుకు మట్టిని తడిపిన కమ్మని సువాసన….
రివ్వున వీచే గాలి మధువనిలో రాగాలు చిలికే వంశీలా ….
ప్రతిరోజూ నా ఎదురుచూపుల తోరణాలు స్వాగతాలద్దాలని ఉవ్విళ్లూరేవేళ మనం మనం మనసెరిగి ఊసులాడుకోవాలంటూ ఉదయరాగాలు రువ్వుతావు ….
కలలు కోల్పోయిన నిశీధుల నుండి దిగులు ముసుగుకు లంగరేసి ఆలోచనా దివ్వెవౌతావు ….
ఆత్మవిశ్వాసపు బాటలో నడిపించి క్రాంతదర్శివౌతావు ,నవకవనాలు పూయిస్తావు….
అపుడపుడూ నా ఏకాంతంలో సహచరిగా జోడీ కట్టే ఏకాంతాన్ని మది ప్రియంగా ఆస్వాదిస్తాను …..
All rights reserved - Sanchika™