సంచికలో తాజాగా

Related Articles

24 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దొడ్డపనేని అఖిలగారి వ్యాఖ్య: *ఒకప్పుడు నేను అమ్మపై అన్నిటికీ ఆధారపడ్డాను. ఇప్పుడు మా బ్రదర్స్ తో మాట్లాడి అమ్మను నాతో ఉంచుకున్నాను. నాకు చాలా తృప్తిగా ఉంది. మంచి పోస్టు. అందరి కూతుర్లు ఆలోచించవలసింది. – దొడ్డపనేని అఖిల, నిజామాబాద్.*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఆర్. హనుమంతరావు గారి వ్యాఖ్య: ఏ కొంప చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం.. అమ్మలగన్నయమ్మలు సమస్తం, కొడుకులు , కూతుళ్లు, కోడళ్ళ పీడన పరాయణత్వం.. ఇంటింటి రామాయణం.. నేటి సమాజంలో తల్లుల పరిస్థితి.. మీ విరచిత కాలమ్ లో నేటి కుటుంబ వ్యవస్థలో తల్లుల పాత్రని చక్కగా వివరించారు. ధన్యవాదములు. R.Hanumantha Rao.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది లలితావర్మ గారి వ్యాఖ్య: *నగ్న సత్యాలు 👏👏👏 *

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్యామలాంబ గారి స్పందన: *బావుంది. కొంతమందిలో అయినా ఇది చదివి ఎంతోకొంత మార్పు వస్తే ఆనందం. మార్పు వస్తుందని ఆశిస్తాను. రచయిత్రి గారు ఇంత మంచి రచన మాకు ఇచ్చినందుకు నమస్కారాలు.*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బి.ఇందిరా విశ్వనాథ్ గారి వ్యాఖ్య: ఎంత బాగా రాశారో! ఈ కాలంలో ఇలాంటి కూతుళ్లు చాలామంది ఉన్నారు. సహజ విషయాలను ఎంతో సహజంగా రాస్తారు ఏమాత్రం అతిశయోక్తి లేకుండా. అందుకే మీరు సహజ రచయిత్రి అంటాం!*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది షేక్ కాశింబి గారి స్పందన: *అద్భుతం.. యథార్ధాన్ని నిలువుటద్దంలో చూపించారు.. ఇది నేటి కూతుర్లకూ కోడళ్లకు గొప్ప గుణపాఠం (వాళ్ళు బుర్రకెక్కించుకుంటే).. విషయాన్ని లలితంగా, మనసుకి నొప్పి తగలకుండా.. వెన్నముద్ద తినిపించినంత ముద్దుగా చెప్పి అలరించారు.. అభినందనలు.. 💐💐*

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మల్లికార్జున్ గారి వ్యాఖ్య: *వాస్తవావేదన..150పాళ్లు నిజం. బిడ్డలందరూ కళ్ళు తెరవాలి..👌👌🫡*

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రఘురామ శర్మగారి స్పందన: *లోతైన వాస్తవాన్ని విపులంగా వివరించారు. బాగుంది. You are great Lakshmi garu.👌 *

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బిందు గారి స్పందన: *పచ్చి నిజం! ఈ కాలమ్. Bindu, US

  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పుట్టి నాగలక్ష్మిగారి వ్యాఖ్య: ‘అమ్మంటే అంతులేని సొమ్మా?’ అని ప్రశ్న సంధించారు గౌరీ లక్ష్మి గారు. నిజమే! ముఖ్యంగా ఈ తరం అమ్మాయిలు, అబ్బాయిల ప్రవర్తన అలాగే అనిపిస్తోంది ఇందులో అన్నీ నిష్టూర నిజాలే! కొంతమంది కూతుళ్లు, కోడళ్ళకి మంచి మార్కులూ ఇచ్చారు. “మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ”అన్నారు పెద్దలు. అమ్మని దేవతలా కొలవనవసరం లేదు. కనీసం మనిషిగా చూసినా చాలు. వయస్సుని పట్టించుకోకుండా అరవై డెబ్బై ఏళ్ళుదాటుతున్నా తమ కోసం, తమ పిల్లల కోసం వెట్టి చాకిరి చేయించుకోవడం హీనాతిహీనం. తాము సకల సౌకర్యాలు అనుభవిస్తూ వారికి కనీస సౌకర్యాలు కల్పించకపోవడం దారుణం. ఇంకా చెప్పాలంటే మెజారిటీ సౌకర్యాలు తల్లిదండ్రుల కష్టార్జితంతో సమకూర్చి పెట్టినవే! జెన్ జి తరం పిల్లలే ఇన్ని దుశ్చర్యలతో అమ్మలని బాధ్యతల సుడిగుండంలో పడేసి ఇబ్బంది పెడుతుంటే.. ఇక రాబోయే ఆల్ఫా, గామాల తరాల అమ్మాయిల చేతులలో, చేతలలో అమ్మల భవిష్యత్ ఎలా ఉండబోతుందో?అమ్మ*

  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జి.ఎస్. లక్ష్మి గారి స్పందన: అన్నీ అక్షర సత్యాలే. 👏👏 *

  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గాయత్రి గారి వ్యాఖ్య: *గౌరీ గారూ, ఎంత అద్భుతంగా వ్రాశారు. చదువుతుంటే నేటి సమాజంలొ నిత్యం జరిగేవే. నాకైతే ఈ నగ్నసత్యాల మూవీ చూస్తున్నట్టే అనిపించింది. మా గౌరీగారు ఏది వ్రాసినా ప్రతీది మనం మన జీవితంలోకి వెళ్ళిపోతాం. అంతలా వ్రాస్తారు కాచి వడబోసినట్లు. గౌరీగారికి ధన్యవాదాలు.*

  13. 13

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వారణాసి నాగలక్ష్మిగారి స్పందన: *ఛెళ్ళుమనేలా చెంపలు వాయించినట్టు రాశారు గౌరీ! చాలా బాగుంది. మీరన్నట్టు అధిక శాతం ఇలాంటి వాళ్లే కనపడుతున్నారు. పెళ్లిళ్లు ఆలస్యం అవడంతో వాళ్లకి పురుళ్ళు పుణ్యాలు కూడా ఆలస్యం అవుతున్నాయి. ఆ లోపు వీళ్ళకి ఓపికలు సన్నగిల్లుతున్నాయి. చివరిగా రాసిన పేరా చూస్తే ముచ్చటేసింది. అలాంటి కూతుళ్లు కోడళ్ళు ఉన్న ఇల్లు కూడా ఉన్నాయి కానీ చాలా తక్కువ శాతం!*

  14. 14

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బాలామూర్తి గారి వ్యాఖ్య: *బాగా అనలైజ్ చేసావు గౌరి. అభినందనలు!*

  15. 15

    కొల్లూరి సోమ శంకర్

    ఇది చెంగల్వల కామేశ్వరి గారి స్పందన: *టాపిక్ బాగుంది కానీ మరీ అంత స్వార్థపరులుగా పిల్లలు లేరు అనిపిస్తుంది. కాస్త డోస్ ఎక్కువైందేమో అనిపిస్తుంది 😍 *

  16. 16

    కొల్లూరి సోమ శంకర్

    ఇది నండూరి సుందరీ నాగమణి గారి వ్యాఖ్య: *చాలా బాగా చెప్పావు గౌరీ! ❤️ *

  17. 17

    కొల్లూరి సోమ శంకర్

    ఇది షామీర్ జానకి గారి స్పందన: *చాలా బాగుంది గౌరీ… సున్నితమైన విషయం బాగా రాశారు.. అమ్మ మనసు తెలుసుకునే పిల్లలు ఉండటం అదృష్టం..👌👌👏👏💐💐 *

  18. 18

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సర్వమంగళ గౌరి గారి వ్యాఖ్య: *సంచికలో వచ్చిన అల్లూరి గౌరీ లక్ష్మి గారి ‘రంగుల హేల’ కథ విలువైన వర్ణాల సమ్మేళనంతో రమ్యంగా సాగింది. సమాజంలో కేవలం కార్మికులే కాదు, ఇల్లాలైన అమ్మలు కూడా తీవ్ర శ్రమదోపిడీకి గురి అవుతున్నారనే భావాన్ని ఈ కథ చాలా శక్తివంతంగా ఆవిష్కరించింది. అమ్మ మనసులోని మెత్తదనాన్ని అలుసుగా తీసుకుని, తమ పబ్బం గడుపుకునే కూతుర్లు ఈ రోజుల్లో లేకపోలేదు. అయితే, వారిని ఆ స్థాయికి తెచ్చిన ‘అమ్మతనం’ కూడా ఈ విషయంలో కొంత బాధ్యత వహించక తప్పదు. చిన్నప్పటి నుంచి అమ్మ శ్రమను దోపిడీ చేయడానికే అలవాటు పడిన పిల్లలను, ఇప్పుడు హఠాత్తుగా మారమంటే మారడం కష్టమే!
    ​ఆర్థిక స్వాతంత్ర్యం, సంపాదన సౌలభ్యం ఉన్నాయి కాబట్టి.. రేపు పొద్దున వీరు అమ్మను వదిలేసి, మార్కెట్లో దొరికే వస్తువుల సంస్కృతికి దాసోహమైపోతారేమో అనే సందేహం కలగడం సత్యదూరమేమీ కాదు. మరి ఇందుకు పరిష్కారం ఏమిటి? అమ్మలు ఇలాగే బాధపడుతూ కూర్చోవాలా? లేదు, అమ్మలు ఇకనైనా కొంచెం గట్టిపడాలి.
    ​సోషల్ మీడియా విస్తృతి పెరిగాక అమ్మ గొప్పతనానికి, త్యాగానికి ప్రచారం అయితే పెరిగింది కానీ, ఆచరణ శూన్యమవుతోంది. స్వార్థానికి అలవాటు పడిన నేటి మానవులు అమ్మ త్యాగాన్ని గుర్తించాల్సింది పోయి, ఆమె నిస్వార్థతను ఆసరాగా చేసుకుని తాము మరింత స్వార్థపరులుగా మారుతున్నారు. దీనిని అమ్మలందరూ గ్రహించాలి. పిల్లల నిజమైన క్షేమం కోసమే అయినా అమ్మలు తమ ధోరణిని మార్చుకోవాలి. “అయ్యో పాపం! అడిగింది, నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు?” అనే అతిప్రేమను పక్కనబెట్టి, పిల్లల కోరికలనే కాకుండా తన శారీరక, మానసిక శక్తిసామర్థ్యాలను కూడా బేరీజు వేసుకోవాలి.
    ​మృదువుగానే అయినా సరే.. కచ్చితమైన స్వరంతో పిల్లలకు, ముఖ్యంగా కూతుర్లకు వారి కోరికల్లోని అనుచితత్వాన్ని ముఖం మీదే చెప్పగలగాలి. ఒకటి రెండుసార్లు ఇలా గట్టిగా నిలబడితే వాళ్ళలో మార్పు వస్తుంది. ఒకవేళ అలా మారకుండా నిష్ఠూరాలాడుతూ దూరంగా జరిగినా… అది ఒక రకంగా మంచిదే! ఆ సమయంలో ఒకటి రెండు రోజులు బాధ అనిపించినా, ఆ తర్వాత మనసును సంఘసేవ వైపో, దైవచింతన వైపో మరల్చుకుంటే.. జీవిత చివరి దశనైనా ప్రశాంతంగా, హాయిగా గడపవచ్చు. – సర్వమంగళ గౌరీ*

  19. 19

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పి. ఉషారాణి గారి స్పందన:*నమస్తే మేడం.. చాల బాగా రాశారు మేడం.. తల్లుల బాధ గురించి… పి.ఉషారాణి, గుడివాడ.*

  20. 20

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జ్యోతిర్లత గారి వ్యాఖ్య:*ఎంత బాగా రాశారు గౌరీ గారు. ఇప్పుడు NRI పిల్లలు వున్న అందరి ఇళ్లలో నిత్యం జరుగుతున్నవి సునిశిత దృష్టి తో గమనించి రాశారు.👌👏👏 *

  21. 21

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జొన్నలగడ్డ శేషమ్మ గారి స్పందన:* My dear Gouri Lakshmi garu, I read the Rangula Hela…It is down to earth true, it touches the heart deeply, no one will be able to control tears. శేషమ్మ, కాకినాడ.*

  22. 22

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శారదగారి స్పందన: *కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.*

  23. 23

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పి.వి. రమణ గారి స్పందన: *అమ్మ గురించి బాగా రాశారు,*

  24. 24

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రామలింగరాజు గారి స్పందన:*మన దేశంలో మహిళలు తరతరాలుగా చేసిన కుటుంబ సేవలు ఎక్కడా ఉండవేమో! రుచికోసం ఎక్కువ నూనెలు పోసి వండే హోటల్ తిళ్ళతోనూ, రోజుల తరబడి ఫ్రిజ్ లో ఉంచి వేపుకునో, ఉడకబెట్టుకునే విదేశీయుల తిళ్లతోనూ పోలిస్తే ఒక భారతీయ మహిళ తన వారికోసం అప్పటికప్పుడు అందరి ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని అప్పటికప్పుడు వండే వంటను తినేవాళ్ళం ఎంత అదృష్టవంతులం అనిపిస్తుంది. ఒక తరం దాలి దగ్గర గంటల తరబడి కూర్చుని పాలను కాచి తోడు పెట్టిన పెరుగు తోడుపెట్టేవారు. నిమిషాల్ని డబ్బుగా మార్చుకునే తెలివి సంపాదించిన నేటితరానికి ఒకనాడు అమ్మలో, అమ్మమ్మలో తమ పిల్లలకూ, వారి పిల్లలకూ రుచి,శుచి కలిగిన వంటకాలను వెచ్చించిన సమయాల విలువ తెలియాలి. ఆ పిచ్చి ఏమిటో గాని ఆ అమ్మలకు తాము ఏం తింటున్నామో చూసుకోరు, పిల్లల కంచాల్లోనూ, ఏవి కొరవడ్డాయో గమనిస్తూ ఉంటారు. తర్వాతే భర్త సంగతి చూస్తారు. ఆ ప్రేమను నిరంతరంగా పొందాలంటే ఆ అమ్మల పట్ల శ్రద్దా,వారి కోసం సమయం వెచ్చించాలి. పిల్లల పోకడలను నిరసిస్తూ, వారిని మేలుకొలిపేలా సాగుతున్న మీ అలుపెరుగని కలానికి చప్పట్లు👏👏👏 కాదు కాదు తియ్యట్లు..🤗💐*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!