సంచికలో తాజాగా

డాక్టర్ చిఱ్ఱావూరి శివరామ కృష్ణ శర్మ Articles 1

డాక్టర్ చిఱ్ఱావూరి శివరామ కృష్ణ శర్మ 14 ఫిబ్రవరి 1951న జన్మించారు. భాషాప్రవీణ, ఎం.ఎ (సంస్కృతం) ఎం.ఎ. (తెలుగు), పిహెచ్‍డి వీరి విద్యార్హతలు. శ్రీకృష్ణ యజుర్వేదం, సాయనాచార్య భాష్యం, వ్యాకరణ వేదాంత శాస్త్రములు, జ్యోతిషం అధ్యయనం చేశారు. అధ్యాపనం, మహాభారతాది శతాధిక గ్రంథ ప్రవచనం, నేత్రావధానాది సాంకేతివధానాలు నేర్పుట, అక్షరావధనా నిర్మాణం వీరి కృషి. రచన వ్యాసంగంలో విశేష కృషి చేశారు. 55 గ్రంథాలు ముద్రితం. వివిధ పత్రికలలో 215 రచనలు ప్రచురితం. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పత్ర సమర్పణ చేశారు. వివిధ టివీ ఛానెళ్ళలో ఆధ్యాత్మింశాలపై ప్రసంగాలు చేశారు. వీరికి - విద్యాలంకార, పరిశోధన ప్రవణ, జ్యోతిర్వాస్తు విజ్ఞాన శేఖర, పౌరాణిక ప్రవచన్ శ్రీశుక, ధర్మశాస్త్ర విద్వన్మణి తదితర బిరుదులున్నాయి. ప్రభుత్వం వారిచే ఉత్తమ అధ్యాపక పురస్కారం, సాహిత్య, ఆధ్యాత్మిక రంగాలలో పలు పురస్కారాలు పొందారు. ఆంధ్ర జాతీయ కళాశాల, మచిలీపట్నం నుంచి తెలుగు విభాగంలో రీడర్‍గా పదవీ విరమణ చేశారు.

All rights reserved - Sanchika®