అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన అపారమైన అనుభవాలను "ఆకాశవాణి పరిమళాలు" శీర్షికన పాఠకులతో పంచుకుంటున్నారు. Read more
"గుర్రమెక్కిన పెరుమాళ్ కథ యేమిటి? ఈ కథలో అది ప్రత్యేకంగా యేమి సూచిస్తుంది?" అని ప్రశ్నించి, "కథకు స్పష్టమైన దిశానిర్దేశం వుంది. ముగింపు కూడా అసంపూర్తి సంభాషణతో, కాస్త ఆశావహంగానే ఉంది" అంటున్... Read more
న్ సిటీస్ సింగర్స్ గురించి నేనెందుకు రాయాలనుకున్నానంటే.. సినీ గీతాలతో కూడిన కార్యక్రమాలంటే నాకు చాలా ఇష్టం. ఆ పంథాలో త్యాగరాయ గానసభకి వెళ్ళినప్పుడు వేదిక మీద పాడుతున్న గాయనీ గాయకులని చూసి ఆశ... Read more


ఇక్కడ వెలసిన ముఖ్య మూర్తి సోమశేఖరస్వామి. ఈయన స్వయంభూ. అమ్మవారు సత్యజ్ఞాన ప్రసూన. ఈ చల్లని తల్లి కూడా భక్తులకు నేనున్నాననే అభయమిస్తున్నట్లు వుంటుంది. ఈ స్వామి గురించి, ఈ ఆలయ నిర్మాణం గురించి తెలుసుకున్నదేమిటంటే…
పూర్వం రాజా జగ్గన్నాథరావు మాణిక్యాలరావు రాచూరు జమీందారు. ఆయన క్రీ.శ. 1770లో ఒకసారి విహార యాత్రకు వెళ్ళి కోటిపల్లి మీదుగా తిరిగి వస్తుండగా “నన్ను చూడకుండానే వెళ్ళుచున్నావా” అనే మాటలు వినిపించాయట. ఆ జమీందారు అక్కడ దిగి ఆ ప్రదేశమంతా చూడగా ఒక పుట్ట, దాని మీద కొన్ని పువ్వులు కనిపించాయిట. ఆయన తన నగరానికి వెళ్ళి, తన మంత్రి, పురోహితులతో ఈ విషయం వివరించగా వారు ఆ పుట్టలో శివలింగం వున్నట్లు తెలిపారు. వెంటనే అందరూ అక్కడికి వచ్చి పరిశీలించి, శాస్త్ర ప్రకారం పుట్టలోంచి శివలింగాన్ని వెలికి తీయించారు. ఒక శుభ ముహూర్తంలో ఆలయ నిర్మాణం ప్రారంభించి ఆగమ శాస్త్రరీత్యా గర్భాలయం, ముఖమంటపం మొదలైన వాటితో నిర్మాణం పూర్తిచేసి స్వామిని ప్రతిష్ఠించి పూజలు, ఉత్సవాలు నిర్వహించసాగారు. పావన కృష్ణానదిలో స్నానం చేసి ఈ దేవుని సందర్శిస్తే సర్వపాపాలు నశిస్తాయని ఇక్కడి భక్తుల నమ్మకం.








పక్కన వేరే మంటపంలో నవ గ్రహాలు కొలువుతీరి వున్నాయి. యజ్ఞాలు నిర్వహించటానికి యజ్ఞశాల కూడా వున్నది. ఈ ఆలయానికి చాలాకాలం రాచూరు జమీందారీ వంశీకులు ధర్మకర్తలుగా వ్యవహరించారు. తరువాత ఈ ఆలయ నిర్వహణ దేవాదాయ ధర్మాదాయశాఖ చేపట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించింది.
ఉత్సవాలు
నిత్య పూజలతోబాటు ఇక్కడ ప్రతి సంవత్సరం శివరాత్రి, దేవీ నవరాత్రులు, కార్తీక మాసం, ముక్కోటి ఏకాదశి, సంవత్సరాది పండుగలలో విశేష పూజలు జరుగుతాయి.
కృష్ణానదీ తీరాన వున్న ఈ ఆలయం తెనాలి – రేవల్లె రోడ్డు మార్గంలో వున్నది. సమీప రైల్వే స్టేషన్ భట్టిప్రోలు.
ఉదయం 9-35కి కోటిపల్లినుంచి బయల్దేరి వెల్లటూరు చేరుకున్నాము. మరి ఆ విశేషాల కోసం వచ్చే వారం దాకా ఆగాలి.

శ్రీమతి పులిగడ్డ శ్రీమహలక్ష్మి కథారచయిత్రి, నాటక రచయిత్రి. ఎ.జి. ఆఫీస్, హైదరాబాద్‌లో సీనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్‌గా పని చేసి రిటైరయ్యారు. భర్త శ్రీ మానేపల్లి వెంకటేశ్వర్లుతో కలిసి పురాతన ఆలయాలు దర్శించటంలో ఆసక్తి మెండు. ఇప్పటిదాకా 450 పైన వ్యాసాలు, 20 కధలు వివిధ అచ్చు, ఆన్లైన్ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ‘యాత్రా దీపిక’ శీర్షికన 9 పుస్తకాలు వ్రాశారు. వీటిలో 6 పుస్తకాలు అచ్చయినాయి, మిగతావి కినిగె.కామ్‌లో ఈబుక్స్ రూపంలో లభిస్తాయి. నాలుగు నాటికలు వ్రాశారు.. అందులో రెండు.. రెండు హాస్యనాటికలు పేరుతో కినిగెలో ఈబుక్‌గా వచ్చింది.
డాలర్ మొగుడు డాలర్ మొగుడు అని కనీసం ఇరవైనాలుగు గంటలైనా మురిసిపోనీయలేదావిడనీ వాళ్ళ ఏమండీగారు ఈ కథలో. Read more
మార్కెట్లో కూరలమ్మిని తన తెలివితో బురిడీ కొట్టించాననుకున్న ఓ మహిళకి వెలగపండుపై వైరాగ్యం ఎందుకు కలిగిందో చెబుతున్నారు కె.ఎస్.ఎన్.రాజేశ్వరి ఈ కథలో. Read more
సంచిక నిర్వహించిన హాస్యకథల పోటీకి జి.ఎస్. లక్ష్మి పంపిన హాస్య కథ "వదిన-వంటల షో..". వంటలు చెయ్యడాలూ, చేయించడాలూ కన్న హాయిగా ఓ సోఫాలో కూర్చుని ఏ ప్రశ్నకైనా నోటికొచ్చిన సమాధానాలు చెప్పడం తేలిక... Read more
"మొదట మీ కుటుంబానికి ఈ అమూల్యమైన నిధుల్ని ఇవ్వండి. తర్వాత మొత్తం సమాజానికి పంచండి" అంటున్నారు సలీం 'ఇచ్చుటలో ఉన్న హాయీ...' అనే ఈ కల్పికలో. Read more
మన దేశంలో జరిగే ఎన్నికల గురించి, ఎన్నికల నియమావళి గురించి, అభ్యర్థుల అర్హతలు అనర్హతల గురించి, ఎన్నికల ప్రక్రియ గురించి సరళంగా వివరిస్తున్నారు శ్రీధర్ చౌడారపు. Read more
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *
Keep moving the story..*