సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్రొ. సిహెచ్. సుశీలమ్మ గారి స్పందన: *సంస్కృతం దేవ భాష నుండి లౌకిక భాషగా రూపొందడం, ప్రాకృతం, దాని లోని బేధాలు చక్కగా వివరించారు డా‌. జి.వి. పూర్ణచందు గారు.
    తెలుగు లో ప్రథమ కావ్యం గా నన్నయ భారతాన్ని అనువదించినా, తత్పూర్వం తెలుగు భాష లేదని కాదు. ప్రజల నాలుకలపై నడయాడినదే. అయితే ‘కావ్య గౌరవం’ పొందడం 11వ శతాబ్దం లోనే.
    క్రీ.శ.1వ శతాబ్దం లో హాలుడు ప్రాకృతం లోని గాథలను సేకరించి, ముఖ్యమైన 700 గాథలను ‘గాథా సప్తశతి’ పేరిట సంకలనం గావించాడు.
    దాదాపు 300 మంది పైగా రచించిన ఈ గాథలు పైకి పచ్చి శృంగార గాథలుగా అనిపించినా నీతి, న్యాయము, మానవ మనస్తత్వం, ప్రేమ తత్వం, ప్రజా జీవితం, చివరకు వైరాగ్యం కూడా నిబిడీకృతమైన కొన్నిటిని సోదాహరణంగా వివరించారు డా. పూర్ణచందు.
    ‘ధ్వని ప్రధానం’ ఈ గాధల ప్రత్యేకత. సామాన్య ప్రజల జీవన శైలి వర్ణింపబడింది. డా. పూర్ణచందు స్వీకరించిన ‘గాథా సప్తశతి – ప్రేమతత్త్వసారం’ అనే దృష్టి కోణం మాత్రం నూతనమైంది. ఉదాహరణలుగా చాలా కథలను ఉటంకించారు.
    సంచిక పత్రికలో వచ్చిన నాలుగు భాగాలు నేను ఒకేసారి చదవడం వల్ల నాకైతే పూర్తిగా అద్భుతమైన రూపు కట్టినట్టు తోచింది, తృప్తినిచ్చింది.*

Leave a Reply

All rights reserved - Sanchika®