సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమాదేవి గారి స్పందన: *నమస్కారం అండి. మీరు, నూతనంగా ఏర్పాటు చేసుకున్న టెక్నాలజీ వల్ల లాభం నష్టం జరిగింది అని చెప్పడం చాలా బాగుంది సార్. మీరు ఎదుర్కొన్న అనుభవాలు చాలా ఉన్నాయి అవి చాలా వరకు ఉంటాయి అని భరించి మరీ మంచిగా ఎదిగిన వ్యక్తి. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే కష్టం విలువ. చాలా బాగుంది ఈ రోజు సంచిక. ధన్యవాదాలు అండి.*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది చండి (రమా సుందరి) గారి స్పందన: *ఇళయరాజా గార్ని ఇశై రాజా అని అంటారందుకే. అప్పటివరకు ఉన్న సినీ సంగీతం వేరు, ఇళై రాజా వచ్చాక వేరు. భగవంతుడు కొంతమందిని ఎంచుకుని ఆయనే వారి ద్వారా ప్రవహిస్తాడు. మీరు పాట రాయడమైనా, ఇళైరాజా సంగీతం ఇవ్వడమైనా అలాంటివే. లిరిక్స్ రాయమని ఒక రచయితకే చెప్తారని అనుకున్నాను. తీరా చూస్తే చంటిలో మీ చేత రాయించిన పాటని తీసుకోలేదని చెప్పారు మీరు. సినిమా సినిమాకీ ఎందరో మహానుభావుల పరిచయం, ఎన్నో అనుభవాలు పొదువుకోవడం.. మీకెదురైన ఏ అనుభవమైనా పాటల రచనలో ఉపయోగపడింది. ఇదే విచిత్రం. మనకి భవిష్యత్తులో ఏం కావాలో దానికి సంబంధించిన అనుభవాల్ని తొలిదశలోనే అందించడం విధి చేసే పనేమో బహుశా.*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మోహన్ గోటేటి గారి స్పందన: *చినరాయుడు పాటలు సూపర్ హిట్. కానీ, సినిమా మన ప్రేక్షకులకు నచ్చలేదు. పాటలన్నీ చాలా బాగుంటాయి. కవిగా మిమ్మల్ని మరో మెట్టు పైకి ఎక్కించాయి. ఇళయరాజా గారి నుంచి అటువంటి కితాబు పొందడం చాలా గ్రేట్ అండి. ఆయన ఎవరికీ ఇటువంటి సర్టిఫికెట్లు ఇవ్వరు! అభినందనలు భువనచంద్రగారూ. *

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రోహిణి పల్నాటి గారి స్పందన: *శ్రీ భువన చంద్ర గారికి నమస్కారాలు. ఈ వారం సంచిక చదివాను బాగుంది అండీ. వాలు జడ తోలు బెల్ట్ సినిమా లో నాలుగు మంచి మాటలు అని ఓ పాట వ్రాసారు. చాలా బాగుంది అండీ. మానవ సంబందాలు, మనుషులు తీరు, మర్మాలు అన్నీ కలబోసి మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చే లిరిక్స్ తో మంచి తత్వం వ్రాసారు. యంత్రాలు -ఎలక్ట్రానిక్ -యుగం మనిషి జీవితాన్ని ఎలా అతలా కుతలం చేసాయో కళ్ళకు కట్టినట్టు వ్రాసారు. కొత్తది రాగానే మనిషి గిల గిల ఆడటం నిదానంగా అలవాటు పడటం మనిషి నైజం అనుకుంటా. ఇప్పుడు AI వచ్చింది జనాలు కిందా మీదా అయిపోతున్నారు. అన్నిటిని చూడటం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయత కమ్మి వేస్తోంది. ధన్యవాదములు 🙏🌹-రోహిణి.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®