సంచికలో తాజాగా

One Comment

 1. 1

  రవి

  కాళిదాసు మీద ఎందరో, ఎన్నో విధాలుగా వ్యాసాలు వ్రాసినా, వాటి ఛాయ పడకుండా, వినూత్నంగా ఉంది ఈ వ్యాసం. నిజానికి ఆయన పిడికిలిలో ఇసుకలా చేతికి చిక్కడు. జారిపోతూ ఉంటాడు. ఆయనను – ఉన్న స్పేస్ లోనే సాధ్యమైనంత అందంగా చూపించింది ఈ వ్యాసం.

  సరస్వతి ఆయన రసనాగ్రనర్తకి అయినా “మందః కవి యశః ప్రార్థీ గమిష్యామ్యపహాస్యతామ్, ప్రాంశులభ్యే ఫలే లోభాదుద్బాహురివ వామనః” అని చెప్పుకున్న వినయశీలి. ఆ వినయమే భారతదేశ సాహిత్య, సాంస్కృతికసాంప్రదాయం అయింది. నేటికీ ఈ దృక్పథం ఎందరికో కళల యొక్క అంతిమప్రస్థానాన్ని చెబుతూ, జీవిత నిర్దేశం చేస్తున్నది. కొంచెం సోది అయినా, ఓ శ్లోకం గుర్తుకు వచ్చి వ్రాయకుండా ఉండలేకపోతున్నాను. మన్నించాలి.

  “తాం సైవ వేత్రగ్రహణే నియుక్తా రాజాంతరం రాజసుతాం నినాయ |
  సమీరణోత్థేవ తరంగరేఖా పద్మాంతరం మానస రాజహంసీమ్ ||”

  స్వయంవరం జరుగుతోంది. అమ్మాయికి మొదటి రాజు నచ్చలేదు. ఆపైన వేత్రగ్రాహిణి సునంద, యువరాణి ఇందుమతిని ఇంకొకరాజు వద్దకు తీసికెళ్ళింది. ఎలా ? హిమాలయాల చల్లని వాయువులు మానస సరోవరాన్ని తాకగా, ఏర్పడిన అలల చేత సరోవరపు నీటిపై రాజహంస తేలియాడుతూ మరొక పద్మం వైపుకు తీసుకొని పోబడినట్టుగా సునంద ఇందుమతిని మరొక రాజు వద్దకు తీసుకొని వెళ్ళినదట!

  ఓ పది పేజీల వ్యాఖ్యానం కావలసిన శ్లోకాన్ని అలవోకగా అలా చెప్పేశాడు!

  Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!