మూసిన నా కనురెప్పల చాటున దాగిన ప్రతి కన్నీటి చుక్క నను ప్రశ్నిస్తుంది. నీవు రాల్చిన ప్రతి అశ్రువుకి సమాధానం చెప్పమని ఏమని చెప్పను ప్రియా?
నీవే కారణమని చెప్పనా నీ తోడు లేని మనస్సు ఒంటరి ప్రయాణంలో అలసి నీకై తపిస్తుందని చెప్పనా నీ ప్రతి తలంపు, నన్ను దుఃఖ సాగరంలో ముంచి వేస్తుందని చెప్పనా?
మిగిలిన ఈ జీవితమంతా అమావాశ్య రాత్రిగా మారిపోయింది జీవితాన్ని ప్రేమించి నేను రేపటి వెలుగును ఆశించలేను
తిరిగిరాని లోకాలకు నువ్వు వెళ్ళిపోయావు అని తెలిసినా ఎందుకో తెలియని ఆత్రుత తిరిగి తిరిగి చూసుకుంటాను మళ్ళీ మళ్ళీ వెతుకుతుంటాను వెనుక నువ్వు వున్నావేమో అని
“నిజం ఎంత నిష్ఠూరమైంది దాని కడుపు కాల” స్వ పర భేదాలు లేవా నిన్ను నిలువునా దహించివేస్తుంది ఎంతటి పరధ్యానంలో ఉన్నా _____ అన్న నీ పిలువు నన్ను సావధాన పరిచేది!
నేడు ఆ పిలువు ఒక ఊహగా మారింది నా కనురెప్పల చాటున కన్నీటి బొట్టుగా మారింది
ఏమని చెప్పను ప్రియా? నీవే కారణమని చెప్పనా నీ పిలుపే కరువాయెనని చెప్పనా?
Excelent andi
vedana begundi. kavitha madyalo dash pettaru enduko. atanu vellipoyuna atani alochanalato bhadatone gadapalani kavi anukunnatuu vundi. ala kakunda atani alochanalanu, atani asayalanu munduku tisukelle vidhamga mugimpu vunte bagundedi. chani poyuna vari kosam bhada padatam andaru chestunnade kada.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™