సంచికలో తాజాగా

Related Articles

14 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్రొ. పేటశ్రీ గారి అభిప్రాయం: *రియల్లీ మీ హర్మోజ్, పర్షియన్ పదాల వ్యాసం అదిరిపోయింది.. శ్రీనాథుడు నిజంగా గ్రేట్.. ఆనాటి పదాలను తన గ్రంథంలో పొందుపరిచారు.*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఆచార్య కొలకలూరి మధుజ్యోతి గారి వ్యాఖ్య: *సమకాలీన విషయం. సాహిత్యంలో ఉన్న అంశాలను బాగా క్రోడీకరించారు. మీరు మంచి పరిశోధకులు. అభినందనలు.*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వై హెచ్ కె మోహనరావుగారి వ్యాఖ్య: *సాంద్రమైన పరిశోధన. చాలా కసరత్తు చేశారు. సంతోషం. అభినందనలు.*

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పమిడిపాటి పట్టాభిరామయ్య గారి వ్యాఖ్య: *శ్రీ జి వి గారు! నమస్తే.
    హర్మోజ్ జలసంధి గూర్చి శ్రీనాథ కవి గారు వ్రాసిన రచనలలో పర్షియన్ భాష పదాలు మన జీవనంలో ఎలా మమైకమయినవో వివరణాత్మక కథనం అద్భుతం. ఆలోచనాత్మకంగా సాధికారత సంతరించుకున్నది.
    మన తెలుగు సాహిత్యంలో ఇన్ని పర్షియన్ పదాలు ఇమిడిపోయాయని సోదాహరణంగా చెప్పారు. ధన్యవాదాలు!
    మీ వ్యాసం మహాద్భుతం. నమస్తే! – పమిడిపాటి పట్టాభిరామయ్య సంస్కృతకవి, విజయవాడ.*

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా. అంకం దుర్గాసుందరి గారి వ్యాఖ్య: *అద్భుతం, అనేక అంశాలు తెలుసుకోగలిగాను. ధన్యవాదాలు సార్ 🙏*

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రాళ్లపల్లి సుందరరావుగారి స్పందన: *అయ్యా, నమస్కారం. ఆసాంతం చదివాను. మీ పరిశోధనాత్మక వ్యాసం మరుగున పడిన చరిత్రను కళ్ళకు కట్టింది. మన తెలుగు పదాలే అనకుంటున్న కొన్ని మనవి కావని తెలిసి ఆశ్చర్యం కలిగినా అవగాహనమైంది. ధన్యవాదాలు. 🙏 – రాళ్లపల్లి సుందరరావు, ఖర్గపూర్.*

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా. జంధ్యాల కనకదుర్గగారి స్పందన: *కాకితం ఖర్చులేకుండా హరిమోజుజల లాహిరిలో ఓలలాడిని పూర్ణచంద్రుని అంతర్జాతీయ ప్రతిభ మా మెదళ్ళను గుర్రపుస్వారీ చేయించినదని తెలియజేసే అభినందనలు.*

    Reply
  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కొల్లి కోటేశ్వరరావు గారి స్పందన: *సంచికలో మీ వ్యాసం చదివాను. తెలుగు వాణిజ్యం మధ్య యుగాలలో అనేక పారసీక పదాలను మన తెలుగులోకి ఎలా చేర్చగలిగిందో సవివరంగా చెప్పారు.
    అలాగే మన కావ్యాలలో, ఆనాటి ప్రబంధాలలోకి ఫారశీక పదాలు వచ్చి చేరిన ఉదంతాలు అనేకం ప్రస్తావించారు. హోర్మోజ్ పట్టణం, అచటి గుర్రాల ప్రత్యేకతలు ఇలా ఎన్నో అంశాలు చర్చించారు. అభినందనలు 🙏*

    Reply
  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా. లగడపాటి సంగయ్య గారి వ్యాఖ్య: *విజ్ఞాన దాయకమైన విపులవివరణలతో కూడిన చక్కని వ్యాసాన్ని అందించిన మీకు అభినందనలు.*

    Reply
  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా. అంచె విజయలక్ష్మి గారి స్పందన: *పూజ్యశ్రీ పూర్ణచందు గారికి, నమస్కారమండీ
    పరిశోధనాత్మక వ్యాస పరంపరలో మీ కలం నుండి జాలువారిన మరొక విజ్ఞాన ఖని హురుమంజిగా మనకు తెలిసిన 700 ఏళ్ల నాటి తెలుగు సాహిత్యంలో హోర్ముజ్. ఈ వ్యాసం భాషా చరిత్రతో పరిచయం లేని వారికి ఆశ్చర్య చకితుల్ని చేసే సమాచార వేదిక.. చరిత్ర, వాణిజ్యం, సాహిత్యం ముప్పేట లుగా సాగిన పరిశోధన. కాల గతిలో మసకబారిన సత్యాలకు వెలుగు జిలుగులద్దిన వ్యాసం.
    పార్సీ,పారసీగా కూడా పిలుచుకునే పర్షియన్ భాషా పదాలను వివరణాత్మకంగా తెలియజేశారు.
    శ్రీనాథుడు విరివిగా తదనంతర ప్రబంధ కవులు ధారాళంగా అన్య దేశ్యాలను తమ కావ్యాలలో ప్రయోగించారు. పర్షియన్ల ద్వారా వచ్చిన వస్తువులు, దుస్తులు, ఆహార పదార్థాల గురించి అతి సామాన్యులకు కూడా ఆసక్తి కలిగించే రీతిలో వివరించారు. వ్యాసం చివరలో ఇరాన్ కు కర్మసిద్ధాంతాన్ని ముడి పెట్టడం కొసమెరుపు. నిజమే కర్మఫలం ఎంతటి వారైనా అనుభవించక తప్పదు. కర్మకు మినహాయింపులు లేవుగా! ఎటువంటి వారినైనా చదివింప చేసే భాష, శైలి మీ ప్రత్యేకతలు. ఇంత మంచి వ్యాసాన్ని అందించిన మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు.
    మీ నుండి త్వరలో మరొక పరిశోధనాత్మక వ్యాసం కోసం ఎదురుచూస్తూ..💐💐💐*

    Reply
  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా. కొలకలూరి దేవికా రాణిగారి వ్యాఖ్య: *సార్ వ్యాసం చాలా బాగుంది. ఆంధ్ర సాహిత్యంలో శ్రీనాథుని కాలంలో మధ్యయుగాల్లో వర్తక వాణిజ్య విషయాల్లో హార్మోజ్ జలసంధి ప్రస్తావన చదివి ఒకింత ఆశ్చర్యానికి గురయ్యాను. తెలుగు భాషలో ఇమిడిపోయిన పారసీక పదసంపత్తి చదివి సంభ్రమాశ్చర్యాలు కలిగాయి. చక్కని విజ్ఞానదాయకమైన వ్యాసాన్ని అందించినందుకు ధన్యవాదాలు అభినందనలు. – కే దేవికారాణి రత్నాకర్, తెనాలి.*

    Reply
  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా. పట్టాభి రామ్ తుర్లపాటి గారి స్పందన: *నమస్తే పూర్ణచందు గారు. మీరు పంపిన వ్యాసం చదివాక మన తెలుగు సాహిత్య ప్రాభవం, పర్షియాతో మనకున్న భాషా సంబంధాల పట్ల కొత్త అవగాహన కలిగింది. ఏడు శతాబ్దాల నాటి చరిత్రను వెలికితీసి, ‘హార్మోజ్’ గురించి మీరు అందించిన సమాచారం అమూల్యం. మీ పరిశోధనాత్మక రచనలు మరిన్ని రావాలని కోరుకుంటూ, మీకు హృదయపూర్వక అభినందనలు.*

    Reply
  13. 13

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఉప్పలపాటి వెంకటరత్నం గారి స్పందన: *చాలా అద్భుతమైన వ్యాసం, హర్మోజ్ గురించి మీరు రాసిన వ్యాసం, ఇతర భాషలలోకి తర్జుమా కావలసినంత విలువైనది. తెలుగువారు, పారసీకులతో ఆఫ్ఘనిస్తాన్, భాషలోని పదాలు తెలుగులో చేరిన విధం, ప్రతివారు తెలుసుకోవలసినది. శ్రీనాథుడు, మొదలగువారు ఉటంకించిన పదాలు మీ వ్యాసంలో ఎన్నో. అర్మోజు, రేవు పట్టణానికి, రెడ్డి రాజుల కాలంలో అనుబంధం చక్కగా వివరించిన మీకు ధన్యవాదములు. – ఉప్పలపాటి వెంకటరత్నం, ఒంగోలు.*

    Reply
  14. 14

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బులుసు సీతారాం గారి వ్యాఖ్య: *ప్రియమిత్రులు, పూర్ణచందు గారికి,, మీరు రాసిన చాలా చిన్న రచన, హోర్ముజ్ జలసంధి చదివాను. అద్భుతం, అపూర్వం. చిన్న రచన అనడంలో నా ఉద్దేశం, quantity లొనే కానీ quality లో బ్రహ్మాండాన్ని చూపించిన శ్రీకృష్ణుని ముఖంలో విశ్వరూపదర్శనం. చరిత్ర, సాహిత్యం, రెడ్డి రాజులు, శ్రీనాథుడు, తిప్పయ్య, పదాలు, వ్యుత్పత్తులు, భాషలు, భాషాసంగమాలు, వ్యాపారాలు- భాషల వ్యాప్తి, రత్న మాణిక్యాల విలువలతో సుగంధద్రవ్యాల ఘుమఘుమలతో, ఎన్నో ఎన్నెన్నో. మీ కృషి అపూర్వం అనితరసాధ్యం. మీ ఆంధ్రగీతి 10 సార్లు చదివాను. ప్రతిపదానికీ, ఒక మహాకావ్యానికి రాసినంత వ్యాఖ్య రాయాలని అనిపిస్తోంది. రాస్తాను కూడా తొందరలోనే. ఈ మధ్యన కళ్ళకి వచ్చిన సమస్యతో రాయడం, type చెయ్యడం కష్టమవుతోంది. మీకు శుభాభినందనలు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®