సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్రొ. సిహెచ్. సుశీలమ్మ గారి స్పందన: *భువన్ జీ! మౌళి గారి గురించి మాకు తెలియని చాలా విషయాలు చెప్పారండి. బయోపిక్‍లు కొన్ని వచ్చి ఉండవచ్చు కానీ క్రీడాకారిణి మీద తీసిన తొలి బయోపిక్ “అశ్విని”ని చాలా అబ్బురంగా చూసాం ఆ రోజుల్లో.
    “అహంకారి” సినిమాని మీరు ప్రస్తావించారు ఈ వారం. మ్యూజిక్ డైరెక్టర్స్ రాజ్-కోటి.
    ఈ రోజు YouTube లో శివనాగేశ్వరరావు గారు “రాజ్” గురించి పెట్టిన post చూసాను.
    దీనినే కాకతాళీయం అంటారు కదా.*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీధర్ వాడపల్లి గారి స్పందన: *శుభోదయం వినమ్ర నమస్సులు
    కలం కదిలి కాలంతో కదనం చేసి తరతరాలు చెరగని సినీసాహిత్య కౌముది అనేక మయూఖాలను వెదజల్లింది. మనస్సు సమ్మోహనం కన్నె గోదారిలా కొంటె కావేరిలా మా వెంట తరలివచ్చే గీతాక్షర ఝరి.*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రోహిణి గారి స్పందన:*శ్రీ భువన చంద్ర గారికి నమస్కారములు. 18వ ఎపిసోడ్ చదివాను అండీ. మీ ప్రయాణంలో మీతో వచ్చిన వారి అందరి గురించి వాళ్ళ లో వుండే మంచి మాత్రమే వ్రాస్తున్న మీకు 🙏. గొప్ప పాటలే కాకుండా డబుల్ మీనింగ్ పాటలను హైలెట్ చేస్తూ పాటకుల మనసులో మెదిలే ప్రశ్నలకు సమాధానం అడగకుండానే ఇస్తున్న మీ వూహా శక్తి కి జోహార్లు. ఓ పాటలోని మంచి కోణాన్ని ఎలా చూడాలో పాజిటివ్ థికింగ్ నేర్పుతున్న మీకు ధన్యవాదములు -🙏🌹-రోహిణి. *

    Reply
  4. 4

    Rama Sundari M S B P N V

    మౌళి గారి ప్రతిభని గురించి ఇప్పుడు మీ ద్వారా వినడమే. సినిమాకీ, నాటకానికీ అలాంటి మహానుభావుల వల్లే ఇంత వన్నె వచ్చింది. ఇక పెద్దరికంలో పాట… ఇదేలే తరతరాల చరితం… ఎంత తాత్విక భావనతో ఎంత నిదానంగా మనసులో ముద్ర వేసుకుంటుందో…
    మీ పాటలన్నీ చాలా పాప్యులర్..మెలడీస్ కూడా. అందుకే తరతరాలూ నిలిచిపోతాయి మీ పాటలు. గాయని స్వర్ణలత జీవితం అర్థంతరంగా ముగిసిపోవడం చాలా విచారకరం.
    చండి (రమాసుందరి)

    Reply
  5. 5

    Nanduri Krishna Mohan Rao

    తెలుగు సినీకవుల్లో మీది కూడా బాగా చెప్పుకోదగ్గ స్థానమే భువనచంద్ర గారు… తెలుగు చిత్రానికి, ఆ మాటకొస్తే భారతీయ చలనచిత్రానికి పాటలే ప్రాణం… ఇప్పుడంటే టీజర్లు, ట్రైలర్లు, ఇతరత్రా ప్రమోషన్లు చిత్రాన్ని ప్రజలకు పరిచయం చేస్తున్నాయి కానీ ప్రస్తుత టీవీ మరియు డిజిటల్ యుగానికి ముందునాళ్ళలో, అంటే 90వ దశకం మధ్యనాళ్ళకు ముందు కాలంలో పాటలే చిత్రాన్ని పరిచయం చేసేవి సినీ అభిమానులకు… అవే నిలబెట్టేవి కూడా చిత్రాలను… పోయిందనుకున్న చిత్రం అంతో ఇంతో ఆడటానికి, పరవాలేదు అనుకున్న చిత్రం నిలబడి ఆడటానికి, బావుంది అనుకున్న చిత్రం చాలా బాగుందని అనిపించుకోవడానికి పాటలే ప్రధాన పాత్ర పోషించాయనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు…

    ఆ రోజుల్లో రేడియో, దాని ద్వారా వినిపించే పాటలే జనాలను ఆయా చిత్రాలకు పరిచయం చేసేవి.. అందుకే స్వరకర్తలకు, గీతరచయితలకు, గాయనీగాయకులకు అంతటి ప్రాముఖ్యత మన దేశీ చిత్రాలలో…

    తొలితరం గీతరచయితలు భాషను కొంచెం పాండిత్య ధోరణిలో ఉపయోగించుకుంటే, రెండోతరం గీత రచయితలు దాన్ని సరళం చేసి అందరి నోళ్లలో నానేలా తమ గీతాలను ఆవిష్కరించారు… ఇక తరువాతి తరానికి ప్రాతినిధ్యం వహించిన వారిలో తమదంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసి గీత రచన చేసినవారిని చూస్తాం..

    ఒక పాటను వినివినగానే అది వేటూరిదా, సిరివెన్నెలదా, భువనచంద్రదా అని చెప్పగలిగే పరిస్థితి ఉండేది 90లకు అటు ఇటుగా వచ్చిన వాటిలో… మీ త్రయంలో ఒకరు ఆశు కవి అయితే మరొకరు ఓర్పు మరియు కూర్పు కవి… ఇక మీ విషయానికొస్తే మీరు నేర్పు కవి, అలవోక కవి అనిపించేది… ఒక పాట విన్నపుడు వేటూరికి, శాస్త్రిగారికి మధ్యలో ఉన్నట్టు అనిపించిందంటే అది ఖచ్చితంగా మీ గీతమే అయ్యుండేది… ముఖ్యంగా కీరవాణి, రాజ్-కోటిలు కూర్చిన బాణీలు మీ మరియు వేటూరి వారి గీతాలను ఎక్కడికో తీసుకుపోయేవి…

    మీద్వారా అప్పటి అనేక విషయాలు తెలుస్తున్నాయి… అందుకై ధన్యవాదాలు మీకు..

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమాదేవి గారి స్పందన: *నమస్తే అండి తెరపైన చూసి చాలా బాగుంది అని అనుకోవటమే కానీ వెనక ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారి ఆలోచనా సరళి తెలియదు. మీ వల్ల చాలా విషయాలు తెలుసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు అండి.*

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మోహన్ గోటేటి గారి స్పందన:*’ఈయన మాస్ పాటలు మాత్రమే రాయగలరు ‘ అన్న ముద్ర పడిపోయిన సమయంలో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి.. మీకు కవిగా గొప్ప గౌరవాన్ని తెచ్చిపెట్టిన పాట ‘ఇదేలే తరతరాల చరితం..’ అంటూ సాగే పాట. తరతరాలకు సినీ ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాటను రాశారు. ఏ సమయంలో రావాలో సరిగ్గా అప్పుడు వచ్చిన అవకాశం అది. మీరు చక్కగా సద్వినియోగం చేసుకుని సాటి కవుల మధ్య సగౌరవంగా నిలబడ్డారు. రీమేక్ సినిమా నెపంతో అవార్డు రాకపోవడం అన్నది మింగుడుపడని అంశం.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®