సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    “మంటలు రేపే నెలరాజా….” పాట వివిధ భాషలలోని గాయకులు పాడిన విధానాన్ని చక్కగా వివరించారు.సుఖము, శాంతి, ఆనందం మధ్య గల తేడాలను కూడా బాగా చెప్పారు. అందుకే మన పెద్దలు ఎవరినైనా దీవించేటప్పుడు “సుఖ శాంతులతో జీవించండి” అని అంటారు.పాట విశ్లేషణ బాగుంది……….(విరహంతో ఉన్న కావ్య నాయికలు విరహాన్ని పెంచుతున్నందుకు చంద్రుణ్ణి తిడతారు. చంద్ర ధూషణం పేరుతో కొన్ని పద్యాలు రాస్తారు కవులు..అలాంటి పాట “ఉషా పరిణయం” చిత్రంలో “న్యాయమిదేనా చందురుడా ….” అనేది ఒకటి ఉన్నది…ఈసారి ఆ పాట గురించి రాస్తే చదవాలని మా కోరిక)..

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డి. చంద్రశేఖర్ గారి వ్యాఖ్య: *👍🏼🙏🏼 అవును విషాద గీతాలలో గాయకుడు ఏడవకూడదు. ఈ విషయం మనకి ఘంటసాల మాస్టారు పాడిన ఎవరికోసం పాట ముగింపు వింటే స్పష్టంగా తెలుస్తుంది. 🙏🏼

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సిహెచ్. సుశీలమ్మ గారి స్పందన:*అలంకారాలతో మొత్తం పాటను అలంకరించారు. అన్ని వారాల్లోనూ ఈ వారం ఇన్నిన్ని అలంకారాల వల్ల “మధుర గీతం” అందం పెంపొందింది. ఘంటసాల – ఎన్టీయార్ ఒకరి ప్రతిభ వల్ల మరొకరి ప్రతిభ ఇనుమడించింది. నిజమే, ఘంటసాల గళంలో అలసట (అనారోగ్యం వల్ల) వినిపిస్తుంది. కానీ నాకైతే – ఆ పాత్ర జీవనపోరాటం, అలసట, నిరాశ, నిస్పృహ లను అలా ఘంటసాల మాస్టారు వినిపించారు అనిపిస్తుంది.*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బి. రోహిణి గారి వ్యాఖ్య: *రాము సినిమాలోని “మంటలు రేపే నెలరాజా” పాట గురించి చక్కని విశ్లేషణ చేశారు. పాట పాడే ఘంటసాల మాస్టారి గొంతులో చిందిన విషాదం మన గుండెల్ని తాకి, గొంతులో ఏదో అడ్డు పడిన భావన, మనల్ని కాస్సేపు మాట్లాడనివ్వదు. అదే గాయకుడిలోని ప్రత్యేకత. అది మన ఘంటసాల మాస్టారికి పుష్కలంగా ఉంది. ఇలాంటి పాటలు మన పాత సినిమాల్లో కోకొల్లలు. అందుకు తగ్గట్టు పాత్రలు కూడా మొహంలో విషాద భావాలు పలికించడం మన ఎదను తాకుతాయి. అప్పటి ఏ. ఎం రాజాగారి, పి. బి. శ్రీనివాస్ గారి పాటల్లో కూడా ఈ భావాలు కనబడుతాయి.
    ఇప్పటి గాయనీ, గాయకులు విషాద గీతాలు పాడేటప్పుడు వెక్కి వెక్కి ఏడుస్తారు. కానీ ప్రేక్షకుడికి ఒక్క కన్నీటి చుక్క రాలదు.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!