సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    Sobharaja

    🙏
    రాజకీయనాయకులు ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో correct గా చెప్పారు.రాజకీయనాయకుల స్వార్థానికి , నోట్ల మీద ప్రజల ప్రలోభానికి మనం బలైపోతున్నాము. నేటి యువత ఓటును నోట్ల కట్టలు మార్చుకున్నంతకాలం మీరన్మనట్లు రాష్ట్ర దేశ భవితవ్యం మారదు.
    నాయకుల కోసం ప్రాణ త్యాగాలు చేస్తారు కానీ దేశంకోసం,సమాజ పురోభివృద్ధి కోసం, కన్న తల్లిదండ్రుల్ని పట్టించుకోని యువతలో మార్పు కానంతవరకు దేశ పురోభివృద్ధిని చూడలేమని మీరు చెప్పడం యథార్థం.
    ప్రేమని మనసులోనే దాచుకోవడం అవివేకం. దాచుకున్న వారు కూడాఅవివేకులే.
    అల ఉత్తరంలో మీరు వ్రాసిన కవిత అద్భుతం.
    ధన్యవాదాలు🌹.

    Reply
    1. 1.1

      BhuvanaChandra

      మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు శోభ గారు…. చక్కని స్పందనతో నాకెంతో ఆనందాన్ని కలిగించారు
      థాంక్యూ థాంక్యూ సో మచ్
      మీ వంటి పాఠకులే సాహిత్యానికి శ్వాసలు

      Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమాదేవి గారి వ్యాఖ్య:
    * భువన చంద్ర గారూ నమస్కారం అండీ.
    కష్టం కలిగినప్పుడు అందరూ సానుభూతి చూపడం అండగా నిలబడి మనం అనీ కలుపుకుని కష్టం పంచుకోవటం మనిషికి వచ్చిన జన్మతః సం సంస్కారం అనాదిగా.
    మీరు అది స్పష్టం చేశారు.
    ఈ రోజున ఇదికూడా కరువవుతోంది. తాతగారి మాటలలో అన్నట్టు మంచి సంస్కారం గల వ్యక్తులు కాషాయం కడితే అన్నది నిజం. అందుకే మంచి పనులు చేయటానికి కాషాయం అడ్డురాకూడదు.
    ఈనాడు కాషాయం కట్టుకున్నవాడు సన్యాసి కాదు, ఖద్దరు బట్టలువేసి రాజకీయాల్లోకి వచ్చేవాడు రాజకీయ వేత్తకాదు.
    ప్రజాసేవ లేదా మనం దారి మంచికోసం చేసే పనే ప్రజాసేవ అనే గొప్ప పదంతో రూపురేఖలు మారిపోయాయి.
    రాజకీయ ప్రక్షాళనకు పూనుకోవాలిసింది
    మీరు అన్నట్టు ప్రతి మనిషి హృదయంలో రావాలి.
    అల తన ప్రేమను గురించి చెప్పింది. చాలా చక్కగా ప్రేమ నిర్వచనాన్ని కవితలు మాట ద్వారా అర్ధంతరంగా తెలియచేశారు.
    నిజం గానే నిజమైన ప్రేమ మాటలతో వ్వక్తపరచలేనిది. ఆది అంతం ఉండదు. అది హృదయం స్పందించే హృదయపూర్వక భావం, అనుభూతి మాత్రమే.
    అన్ని మసాలాలతో కలిపి మంచి వంట చేసి పెట్టినట్టు చాలా మంచి భావాలని రంగరించి హృదయం స్పందించే మీ రచనా తీరు అద్భుతం, అపూర్వమైనది.
    హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు అండీ.*

    Reply
    1. 2.1

      BhuvanaChandra

      హృదయపూర్వక ధన్యవాదాలు రమాదేవి గారు వారం వారం చాలా శ్రమ కోర్చి మీరు మీ స్పందనని తెలపడం నాకు ఎంతో ఎంతో ఆనందంగా ఉంది… మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు థాంక్యూ సో మచ్ సో మచ్ సో మచ్

      Reply
  3. 3

    Rohini

    శ్రీ భువన చంద్ర గారికి నమస్సులు. నేటి రాజకీయాలు కళ్ళకు కట్టినట్లు వ్రాసారు. సామాన్య మానవుడికి సైతం జరిగేరాజకీయ ఎత్తు గడలు అర్ధం అయ్యేలా చేయాలి. ఓటు వేసే ప్రతి వాడికి అవగాహన కావాలి. అది ఎలాగో అర్ధం కావటంలేదు. జరిగే దానిని సినిమా చూసినట్లు చూడటం తప్ప ఏమీ చేయలేక పోతున్నాము అనే బాధ ఒక్కటే చాలా మందిలో కన్పిస్తుంది అందులో నేను ఒకటి. ఓ యువ సన్యాసి నడుము బిగించి జనాలలో చైతన్యం కలిగించిన తీరు అద్భుతం. స్వామీ వివేకానంద మాటలు గుర్తుకు వచ్చాయి..కవిత చాలా బాగుంది. ధన్యవాదములు -రోహిణి 🙏🌹

    Reply
    1. 3.1

      BhuvanaChandra

      రోహిణి గారు హృదయపూర్వక ధన్యవాదాలు చక్కగా సీరియల్ ఆశాంతం చదవడమే గాక అర్థవంతమైన స్పందనని తెలియజేయడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు థాంక్యూ సో మచ్

      Reply
  4. 4

    Yamini Devi

    గురువర్యా ప్రతీ వారం సీరియల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తాం. విలువైన జీవన ప్రమాణాలు ఎన్నో మా దోసిట్లో పోస్తారు.
    మహతి లాంటి అమ్మాయ్ అభిమన్యు లాంటి అబ్బాయ్ ఊరికి ఒక్కరుంటే చాలు అన్నట్టు అనిపించింది.
    (రాజకీయం చేస్తున్న గారడీ
    అందులో చిక్కుకున్న ప్రజల ట్రాజడి )
    స్వతంత్య్రం వచ్చింది. అప్పటినుంచే నేతలు అధికారం కోసం ఎత్తులు కుయుక్తులు పన్నడం మొదలెట్టారు. అధికారం పొందారు. అప్పుడు ఎక్కువ మంది ప్రజలకు విలువలుందేవి. ఇప్పుడు విలువలు ఉన్న ప్రజలు తగ్గిపోయారు. గవర్నమెంట్అ ఆఫీస్లలో అవనీతి ప్రతీ చోటా పెరిగింది. రాజకీయం వత్తాసు గట్టిగా ఉంది. మంచి నాయకులు అరుదుగా ఉన్నారు. విలువలున్న ప్రజలు తగ్గిపోయారు. తాత్కాలిక ప్రయోజనం రాజ్యం చేస్తూ ఉంటుంది. మీరు ఏ అంశం అయినా విడమర్చి వ్రాస్తారు.
    అభిమన్యు వెళ్తుంటే మహతి బాధ ఆ అనుభూతి తెలియని వేదన కలిగించింది. అల లేఖ అందులో మీ కవిత చిరునవ్వులు పూయించింది.
    ప్రణామాలు గురువర్యా 🙏🙏

    Reply
    1. 4.1

      BhuvanaChandra

      యామిని గారు చక్కగా చదవటమే కాక చాలా మంచి పదాలతో కొటేషన్లతో మీరు స్పందించటం నాకు చాలా చాలా ఆనందాన్ని కలిగించింది
      మీ అభిప్రాయాన్ని కూడా ఈ స్పందనలో చాలా చక్కగా తెలియజేశారు అందుకు మరోసారి ధన్యవాదాలు అందుకోండి
      మీకు మనసారా ధన్యవాదాలు మరోసారి తెలుపుకుంటూ భువనచంద్ర

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!