ప్రతీ జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉన్నట్టే ప్రత్యేక సాహిత్య చరిత్ర కూడా ఉంటుంది.
‘అన్ని జిల్లాల సాహిత్య చరిత్రల సమగ్రంగా నిర్మించగలిగినప్పుడు మాత్రమే సమగ్ర తెలంగాణా సాహిత్య చరిత్ర నిర్మాణమవుతుందని తెలంగాణ సాహిత్య అకాడమీ భావించింది. ఆ సంకల్పంతో ముప్ఫయి మూడు జిల్లాల సాహిత్య చరిత్రలు రాయించాలని నిర్ణయించి ప్రయత్నం ప్రారంభించింద’ని తెలంగాణా సాహిత్య అకాడమీ పుస్తకానికి ముందుమాటలో ప్రకటించింది. దాని ఫలితంగా ఈ పుస్తకం రూపొందింది.
సాహిత్య చరిత్ర ఇతర చరిత్ర, సంస్కృతులతో ముడిపడి ఉంటుంది. ఓ జిల్లా భౌగోళిక స్వరూపం, చరిత్ర, సంస్కృతీ విశేషాలు, దర్శనీయ స్థలాలు, సాహిత్య చరిత్ర, ప్రాచీన, ఆధునిక భాగాలు, ఆధునిక సాహిత్యంలో కవిత, కథా, నవల, నాటకం, విమర్శ వంటి ప్రక్రియలను ఈ పుస్తకం ప్రస్తావించింది.
‘గత వంద సంవత్సరాల ఆదిలాబాద్ జిల్లా సాహిత్యాన్ని పరిశోధించి జిల్లా సాహిత్య చరిత్ర రాయడం జరిగింది. ఈ క్రమంలో గతంలో మరచిపోయిన కొందరు కవులు, రచయితల్ని సాహిత్య చరిత్ర పుటల్లో చేర్చడం జరిగింది’ అని రచయిత డా. ఉదారి నారాయణ ‘రెండు మాటలు’లో రాశారు.
***
ఆదిలాబాద్ జిల్లా సాహిత్య చరిత్ర రచన: ఉదారి నారాయణ పేజీలు: 108 వెల: రూ. 40/- ప్రతులకు: తెలంగాణ సాహిత్య అకాడమీ, కళాభవన్, రవీంద్రభారతి ప్రాంగణం, హైదరాబాద్ -4. ఫోన్: 040-27703142
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™