అతడి కన్నా ముందే గదిలోకి ఒక వెలుగు ప్రవహిస్తుంది అతడి రాకతో ఆత్మలో జ్యోతి ప్రజ్వరిల్లుతుంది
కాయాన్ని కాదు కాదు – కాలన్నే నిలవేసే సంకల్పం అతడిది గాలితో ఆయువుని లీలగా ఆహ్వానించగల నేర్పు అతడిది.
ఓర్పు వీరుడు, తూర్పు శూరుడు, సంకల్ప శిఖరం, సమతా దీపం – ! మాటే మంత్రం, కదలికే కనికట్టు – ఇవ్వడం తప్ప పుచ్చుకోవడం తెలియని ఇనకులుడు – !
స్వార్థం తప్ప ఏమీ లేని లోకంలో తానే ఓ కర్పూరహారతి! పంచభూతాల్తో ప్రాణాన్ని మమేకం చేయగల మహామేధావి
సామాన్యంగా ఉంటాడు… అసామాన్యంగా సంభాషిస్తాడు మాట్లాడితే తప్ప మనిషిని అంచనా వేయలేం
వచ్చే వాళ్ళు వస్తారు – పోయే వాళ్ళు పోతారు అతడు మాత్రం ద్వీపస్తంభంలా దిక్సూచిలా నిలబడతాడు
ఉద్యోగం ఉపాధి కాదు – జీతం గిట్టుబాటు కాదు – ! అయినా ఎన్నడూ చిరునవ్వు చెరగదు
ప్రాణవాయువు కనిపించదు – అయినా ప్రాణం నిలబెడుతుంది అతడూ అంతే – ! కనిపించినా కనిపించనట్టు వినిపించినా వినిపించనట్టూ విశిష్టత ఏమీ లేనట్టు గురుత్వాకర్షణ శక్తిలాగా గురుతుల్యుడై సకల ప్రపంచానికి ఇరుసై భూగోళాన్ని తిప్పుతూ ఉంటాడు!
రేపటి వసంతం… మన నట్టింటి దీపం – అతడొక అనంతం – !
చొప్పదండి సుధాకర్
చొప్పదండి సుధాకర్ కథా రచయిత. నవలా రచయిత, కవి. సిద్ధిపేట నివాసి. వృత్తి రీత్యా అధ్యాపకుడు.
manishi goppatanam ade.kavitatmaka vyaktikarana.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™