సంచికలో తాజాగా

Related Articles

22 Comments

  1. 1

    Sarasi

    ఈ కార్డులు మంజూరు చేసే గ్రామాధికారులు, పై అధికారులకు తాము అర్హత లేని వాళ్లకు మంజూరు చేస్తున్నామని తెలుసు. లంచాలు మింగి పాడు పనులు చేస్తున్నారు. దీనికి ఎమ్మెల్యేల దన్ను కూడా వుంటోంది కొన్నిచోట్ల. గ్రామాల్లోకి రాజకీయాలు, పార్టీలు వచ్చినపుడే గ్రామాలు భ్రష్టు పట్టిపోయాయి. మంచి పనులకు కూడా అడ్డుపడుతున్నాయి రాజకీయాలు. వూళ్లు పాడైపోయినా పార్టీలకి అవసరం లేదు. వాళ్లు నెగ్గితే చాలు. మేధావులు చర్చ చేయాలి. అనుచితాల మీద చర్చలు జరగాలి. పల్లెటూళ్లు ఒకప్పుడు అమాయకుల నిలయాలు. ఇప్పుడు రాజకీయాలుకు నిలయాలు. అవినీతిమయం.

    Reply
    1. 1.1

      sagar

      సరసి సర్ ఈ విషయంపై దిమ్మతిరిగే కార్టూన్ ఒకటి త్వరలో ఆశిస్తున్నా

      Reply
    2. 1.2

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సరసి గారూ
      మీ స్పందనకు ధన్యవాదాలు సర్
      చాలా బాగా రాసారు.

      Reply
  2. 2

    sagar

    అది ఖచ్చితంగ ప్రజల తప్పిదమే. బాధ్యత అనేది మననుంచే మొదలుకావాలి. మీరు రేషన్ విషయంలో చూశారు. మా ఊరిలో ప్రక్క ఇంటిలో వ్యక్తి ఇద్దరుకుమారులు నెలకు ఐదులక్షలపైనే సంపాదిస్తున్నా ఆయన, భార్య ఇద్దరూ సామాజిక పెన్షన్లు తీసుకుంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? అరవై నిండగానే అది ఒక హక్కూలా అధికారులకు లంచాలిచ్చి మరీ వ్రాయించుకుంటున్నారు. కాబట్టి మొదట మార్పు అనేది మన నుంచే మొదలవ్వాలి. అప్పుడే పేదవాడికీ, ఆర్ధిక బలహీనులకు న్యాయం జరుగుతుంది. మంచి వ్యాసం అందించినందుకు ధన్యవాదములు సర్ .

    Reply
  3. 3

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీరు రాసిన విషయాలు నగ్న సత్యాలు.. పేదవారి కోసం అమలు చేసే పథకాలు నిజమైన అర్హులకు అందడం లేదు.
    —–వెంకటరామనరసయ్య
    ఈనాడు/మహబూబాబాద్.

    Reply
    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు మిత్రమా.

      Reply
  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    అక్షరసత్యం 🙏💐🙏
    ప్రజలలో నైతికత లేదు, ప్రభుత్వాలుకూడా చూసీచూడనట్టు ప్రవర్తిస్తున్నాయ్ !ఎవరినీ ఏమీ అనలేని పరిస్థితి ! ప్రత్యక్షంగా నాకళ్ళముందే నాయింటిముందే ఓ కుటుంబం
    తండ్రి ప్రయివేట్ కంపెనీ ఉద్యోగి, తల్లి ప్రయివేట్ స్కూల్ టీచర్… కోడుకు సాఫ్టువేరు ఇంజనీరింగ్ పూర్తి చేసి మంచి జీతంతో ఉద్యోగాన్నికూడా సంపాదించుకున్నాడు !వాళ్లకి బియ్యం రేషన్ కార్డు…తల్లీ, తండ్రీ ఇద్దరికీ కలిపి నెలకుసుమారు ముప్పైవేలు జీతం వస్తుంది !
    ఆ తండ్రికి పెన్షన్, తల్లికి చేయూత…. నిజంగా అర్హులైనవారు ఈ పధకాలను పొందటానికి గ్రామసచివాలయాలొచ్చినతరువాత బాగానే ఉంది కానీ ఒకప్పుడు, చాలా వ్యయ ప్రయాసలు పడవలసిందే…
    గ్రామకరణాలచుట్టూ ప్రదర్శనలు చేయవలసిందే ముడుపులు చెల్లించవలసిందే
    ఇప్పుడు ఆపరిస్థితులు లేనప్పటికీ, అనర్హులు ఇంకా ఎక్కువగా లబ్ది పొందటం దురదృష్టకరం.
    —–కోరాడ నరసింహారావు
    విశాఖపట్నం.

    Reply
    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందనకు
      హృదయపూర్వక కృతజ్ఞతలు సర్.

      Reply
  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    విశ్లేషణ చాలా బాగుంది. ప్రభుత్వ పథకాలు ఎలా దుర్వినియోగం అవుతున్నాయో చాలా వివరంగా చెప్పారు
    —-లీల.చాగల్
    నిజామాబాద్.

    Reply
  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    126 సంచిక.
    ప్రభుత్వం చేపట్టిన తెల్ల రేషన్ కార్బు ,ఆరోగ్యశ్రీ కార్డు లగురించి.
    ఒక రిటైర్డ్ రెవెన్యూ అధికారి మేజిస్ట్రేట్ క్యాడరు ఆయన భార్య పేర నిల్ ఆదాయం సర్టిఫికేట్ తీసుకున్నడు.తహసీల్ దారుకు తెలియకుండానే ఆయన సంతకంతోటే. తహసీల్ కార్యాలయాల్లో సిబ్బంది కొరతతో దినసరి వేతన సిబ్బందిని నియమిస్తే రేషన్ కార్డుల పంపిణీ వారి ఇష్టానుసారం జరిగింది.ఒక్కో ఇంటికి రెండు మూడు తెల్ల కార్డులుల ఒక్కో రేషన్షాపు డీలరుదగ్గర నలభై యాభై కార్డులు..
    అట్లనే ఆరోగ్యశ్రీ.మంచి ఉద్దేశంతో పెట్టిన పథకం ప్రైవేట్ దవాఖానాలకు ఆదాయవనరు ఐంది.వరంగల్ లో ఒక ప్రైవేటు దవాఖాన వైద్యూడు తన దవాఖానలో సిబ్బంది పేరిట సర్జరీలు చేసినట్టు డబ్బులు సంపాదించింది లక్షల్లో వున్నదని వదంతి.
    ప్రభుత్వం పెట్టే పథకాల ఉద్దేశం మంచిదే కాని క్షేత్ర స్థాయి ఆచరణలోనే ఫెయిలౌతున్నవి.దానికి అత్యాశ ప్రజలు,లంచగొండి అధికారులు కొందరు కారణం.
    ఒక ప్రభుత్వ కార్పొరేషన్లోవమెడికల్ రీ ఇంబర్స్ మెంట్ పెట్టినారు సంవత్సరానికి లక్షనో ఎంతో పరిమితితో .ఉద్యోగులు కొందరు డాక్టల్ల రబ్బరు స్టాంపులు చేయించుకొని లెటర్ప్యాడ్లూ అచ్చేసుకొని మెడికల్ షాపులలో ST చెల్లంచి బిల్లులు తీసుకొని క్లేములు చేసిన్రు.
    ప్రజల్లో దేశంపట్ల ప్రేమ నీతి .అధికారుల్లో నైతికత లేనంతవరకూ ఈ విషయం ఇంతే సర్ మీరు ప్రస్తావించిన విషయం
    నిజమేనని అందరూ ఒప్పుకునేదే.
    —-రామశాస్త్రి
    హన్మకొండ

    Reply
    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందనకు
      హృదయపూర్వక ధన్యవాదాలు
      శాస్త్రి గారు.

      Reply
  7. 7

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి 126 రేషన్..పరేషాన్.!సంచికలో మీరు వ్రాసినవి అక్షర సత్యాలు.బడుగు బలహీన వర్గాలకు అమలు చేసిన పథకాలు నిజమైన వారికి పూర్తిస్థాయిలో అందటం లేదు,అందుకు రాజకీయ పార్టీలు వారి నాయకుల కారణంగా జరుగుతుంది. ఏ సమస్య కైనా పరిష్కారం ఉంటుంది కానీ వారికి అవసరం లేదు గెలుపే ముఖ్యం.మాకు తెలిసిన కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి. వారికి పదుల కోట్ల ఆస్తులు,బంగ్లాలు,కార్లు ఉన్నాయి వారు అత్యంత ధనవంతులు. వారు తప్పనిసరిగా రేషన్ షాపు ద్వారా బియ్యం మరియు ఇతర వస్తువులు తెచ్చుకుంటారు,మీరు ఎందుకు తీసుకుంటున్నారు మీకు అవసరం లేదు కదా అంటే, వారు ఇచ్చారు మేము తీసుకున్నాము అని ఏ మాత్రం సంకోచించకుండా జవాబు వచ్చింది. వృద్ధుల పెన్షన్ విషయంలో కూడా తేడా లేదు.కావున మార్పు అనేది స్వతహాగా రావాలి,మార్పు రానంతవరకు ఉచిత పథకాలు దుర్వినియోగం అవుతుంటాయి.సమాజానికి ఉపయోగపడే మంచి విషయాలు అందిస్తున్న మీకు ధన్యవాదములు మరియు నమస్కారములు🙏

    Reply
    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలండీ
      రావుగారు.

      Reply
  8. 8

    Neelima

    డాక్టర్ గారు..
    నమస్కారములు..
    ఈసారి మీరు ఎంచుకున్న టాపిక్ చాలా బావుంది.
    నిజమే.. ఈ రేషన్ కార్డులు పేదవారి కన్నా, డబ్బున్న వారే ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు.
    ఎంత సంపాదించినా మనిషికి ఆశ పోవడం లేదు అనేది అక్షర సత్యం..
    మీరు వ్రాసింది చదివి, కొంత మందిలో అయినా మార్పు వస్తే సంతోషం..

    ధన్యవాదాలు..
    నీలిమ..

    Reply
    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  9. 9

    పుట్టి. నాగలక్ష్మి

    ఒక జిల్లాపరిషత్ ఛైర్మన్ గారు.. 1980 లలో అరఎకరం పొలమే ఉంది.. అని’ ‘డి కార్డు ‘ వ్రాయించుకున్నారు.ఆయన భార్యేమో మీ చైర్మన్ గారికి అరెకరం పొలమే ఉంది మరి అని సిన్సియర్ గా చెబుతుంటే ఏమి చేయాలో అర్థం కాలేదు నాకు.. ఇక ఇప్పుడైతే చర్చికి రెండులక్షలు డొనేషన్ ఇచ్చి..సామాజిక పెన్షన్ తో నెలకొక కూతురికి బంగారం కొనిపెడుతున్నానమ్మా! అని చెప్పారు.. ఆనాడు ఈనాడు ఇదే పరిస్థితి.. అసలైన పేదలు నష్టపోతున్నారు.. మంచి విషయాలను అందించారు సార్!

    Reply
    1. 9.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ఇలాగే వున్నా యండి
      పరిస్థితులు.
      ధన్యవాదాలు మీకు.

      Reply
  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఆర్థికంగా వెనకబడ్డ వర్గానికి చెందిన ప్రజానీకానికి చేయూతనందించాలనే సత్సంకల్పముతో కేంద్ర మరియు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఆర్థిక పరమైన ప్రజా సంక్షేమ పథకాలు క్రమబద్ధమైన ప్రణాళిక లోపించడంతో అర్హులైన వారికి అందకపోవటమే కాకుండా అభివృద్ధికి కూడా అవరోధంగా మారాయి .ఇవి కేవలము ఎన్నికలలో ఓట్లు సంపాదించి పెట్టే ప్రజాకర్షక పథకాలు కావటం వలన అన్ని రాజకీయ పార్టీలు వీటిని సమర్థిస్తూ వస్తున్నాయి. ఈ పథకాలకు కావలసిన నియమావళి అనుగుణంగా చట్టబద్ధమైన ధ్రువీకరణ పత్రాలు అడ్డదారిలో సృష్టించి ఉన్నత వర్గాలకు చెందిన ఎన్నో కుటుంబాలు నిస్సిగ్గుగా ,దర్జాగా అనుభవిస్తున్నాయి.
    నిజాయితీ ,ఆత్మగౌరవం లేని మనుషులు అప్పనంగా వచ్చే డబ్బు కోసం ఏ నీతిమాలిన పనికైనా వెనకాడరు …అనడానికి ఉదాహరణ ఈ సంఘటన .మాకు సమీప బంధువైన ఒక పెద్ద మనిషి పది ఎకరాల సాగుభూమి ,అన్ని వసతులతో కూడిన పెద్దఇల్లు ,ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడిపోయిన ఇద్దరు పిల్లలు , మధ్యతరగతి ఆర్థిక స్తోమత ,ఊరిలో పెద్దమనిషి స్థానము ఇది వారి స్థితిగతులు. 60 సంవత్సరాలు పైబడిన భార్యాభర్తలే ఆ ఇంటిలో చీకుచింతా లేకుండా ఆరోగ్యంగా జీవిస్తున్నారు. పిల్లలు ఆదాయ పన్ను పరిధిలోకి వస్తూఉన్నా తల్లిదండ్రులు విడిగా ఉంటున్నారు.. అనే నెపంతో వారు తెల్లరేషన్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు ,భార్యకు వృద్ధాప్య పెన్షన్ మొదలకు సదుపాయాలు పొందటానికి కావలసిన అర్హత ధ్రువీకరణ పత్రాలను అడ్డదారిలో సంపాదించి ఆ సదుపాయాలను యదేచ్చగా అనుభవిస్తున్నారు. ఇంతటితో ఆగని ఈ పెద్దమనిషి భార్యాభర్తలిద్దరికీ వృద్ధాప్య పెన్షన్ పొందాలనే దురాశతో ఇద్దరూ విడిపోయినట్లు (వివాహితులైన ఒంటరి మహిళ లేదా పురుషుడు ఇద్దరూ అర్హులే) ఒక ప్రభుత్వ ధ్రువీకరణ పత్రాన్ని అడ్డదారిలో సంపాదించి తను కూడా పెన్షన్ పొందుతున్నాడు.
    ముఖ్యంగా పల్లెటూర్లలో 45 _50 సంవత్సరాలు నిండిన ఎందరో వ్యక్తులు 500 రూపాయలు ఖర్చు ఖర్చు చేసి 60 సంవత్సరాలు పూర్తయినట్టు ఆధార్ కార్డు సంపాదించి దాని ఆధారంగా ఆర్టీసీ బస్సులలో రాయితీ, వృద్ధాప్య పెన్షన్ మరెన్నో రాయితీ పథకాలు పొందటం సర్వసాధారణం అయిపోయింది.
    ఎంతప్పటికీ ఇటువంటి పత్రాలు అందించే లంచగొండి ప్రభుత్వ ఉద్యోగులను నిందిస్తూ ఉంటాము కానీ ,తక్కువ లంచంతో అధిక లాభాన్ని పొందేది ప్రజలే …అనే విషయాన్ని గమనించాలి .కారణం 500 లేదా 1000 రూపాయలు ఒకసారి ఖర్చు చేస్తే జీవితాంతము ఎన్నో వేలు /లక్షలలో ప్రభుత్వ పథకాలను పొందగలిగే వ్యక్తుల అసలైన అవినీతిపరులు . కాదంటారా! ఒకసారి ఆలోచించండి!
    🍇నాకు మిగిలిన ఆత్మసంతృప్తి🍇
    మా ఊరి దగ్గర నా వాటా కింద మా పూర్వీకులు సంపాదించిన భూమిలో మూడు ఎకరాలు చిరాస్తి ఉంది .ఆ భూమిని పాస్ బుక్ లో నమోదు చేసి అలాగే ఆధార్ కార్డును కూడా లింక్ చేశాను. అలా చేయటం వలన ప్రభుత్వము ఇస్తున్న రైతుబంధుపథకం కింద సంవత్సరానికి ఎకరాకు నాకు తెలిసి 6000 వరకు సహాయంగా అందుతుందట. నేను ప్రభుత్వ ఉద్యోగిని, ఇన్కమ్ టాక్స్ చెల్లిస్తూ ఉన్నా.. ఆ పథకం వర్తిస్తుందని, లోకల్ గా ఒక ప్రభుత్వ రంగ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి ,ఫోన్ నెంబర్తో లింక్ అయిన ఆధార్ కార్డును అనుసంధానం చేయడం వలన ఆ సదుపాయం పొందవచ్చు… అనే విషయాన్ని ఆ గ్రామ సచివాలయ ఉద్యోగి నాకు తెలియజేశాడు. నా మనస్సాక్షికి అది ఇష్టం లేక లోకల్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయకుండా ఆ సహాయాన్ని సున్నితంగా తిరస్కరించాను. ఇక్కడ నేనేదో గొప్ప పని చేశాననే భావన అసలే కాదు . ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడంలో నా ఉద్దేశం ఒక సాధారణ పౌరునిగా నా బాధ్యతను ఉడతా భక్తిగా కొంత నిర్వర్తించ కలిగాననే భావనతో మాత్రమే 🙏🙏.
    –బి.రామకృష్ణా రెడ్డి
    అమెరికా.

    Reply
    1. 10.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అద్భుతం సర్
      చక్కని వివరణ.
      కృతజ్ఞతలు మీకు.

      Reply
  11. 11

    శ్యామ్ కుమార్ చాగల్

    ప్రభుత్వ పథకాల మీద డాక్టర్ కె ఎల్ వి ప్రసాద్ గారు వ్రాసిన విషయం చాలా ఆసక్తి కరంగా వుంది. నిజానికి దీన్ని ఏ నాయకుడు కూడా చర్చించటానికి, అందులో వుండే, జరుగుతున్న అవకతవకలను సరి చేయటానికి ఆసక్తి చూపించరు.
    మొత్తానికి గంప గుత్తగా ఓట్లు పడి అధికారం లోకి రావాలనే తపన తప్ప ఇంకేమీ లేదు. అనర్హులకి ఈ ఫలాలు దక్కడం మామూలే. అందులో రాజకీయ చుట్టరికం కూడా ముఖ్య పాత్ర వహిస్తోంది. నిజాయితీ ప్రజల నుండీ ముక్కు పిండి వసూలు చేస్తున్న టాక్స్ ను ఈ విధమైన తాయిలాల కింద పంచటం ప్రతి రాజకీయ పార్టీ యొక్క విధానమయిపోయింది. వీటికి అలవాటు పడ్డ జనాలు సోమరిపోతులు కావటం, రాను రాను పనికి బద్దకించటం చూస్తూనే వున్నాం.
    ఈ విషయం చాలా పెద్ద చర్చనీయాంశం. సామాజిక స్పృహ తో ఇటువంటి విషయాలు రాస్తున్న రచయితకు, ప్రచురిస్తున్న సంచిక యాజమాన్యానికి నా అభినందనలు

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!