వేసవి సెలవులు ముగింపు దశకు వచ్చాయి. హాలిడేస్ జలిడేస్ గెట్టింగ్ ఓవర్ అన్నమాట. జూన్ మంత్ లోకి ఎంటర్ అయినా ఇంకా వానాకాలం మొదలుకాలేదు. పగలు ఎండ వేడి తగ్గలేదని గవర్నమెంట్ అన్ని స్కూల్స్ జూన్ రెండో వారంలో తెరవాలని చెప్పింది.
గత రెండు రోజులుగా పగలు ఎండ కొంచం తగ్గి ఉక్కపోతగా ఉంది. ఉన్నట్లుండి మధ్యాహ్నం నల్లని వాన మబ్బులు వచ్చి సాయంత్రం అయ్యేలోగా పెద్ద గాలి వాన వచ్చింది.
తరుణ్ అఖిల ఫ్రెండ్స్ తో కలిసి పరుగున వెళ్లి వానలో ఆడి తడిశారు. ‘రైన్ రైన్ కం అగైన్’, ‘వాన వాన చెల్లప్ప తిరుగు తిరుగు తిమ్మప్ప’ అంటూ వాన పాటలు పాడారు.
వాన ఆగిన వెంటనే మళ్ళీ ఎండ వచ్చింది.
లోపలికి రమ్మని అమ్మలు పిలిస్తే వెళ్లబోతున్న పిల్లలకి ఇంద్రధనస్సు అదే రెయిన్బో కనిపించింది. అది చూసిన పిల్లల ఆనందానికి హద్దులు లేవు. వాళ్ళకెంతో ఉత్సాహం కలిగింది.
“వావ్ రెయిన్బో. కిరణ్ లెట్ అజ్ కౌంట్ కలర్స్” అంది అఖిల.
“రెడ్ గ్రీన్ ఎల్లో” అంటూ మొదలు పెట్టాడు కిరణ్.
“రెయిన్బో తో సెల్ఫీ తీసుకుందము అని ఇంట్లోకి వెళ్లి నాన్న సెల్ ఫోన్ తీసుకుని పరుగెత్తుతుంటే నాన్న అపి “కిరణ్ నా సెల్ ఎక్కడికి తీసుకు వెళ్తున్నావు? ఎందుకు?” అని అడిగాడు.
“నాన్నా! రెయిన్బో తో ఫ్రెండ్స్ తో సెల్ఫీ కోసం. ప్లీజ్!” అన్నాడు.
“సరే పద ఐ విల్ టేక్ యువర్ సెల్ఫీ”
“హే హే!” అని అరుస్తూ, పిల్లలందరూ రెయిన్బో బ్యాక్ డ్రాప్ లో సెల్ఫీ తీసుకున్నారు. వెనక్కి తిరిగి చూస్తే రెయిన్బో లేదు.
“అంకుల్! రెయిన్బో ఏది?”
“ఎక్కడికి వెళ్ళింది?”
“అంకుల్ ! అసలు రెయిన్బో ఎలా వచ్చింది?” అని యక్షప్రశ్నలు స్టార్ట్ చేసారు
“వెయిట్ ! వెయిట్ ! ఐ విల్ టెల్ యు రెయిన్బో స్టోరీ. బట్ మీరంతా ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయ్యి తల తుడుచుకుని రండి. లేదంటే జలుబు చేస్తుంది” అన్నారు కిరణ్ నాన్న.
“ఓకే ! అంకుల్ ! వెంటనే వస్తాము. స్టోరీ చెప్పాలి” అంటూ పిల్లలు ఇంటికి పరుగెత్తారు. కిరణ్ కూడా లోపలి వెళ్లి రెడీ అయ్యాడు.
కొద్దిసేపటికి పిల్లలు వచ్చి కిరణ్‌తో పాటూ అంకుల్ చుట్టూ వృత్తాకారంలో కూర్చున్నారు.
“కథ విందామా?”
“నాన్న రెయిన్బో ఎలా వస్తుంది?”
“అంకుల్ రెయిన్బో అంటే?”
“వెయిట్! ఐ విల్ ఎక్స్ప్లైన్.”
“రెయిన్బో ఒక మల్టీ కలర్ అంటే ఏడు రంగుల ఆర్క్/విల్లు లా ఆకాశంలో ఏర్పడి కనిపిస్తుంది. ఇందాకటిలా వాన కురిసి, ఎండ వస్తే కొన్నిసార్లు నీటి చినుకులలో సూర్యుని కిరణాలు ప్రవేశించి కాంతి ప్రతిఫలించి వంపు తిరిగితే వచ్చేదే ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు/ రెయిన్బో.”
“అవునా? మరి ఆర్క్లా ఎలా వుంటుంది?” అన్నాడు కిరణ్
“మీరు అనుకుంటున్నట్లు రెయిన్బో హాఫ్ సర్కిల్ కాదు. ఫుల్ సర్కిల్. అందరం దాన్ని నేల మీద చూస్తాం కాబట్టి మనకి సగమే కనిపిస్తుంది.
“అంటే ఇంకో హాఫ్ పార్ట్ other side of earth లో ఉంటుందా? ఆ సైడ్ వాళ్లకి నైట్ కదా సో కనిపించదు. అంతేనా అంకుల్?”.
నవ్వారు అంకుల్.
“ఓకే వినండి. రెయిన్బో ఒక వైపే ఉండదు. సూర్యుడికి ఎదురుగా 42 డిగ్రీలో ఉండి డ్రాప్లెట్స్లో కాంతి పరావర్తనం /రిఫ్లెక్ట్ అయితే ఎంత దూరంలో ఉన్నా కనిపిస్తుందిట.”
“అంకుల్ రెయిన్‌బోని ముట్టుకోవచ్చా?”
“నో. నెవెర్. అది ఒక వస్తువు కాదు. ఫిజికల్‌గా టచ్ చేయలేము. అంటే నిన్ను నేను టచ్ చేసినట్లు.”
అర్థం అయినట్లు పిల్లలు తల ఊపారు
“రెయిన్బో / ఇంద్రధనస్సు వాన వస్తేనే కనిపిస్తుంది కదా! ఇంకా పొగమంచులో, నీటి తుంపరలలో లైట్ రిఫ్లెక్ట్ అయినా కూడా ఇంద్రధనస్సు కనిపిస్తుంది.
“అవునా.”
“అవును. కిరణ్ మొన్న నేను బబుల్ గన్‌తో ఆడుకుంటుంటే బబుల్స్‌లో రెయిన్బో కలర్స్ కనిపించాయి” అన్నాడు రవి.
“అదే నేను చెప్పేది. వాటర్ ఏ రూపంలో ఉన్న లైట్ పాస్ అయితే చిన్న పెద్ద రెయిన్బో వస్తుంది అని.”
“నాన్నా ఫస్ట్ ఎవరు రెయిన్‌బోని చూసారు?”
“తెలీదు. Sir Issac Newton అనే సైంటిస్ట్ ఇంద్రధనస్సులో ఉండే 7 రంగులు, వాటికి కారణం తెల్లని కలర్ 7 కలర్స్‌గా కనిపించటం అన్నారు.”
“అవును రెయిన్బోలో ఉండే రంగులని సులువుగా గుర్తుపెట్టుకోవడం ఎలా?” అని అడిగారు అంకుల్.
“ఎలా అంటే roy g biv అని గుర్తుపెట్టుకోమన్నారు మా టీచర్” అన్నాడు అరవింద్ ఉత్సహంగా.
“why those letters?” అని అడిగారు అంకుల్.
“అయ్యో! మీకు తెలీదా? ఈచ్ లెటర్ ఈచ్ కలర్ ఇన్ ది రెయిన్బో” అన్నాడు ఆశ్చర్యంగా వినోద్. వాడి ఉద్దేశంలో కిరణ్ నాన్నకి ఇంత కూడా తెలీదా? అని.
అంకుల్ రిప్లై ఇచ్చేలోపే అరవింద్ చెల్లి అనువ “అంకుల్! ఆర్ అంటే red, ఓ orange, వై yellow, జి green, బి blue, ఐ ఇండిగో, వి violet. అంతే సింపుల్” అంది.
“ఓహ్! గ్రేట్ ! థాంక్స్ ! నాకు ఎక్స్ప్లైన్ చేసినందుకు” అన్నారు అంకుల్.
“సరే వినండి మనం చూసే ఇంద్రధనస్సులు ప్రైమరీ టైపు.”
“అంటే?”
“అంటే కలర్ రెడ్ ఆర్క్ బైట వైపు అలాగే వయొలెట్ లోపలి వైపు కనిపిస్తాయి. ఇంకో వింత తెలుసా? రాత్రిపూట చందమామ వెలుగులో రెయిన్బో కనిపిస్తే దాన్ని ’moonbow’ అంటారు.”
పిల్లలందరూ ఒక్కసారిగా ఆశ్చర్యంతో “moonbow!” అని అరిచారు
“అవును , కానీ మనకి వైట్ కలర్ మాత్రమే కనబడుతుంది. ఇంకో వింత చెబుతా వినండి. వాన మబ్బులు, మంచు తుంపరలలో లైట్ రిఫ్లెక్ట్ అయితే వచ్చే ఆర్క్‌ని ‘fogbow’ అంటారు. ’fogbow’ రెయిన్బో కన్నా చాల వెడల్పుగా, పెద్దగా కనిపిస్తాయి. large and boarder than rainbow and white in colour” అన్నారు అంకుల్.
పిల్లలు ఫాగ్బో, మూన్బోలని ఊహించుకుంటూ మౌనంగా ఉన్నారు.
కొద్దిసేపటి తరువాత అంకుల్ “స్టోరీ కంటిన్యూ చెయ్యనా?” అన్నారు.
ఊహల్లోనుండి బయటకు వచ్చిన పిల్లలు “చెప్పండి అంకుల్!” అన్నారు.
“అనేక పురాణాల్లో…”
“అంటే ఏంటి అంకుల్? పురాణం?”
“అంటే వెరీ ఓల్డ్ టైం రిలీజియస్ స్టోరీస్. నోవా అఫ్ ఆర్క్ సాయంతో పెద్ద వరద రక్షించబడిన నోవా అనే అతను ఇతరులు, క్షేమంగా దిగినందుకు తరువాత ధన్యవాదాలు తెలుపుతారు (thanks giving). అప్పుడు దేవుడు వాళ్ళ థాంక్స్‌ని ఆమోదించాను అని రెయిన్‌బోని పంపి చెప్పాడని నమ్మకం. కొన్ని కథల్లో ప్రజలకి దేవుడికి మధ్య ఉండే ఒక ఒప్పందం…”
“ఏమని?”
“భూమిని వరద నీటితో నాశనం చెయ్యొద్దని. వాళ్ళు రెయిన్‌బోని భూమికి, దేవుడికి మధ్య వంతెన అని నమ్మేవాళ్ళు.”
“జపాన్ ప్రజల కథల్లో వాళ్ళ పెద్దవాళ్ళు /పూర్వికులు స్వర్గం నుండి రెయిన్బో ద్వారా భూమి మీదకు దిగివచ్చి వచ్చారని నమ్మకం. గ్రీకు పురాణ కథల్లో ఐరిస్ అనే దేవత రెయిన్బో దూతట. ఐరిస్ దేవతలను మనుషులను ఇంద్రధనస్సుతో కలుపుతుందట. మన హిందూ పురాణాల్లో రెయిన్‌బోని ఆర్చర్స్బో అంటారు”
“ఎందుకు ఆ పేరు వచ్చింది?” అడిగాడు కిరణ్.
“దేవతల రాజు ఇంద్రుడు. అంతే కాదు ఇంద్రుడు యుద్ధాన్ని చేసేటప్పుడు ఉరుములతో, శబ్దం చేస్తూ రెయిన్‌బోని విల్లులా వాడి మెరుపుల్ని బాణాలుగా వాడుతూ యుద్ధం చేస్తాడుట. అందుకని మన దేశంలో ఇంద్రధనస్సు అని పిలుస్తారు.”
“వావ్! ఇంటరెస్టింగ్” అన్నాడు అరవింద్.
“సుమేరియన్ కథల్లో వాళ్ళ దేవుడు నినుర్త సుమేరు రాజుని విల్లు బాణాలుతో రక్షిస్తున్నట్టు రెయిన్బో కిరీటం పెట్టుకున్నాడుట.”
“రెయిన్బో మనకి ఎంత ఆనందాన్ని ఇస్తుందో అంతకన్నా మంచి విలువలు నేర్పిస్తుంది.”
“విలువలా? ఎలా అంకుల్?”
“ఎలా అంటే రెయిన్బోలో 7 వేర్వేరు రంగులు ఎంతో బ్రైట్ గా కలిసిపోయి ఒక్కటిగా ఉన్నాయి. అవునా?”
“ఎస్ అంకుల్.”
“గుడ్. మనుషులు కూడా కలిసి ఉంటే వైవిధ్యంలో ఉండే అందాన్ని ఆర్క్ లా చూపించి చెబుతున్నది. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే భిన్నత్వంలో ఏకత్వం (యూనిటీ ఇన్ డైవర్సిటీ) అన్న మాట. మన చుట్టూ రెయిన్బో కలర్స్ లా రక రకాల మనుషులు ఉంటే మనం వాళ్ళ మధ్యలో డిఫరెంట్‌గా కనిపించటాన్ని ఛాలెంజ్‌గా తీసుకుంటే అది మన ఆలోచనల్ని/మనసుల్ని విశాలంగా చేస్తుంది. we allow us to expand our mindset and become tolerant towards other faiths. రెయిన్‌బోని peace and serenity కి చిహ్నం అంటారు. రెయిన్‌బోని అదృష్టానికి సూచన అంటారు. Rainbow is hope and motivation.
రెయిన్బో మనకి మార్పు అంటే సౌందర్యం అని నేర్పుతుంది, ఉదాహరణకి శిశువుల నుంచి పిల్లల్లా, పిల్లల నుంచి టీనేజర్లలా, యువత నుండి నడి వయసువారిలా, అక్కడి నుంచి వృద్ధుల్లా మారడంలోని అందాన్ని తెలుపుతుందిట. అంతే కాదు, రెయిన్‌బోని assent అని అంటారు. అంటే ఎక్కటం. మనల్ని జీవితంలో గొప్ప లక్ష్యాలు సాధించాలి ప్రేరణిస్తుంది. అందుకే చాల కంపెనీల వాళ్ళు రెయిన్బో సింబల్‌ని లోగోలా వాడుకుంటారు.”
“ఆమ్మో! అంకుల్! ఇంద్రధనస్సు కథ ఇంత పెద్దదా?” అంది అనువ.
“థాంక్స్ అంకుల్! ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పారు. రేపు నేను నా క్లాస్‌లో చెబుతాను” అన్నాడు రవి .
“నేను కూడా చెబుతాను. ఫ్రెండ్స్‌కి” అన్నాడు అరవింద్.
“ఓకే డన్! ఇంక ఇంటికి వెళ్లి ఫ్రెష్ అవండి. బై” అన్నారు అంకుల్.
“బై అంకుల్, బై బై అంకుల్! థాంక్స్ అంకుల్” అంటూ అందరు పరుగెత్తి ఇంటికి వెళ్లారు. వాళ్ళు విన్న ఇంద్రధనస్సు కథ ఇంట్లో చెప్పాలనే ఉత్సాహంతో.
“బై బై పిల్లలూ” అన్నారు అంకుల్.
(Images courtesy: Google)
డి. చాముండేశ్వరి రిటైర్డ్ సోషల్ స్టడీస్, తెలుగు ఉపాధ్యాయిని. దశాబ్దాల పాటు హైస్కూలు విద్యార్థులకు పాఠాలు బోధించారు. యాత్రలు, గార్డెనింగ్, కథారచనలో అభిరుచి. బహుముఖీన వ్యక్తిత్వం గల రచయిత్రి ఇటీవల బాలల కథలు వ్రాసి, వాటికి బొమ్మలు గీశారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™