విచిత్రమైనదీ జీవితం అందులో విచిత్రమైనదీ పోరాటం అనుదినం అనుక్షణం ఎందుకో తెలియదు. ఏం బావుకుందామనో తెలియదు దానికి అంతమెక్కడో అసలే తెలియదు.
బాహ్యప్రపంచంతో సంబంధం లేక తల్లి కడుపులో ఏమనుభవించావో అంతే ! అదే సుఖం అదే హాయి మళ్లీ పొందవు జీవితంలో తిరిగి ఆ హాయి
అయినా ఎంత తల్లైతే మాత్రం ఎన్నాళ్లు మోస్తుంది నిన్ను తెచ్చి పడేసిందీ జీవిత సాగరంలో సాగించు నీ జీవనసమరం అంటూ.
నులివెచ్చని తల్లి ఒడిని వీడి భగ్గు – భగ్గు – మనే ఈ ప్రపంచంలో ఇమడటానికై సాగించే పోరాటం – అది పసితనం పెరుగుతున్న నీతోబాటే పెరుగుతోంది నీ పరిధి అమ్మా, నాన్న, అక్కా, చెల్లి ,అన్నాదమ్ములందరి హృదయాల్లో ఏర్పర్చుకున్నావు ఒక స్థానాన్ని అంతటితో వురుకున్నావా ? చుట్టూ ప్రపంచం మీద పడ్డావు సంఘజీవి నంటూ –
ఐదో ఏటే అడుగిడేవు విద్యార్థి జీవితంలోకి దాంతో మొదలవుతుందొక చిత్రమైన పోరాటం జయం వరించిందా, యినుమడించిన ఉత్సాహంతోనూ – అపజయం వరించిందా తెచ్చుకున్న ఉత్సాహంతోను ఒక్కొక్క మెట్టే ఎక్కావు
అంతంలేని నిశీధిలో ఆగేవు ఏమైతేనేం జీవితంలో అదొక చక్కని దశ బాదర బందీలు లేని దశ పోరాటం సాగించినంత కాలం కసురుకున్నా విసుక్కున్నా చివర్న అయ్యో అప్పుడే అయిపోయిందా! అనుకునే దశ.
అడుగు పెట్టేవు ఇప్పుడు అసలైన జీవితంలోకి ఉధృత మవుతోంది నీ పోరాటం జీవితం అంటే నిర్వచనం తెలియదు ఏవో చేసేయ్యాలనే తపన – చేయలేవు – కాళ్లూ చేతులూ కట్టి పడేస్తుంది నీ నిస్సహాయత ఎటు చూసినా సమస్యలే మొదట నీ కాళ్ళ మీద నీవు నిల్చుందికై సాగిస్తావు పోరాటం ఎప్పటికో ఒకప్పటికి ఏదో ఒక దారి దొరక్కపోతుందా అన్న ధైర్యం నచ్చినా నచ్చకపోయినా విధిగా స్వీకరిస్తావు దాన్ని
అప్పటికే జీవన సమరంలో అలసి ఉన్న నీవు జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నావు అప్పటికే సగం చచ్చిన మనిషివి అంతటితో వూరుకున్నావా ?
అన్నిటికంటే లోతైన సంసార సాగరంలోకి దూకేవు ఎదురీదడానికి ప్రయత్నించావు తెలిసికూడా.
తినడానికి తిండి సమస్య కట్టుకోవడానికి గుడ్డ సమస్య ఉండడానికి గూడు సమస్య మనిషికి మనుగడే సమస్య
వీటికితోడు – నీ మీద ఆధారపడి నీ చుట్టూ వున్న మనుష్యులొక సమస్య. రేపు మీద పెట్టుకున్నావు నీ ఆశలన్నీ.
ధైర్యంతో ఎదురీదబోయావు ఒకదాని మీద ఒకటి అలల్లా వచ్చి పడ్డాయి బాధ్యతలు ఒకటి పూర్తవుతే మరొకటి అయినా సముద్రపుటలలు ఆగుతాయని చూస్తారా ఎవరైనా నీ భ్రమ గాని !
ఒకదానితో ఒకటి పోటీపడి ఆకాశపుటంచుల్ని అందుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. అయినా సాగించేవు నీ జీవన సమరం బాధ్యతాయుతుడైన యోధునిలా
నీ గురించి నీవు విస్మరించేవు నీ బాధ్యతల్ని గుర్తుపెట్టుకున్నావు ఒకదాని తర్వాతొకటి నిర్వర్తించేవు గొర్రెతోక సామెతని రుజువు చేసేవు అప్పటికే నెరిసి పోయింది నీ తల వంగిపోయింది నీ నడుం ఉడిగిపోయింది సత్తువ సాగించేవు ఇంత సుదీర్ఘమైన పోరాటం ఏమి సాధించేవు జీవితంలో అనుదినం అనుక్షణం ఆశ, నిరాశ, నిస్పృహ, నిస్సహాయతల మధ్య కొట్టుమిట్టాడేవు జీవితానికి పరమార్థమేమిటో తెలియదు ఒక జడత్వం ఆవహించింది ఏదో చెయ్యాలనే ఆ తపన చచ్చి పోయింది ఏం చేసినా నీ చేతిలో లేదు ఆ విధాత చేతిలో కీలుబొమ్మలా ఆడడం తప్పదని నిన్ను నువ్వు సరిపెట్టుకున్నావు
అయినా ఎందుకో తాపత్రయం మనిషికి మనుగడ ఉన్నంత కాలం తప్పదు మరి అందుకే అనిపిస్తుంది చిత్రమైనదీ జీవితం అందులో విచిత్రమైనదీ పోరాటం అనుదినం అనుక్షణం ఎందుకో తెలియదు ఏం బావుకుందామనో తెలియదు దానికి అంతం ఎక్కడో అసలే తెలియదు.
Comment…vevery very nice … superrrrr beautiful, adhurss , adbhuthamm ga undi ,
మీ జీవన పోరాటం చాలా బాగుందండీ నా జీవతం లో జరిగిన సంఘటనలు ఇలానే ఉన్నాయి
చాలా అద్భుతంగా వుంది నా జీవితం ఇలాంటివే మరికొన్ని సంఘటనలు
Chala chala bagundi
చాలా బాగుందండి
చాలా బాగుంది
కీలు బొమ్మలా ఆడడం తప్పదని నిన్ను నీవు సరిపెట్టుకున్నావు
చాలామంది కి ఇలాంటి సంఘటనలే జరుగుతాయి.చాలా బాగుంది
అంతం లేని నిశీధిలో ఆగేవు ఏమైతేనేం జీవితంలో చక్కని దేశ ఆ రోజులు మళ్లీ రావు
నిజంగానే ఈ “జీవన పోరాటం”లో జీవితం యొక్క పరమార్ధం ఏమిటో ఎవరికీ తెలీదు. మీ యొక్క “జీవన పోరాటం” చాలా బాగుంది.
ఈ పోటీ ప్రపంచంలో ఆకాశం అంచుల్ని తాకుతున్నారు.కానీ మాలాంటి వారికి తినడానికి తిండి సమస్య కట్టుకోవడానికి గుడ్డ సమస్య ఉండడానికి గూడు సమస్య మనిషికి మనుగడ సమస్య చాలా అద్భుతంగా చెప్పారు సుబ్రహ్మణ్యం గారు
ప్రతి మనిషి జీవితంలో జరిగిన సంఘటనలే ఈ జీవన పోరాటం అందుకే మనిషి జీవితం విచిత్ర మైనది.చాలా అద్భుతంగా ఉంది
సుబ్రహ్మణ్యం గారు మీ జీవన పోరాటం చాలా అద్భుతంగా ఉంది
సూపర్ సుబ్రహ్మణ్యం గారు మీ జీవన పోరాటం నా పోరాటంలో జరిగిన సన్నివేశాలు చాలా చాలా బాగుంది
జీవన పోరాటం చాలా బాగుంది సుబ్రహ్మణ్యం గారు మీ కవితలు మాకూ పంపండి
Super ga vundi mee jeevana poratam subrahmanyem garu super
అడుగు పెట్టేవు ఇప్పుడు అసలైన జీవితంలోకి ఎవరి జీవితం అయినా ఇలానే ఉంటుంది.చాలా బాగా రాశారు జీవన పోరాటం సూపర్.
మీ జీవన పోరాటం చాలా బాగుంది సుబ్రహ్మణ్యేశ్వర రావు గారు
Chala chala bhagundi jeevana poratam subrahmanyeswara rao garu
Bagundi
చాలా బాగుంది సుబ్రహ్మణ్యం గారు
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™