సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమాదేవి గారి స్పందన: *నమస్కారం అండి. చాలా సంతోషంగా వుంది. మీ అందమైన అనుభవాల అనుభూతి వాటి తాలూకు జ్ఞాపకాలు ఇంకా మనోహరమైన మానసిక భావోద్వేగాలు వాటి తాలూకూ మీ మానసిక స్థితిని ప్రభావితం చేసే అంశాలు. దాసరి నారాయణరావుగారు, రామానాయుడు గారు
    కలయికకు మంచి గుర్తింపు వచ్చింది ప్రేక్షకుల మనసుల్లో నిలిచి పోయింది కూడా. అది ఒక గొప్ప కాలం. మరల రానిది మరువలేనిది కూడా. తిరిగి ఈ సినిమాను ఆ లోకాన్ని అప్పటి అనుబంధాలను గుర్తుంచుకుని మీ అనుభూతిని పంచి మా మనసుల్ని తీపి జ్ఞాపకాల తీరాలకు జతచేసి ఆనందింపజేసారు.
    సంపూర్ణ సంతృప్తి పొందిన మనసు మౌనమై ఆనంద స్థితిలో మమేకం అవుతుంది. ఆ మీ అనుభవంలో ఓ అనుభూతి మాకు పంచారు. చాలా సంతోషంగా ఉంది.హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు అండి.*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్రొ. సిహెచ్. సుశీలమ్మగారి స్పందన:*భువన్ జీ, అవును. కొన్ని క్షణాలు ఆనందంతో కలిసిన ఓ “స్తబ్దత” మనిషిని మౌనం లోకి నెడతాయి. కానీ ఆ మౌనాన్ని మనసారా అనుభూతించడం ఎంత బాగుంటుంది!
    బంగారు కోడిపెట్ట, వానా వానా వెల్లువాయె పాటలు మెగాస్టార్, కొన్ని ఏళ్ల తర్వాత ఆయన కుమారుడు స్టెప్స్ వేసి నాటి, నేటి యువతను ఉర్రూతలూపించాయంటే – ఆ పాటల్లో ఉన్న మీ రచనా చమత్కారమే. బహుశా సినీ చరిత్ర లో మీకు మాత్రమే లభించిన అరుదైన రికార్డు ఇది. “స్మగుల్డు గూడ్స్ బండీ వచ్చెనండీ” అని పాట మొదలై వుంటే ఇంత పాప్యులర్ అయ్యేది కానేకాదు. వాగ్దేవి కరుణా కటాక్షాలు మీయందు నిండుగా ప్రసరిస్తున్నాయనడానికి ఇలాంటి ఎన్నో సంఘటనలు మీ జీవితం సంభవించాయి కదూ!*

    Reply
  3. 3

    Rama Sundari M S B P N V

    దాసరి గారి యాక్షన్ కూడా అద్భుతంగా ఉంటుంది. సూరిగాడు పాటలన్నీ హృదయంలో పదిలపరుచుకునేవే.
    చిరంజీవి గారి హిట్ పిక్చర్స్ లో చెప్పుకోదగ్గ గ్యాంగ్ లీడర్, ఘరానా ముగుడు చిత్రాలు ఆయనకీ, మీకూ కూడా అజరామరమైన కీర్తిని అందించాయి. డిస్కో శాంతి గారి డ్యాన్స్ కూడా. షి ఈజ్ రియల్లీ ఎ పయస్ సోల్.
    కీరవాణి గారింట్లో మల్టీ టాలెంట్ పెల్లుభికుతూ ఉంటుంది. శివదత్త గారి పెయింటింగ్స్ చూసి చాలా ఆశ్చర్యపోయాను. కీరవాణి గారు ఒక పాటని ఎన్నో రాగాల్లో పాడి వినిపించగలరని ఆర్.జి.వి అన్నారు. అలాంటి కుటుంబం సినిమా రంగంలో ఉంది కాబట్టే సినిమాల్లో కూడా ఆ అద్భుతం కనిపిస్తుంది. అమృతం సీరియల్ లో కళ్యాణి మాలిక్ సంగీతమే అనుకుంటా. హలో ఆంజనేయులూ…తెగ ఆరాటపడిపోకు, చాలు…అంటూ..
    కరిమబ్బుల్లో తటాలున మెరిసే విద్యుల్లత చందాన ‘బంగారు కోడి పెట్ట వచ్చెనండీ’ పదాలు పడ్డాయి. సిట్టింగ్స్ లో అవసరమైన వారందరూ కూర్చోవడం, ఒక పదం అటు నుంచీ, ఒక పదం ఇటు నుంచీ వినబడ్డం కూడా ఆ క్షణంలో చరిత్రని లిఖించదగ్గ పాటలు, డైలాగులూ ఉద్భవించడానికి కారణం అవుతాయి. చిరంజీవి ఘరానా ముగుడు సినిమా ఫంక్షన్ కి వచ్చిన లక్షలాది జనాన్ని చూసి, ఆ రాత్రి నేల మీద పడుకున్నానని చెప్పారు..ఇంత మంది ప్రేమ లభించిన నాకు అనవసరమైన కిక్కు తలకెక్కకూడదని అలా చేశానని అన్నారు. పాటలు హిట్ టాక్ వచ్చిన తర్వాత మీకూ బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్ పాట గుర్తొచ్చింది. అంతిమ సత్యం అదే. అద్భుతంగా పనిచేయడం, జనం జేజేలు వినబడినా అంతర్లీనంగా ఉండిపోవడం. ఇది మీకు అలవాటేగా, ఒకప్పుడు సైనికుడిగా…ఇప్పుడు గీతరచయితగా..

    చండి (రమాసుందరి)

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఉంగుటూరు శ్రీలక్ష్మి గారి స్పందన: *చాలా బాగుంది.*

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పల్నాటి రోహిణి గారి స్పందన: * శ్రీ భువన చంద్ర గారికి నమస్కారములు. ప్రతి వారం ఎన్నో కొత్త విషయాలు తెలియచేస్తున్న మీకు 🙏. ఎప్పుడో జరిగిన విషయాలు అయినా ఇప్పుడే షూటింగ్ జరుగుతున్న అనుభూతి కలుగుతుంది. సినిమా పాటలు అంటే బాగుంటే ఓ 4సార్లు వినటమే కానీ దాని పుట్టుక తెరమీదకు రావటానికి వెనుక ఎంత శ్రమ వ్యవహారం వుందో నాకు తెలియదు. మీ జీవితం ప్రయాణం చదువుతుంటే ఎంత కష్టం పాటలు శ్రద్ద గా వినాలి ఆషా మాషీ కాదు అనిపించింది. గ్యాంగ్ లీడర్ సినిమా రిలీజ్ అయినవుడు ఊరు వాడా ఆ పాటలే మారు మ్రోగేవి. మా పిల్లలు చిన్న వాళ్ళు వచ్చి రాని మాటల్తోపాడేవారు. ఆ తీపి గుర్తులు మళ్ళీ నెమరు వేయిస్తున్నారు. ఆరోజులు ఆ పాటలు సినిమా మోజు వేరండీ.ధన్యవాదములు -రోహిణి 🙏🌹*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®