కావలిలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు ‘కులం కథ’ పుస్తకం చదివి తమకి నచ్చిన కథను విశ్లేషించి, ఆ కథ తమకెందుకు నచ్చిందో పేర్కొన్నారు. సీనియర్ ఇంటర్ చదువుతున్న ఎ. సౌమ్య ఈ పుస్తకంలోని ‘మంచితనానికి కులమేమిటి?’ కథను విశ్లేషిస్తోంది.
***
సంచిక తెలుగు సాహితీ వేదిక ప్రచురించిన ‘కులం కథ’ పుస్తకంలో 42 కథలున్నాయి. అందులో నాకు నచ్చిన కథ ”మంచితనానికి కులమేమిటి?’. ఈ కథ రాసిన రచయిత్రి ఎస్.పార్వతిదేవి గారు.
ఆమె ఈ కథని చాలా అందంగా అద్భుతంగా రచించారు.
ఈ కథలో పాత్రలు రాజగోపాలం, రాజమ్మ, శివప్రసాద్, శేఖర్. రాజగోపాలం రాజమ్మకు పుట్టిన ఏకైక కుమారుడు శివప్రసాద్. రాజగోపాలం రాజమ్మ శేఖర్‌ను ఆదరిస్తారు. శేఖర్‌ను తన కన్న కొడుకులాగా ప్రేమగా ఏ కల్మషం లేకుండా పెంచుతారు. ఆ దంపతుల మనస్సులో కులానికి అసలు చోటు లేదు. మంచి మనస్సుతోనే శేఖర్‌ను ఉన్నత స్థాయికి పంపుతారు. కాని శేఖర్ తన పరువు పోతుంది అని అమ్మను కూడా చిన్న చూపుతో చూస్తాడు. తన చిన్నతనంలో లేని కులం, మతం అనే బేధం తన పెరిగి పెద్దవాడు ఐయాక తన కన్న తల్లి మీదనే చూపించాడు. మనం చిన్నప్పటి నుండి ఏది నేర్చుకుంటామో అది పెద్దయ్యాక కూడ అలవాటు అవుతుంది అంటారు. కాని శేఖర్ తన జీవితంలో చేసిన పెద్ద తప్పే కులం భావన చూపించటం.
కులం, మతం మన ఆచారంలో ఉంటే ఉండచ్చు, కాని మన మనస్సులో ఉండకూడదు. మన బాల్యము స్నేహం అనే భావనతో పెరగాలి కాని కులం, మతం అనే పేరుతో ఉండకూడదు. మన దేశం భారతదేశం అని చెప్పాలి కాని కుల పిచ్చి అను దేశం అని చెప్పకూడదు. కలిసి ఉంటే కలదు సుఖం అని ఒక గొప్ప కవి అన్నాడు. దాని అర్థం కలిసిమెలిసి ఉంటేనే దానిలోని సుఖం చాలా బాగుంటుంది అని. కులం పేరుతో కొట్టకోవడం కన్నా ప్రేమ, స్నేహం, అనురాగం ఆప్యాయతతో కలిసి ఉండటం మేలు.
ప్రేమతో దేనినైనా సాధించవ్చచు. కానీ కుల పిచ్చితో మనషులు వారి కుటుంబానికే కాకుండా దేశానికి కూడా దూరమవుతారు. కులం, మతం అనే రెండు పదాలు మానవ జాతినే నాశనం చేస్తుంది. మంచితనానికి కులం ఏంటి మతం ఏంటి. మంచి మనస్సు ఉంటే చాలు కాని మంచి చేసే చోట ప్రేమ ఉంటుంది. కాని కులం మతం అనే భావన ఉండరాదు కూడా. మనందరిలో ప్రేమ, స్నేహం పెరగాలి కాని కులం, మతం, పగ, ద్వేషాలు ఉండకూడదు. అంతా మన మంచికే అని ఆలోచిస్తూ పోతే ఈ లోకం అంతా మనకి మంచిగానే కనబడుతుంది.
ఎప్పుడు కూడా ఎవరు ఎవరి మీద పగ ద్వేషం కులం చూపించకూడదు. అందరితో కలిసి మెలిసి పోతుం ఉంటే ఏ భావన రాదు.
నీతి – ఇప్పుడే కాదు మన మనసులో ఎప్పుడు కూడా కులం అనే భావన ఉండరాదు. మంచి చేసే వారి కుల పిచ్చి ఉండదు. మంచి మనస్సు దయాదాక్షిణ్యాలు ఉన్నవాడే అగ్రజాతివాడు.
ఎ. సౌమ్య
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™