సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    “బడిపంతులు” పాటలో భార్యాభర్తల అనుబంధాన్ని, ఒంటరి వారమయ్యామన్న ఆవేదన, కడదాకా కలిసి ఉండాలనే ఆకాంక్ష, చిత్రీకరణ మొదలైన విషయాలను ప్రశంసనీయంగా విశ్లేషించారు..ఆ కథను ఏయే భాషలలో తీశారు, పాట పాడిన రాగచ్చాయలను కూడా బాగా వివరించారు..సాధారణంగా ఇలాంటి ప్రత్యేక విషయాలు చాలామందికి తెలియవు……….ఈరోజుల్లో భర్తను “ఏమండీ….మీరు…” అంటూ గౌరవంగా మాట్లాడే భార్యే లేదు. ఒక సినిమాలో సూర్యకాంతం “శుక్రవారం పూట ఎందుకండీ అంత మాట అంటారు? కాస్త నా మాంగల్యం అయినా గట్టిగా ఉండనివ్వండి” అంటూ తాళి ని కళ్ళకు అద్దుకుంటుంది…గయ్యాళి పాత్ర కూడా భర్తను, వివాహబంధాన్ని గౌరవిస్తుంది.

    Reply
  2. 2

    గోనుగుంట మురళీకృష్ణ

    బడిపంతులు చిత్రంలో భార్య రాసిన ఉత్తరం చదువుకునే ఆతృతలో అతడి కళ్ళజోడు కింద పడి పగిలిపోతే, చిన్న అద్దం పెంకులతో చదువుకోవటం, ఫోన్ మాట్లాడేటప్పుడు దగ్గుతో ఉక్కిరి బిక్కిరి అవుతుంటే అతడి భార్య పడే ఆవేదన వంటి సన్నివేశాలు చూస్తుంటే మనం కూడా ఆ పాత్రలతో మమేకమై కన్నీరు కారుస్తాము. బాలనటి శ్రీదేవి కూడా చాలా హుషారుగా నటించింది. చిన్నపిల్లలు అమ్మమ్మ తాతలతో, వృద్ధులు పిల్లల సాంగత్యంలో ఎంత ఆనందంగా ఉంటారో కూడా చాలా బాగా చూపించారు.. ఏ తరం ప్రేక్షకులైనా చూడదగిన గొప్ప చిత్రం బడిపంతులు.

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా. వి. ఆర్. రాసాని గారి స్పందన:*బడిపంతులు సినిమా వివరాలను అందులోని అంజలీదేవి పాటను అద్భుతంగా వివరించారు. రచయితకూ, సంపాదకులకు అభినందనలు. మొత్తానికి మధుర గీతాలు శీర్షికను మధురంగానే నిర్వహిస్తున్నారు.*

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బ్నిం గారి స్పందన:*ఇప్పుడే చదివాను.
    ఆచార్య ఆత్రేయ గారు భర్తని దీవిస్తున్న భార్యని ఆవిష్కరించారు అనిపిస్తుంది పాట వింటుంటే.
    చిరంజీవ! శతాయుష్మాన్ భవ! అనడానికి బదులుగా తన పుణ్యస్త్రీత్వం నిలబడాలని కాంక్షనీ బయట పెట్టుకుంటుంది అంటే భర్తని దీవిస్తున్నట్టే కదా.
    ఈ పాటలో కృతజ్ఞత ఉంది. క్షమాపణ ఉంది. దీవెన ఉంది. ఒక భక్తురాలు భగవంతుడి పట్ల చూపిస్తున్న ఆరాధన ఉంది.
    మీరు ఆ పాటని ఎన్నుకోవడం .. చాలా సంతోషం వేసింది.
    ఆత్రేయ గారు.. ఇలా భార్యాభర్తల అనురాగం మీద మనసు ధారపోసి రాసిన మరో పాట త్రిశూలం సినిమాలో రాయిని ఆడది చేసిన రాముడివా.. ఆ భక్తి.. ప్రేమ.. కృతజ్ఞత.. కాంక్ష ఆకాంక్ష కూడా ఆత్రేయ మార్కుతో కనిపిస్తుంది. ఈ పాటలో సుశీలమ్మ అంజలీదేవి కి నటన నేర్పించింది. సగం పైగా సుశీల నటించేసింది..!
    అయితే .. అంజలి సుశీలన అందుకోవడమే కాదు అధిగమించింది. ఒకో గమకానికి రెండు సాత్విక భావాలు రంగరించింది.
    ఎప్పుడో లవకుశ లో సీతారాములాలా హుందాగా అందంగా నటించేరేమో.. అది విడివిడిగా దూరంగానే ఉండి.. అండర్ యాక్టింగ్ తో సీత మార్కు కొట్టేసింది గాని.. ఇంత ఫిజికల్ ఎమోషన్స్ తో ప్రేమైక భావన తో పూర్తి మార్కులు వడ్డించుకుంటుంది ఈ సినిమాలో.. ఈ పాత్రలో.. ముఖ్యంగా ఈ పాటలో…
    వీరిద్దరి కన్నా ఎక్కువ మార్పులు… కె.వి.మహదేవన్ కి ఇవ్వాలి . ఈ పాటని ఇంకెవరు ఇంకెలా పాడినా ఓవరాక్షన్ లా ఉండేది.
    అంజలి డామినేషన్ కాకుండా.. ఎన్టీఆర్ రెచ్చిపోయి ఉండేవారు..
    రిటైర్ అయిపోతే అంత ముసలాడు అయిపోతారా.. అని మాత్రం అనకండి.
    అంజలిని చూడండి! సుశీలమ్మని వినండి! ఆత్రేయకి దండం పెట్టేయండి. మామని కౌగిలించేసుకోండి!*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®