సంచికలో తాజాగా

Related Articles

25 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా. రేవూరు అనంతపద్మనాభరావు గారి వ్యాఖ్య: *చాలా చక్కగా చెప్పారు. గుడులు వసూలు కేంద్రం అయినాయి*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్రొ. సిహెచ్. సుశీలమ్మ గారి వ్యాఖ్య: * చదివాను.
    రచయితతో పాటు నడిచాను. ఆశ్చర్యపోయాను. బాధపడ్డాను. గతం తలుచుకుని వెక్కసపడ్డాను.
    ప్రస్తుత పరిస్థితికి ఆవేదన పడ్డాను. “గోడల మీద శిల్పాల్లో ఉన్న పాఠ్య పుస్తకాలు” పఠించివుంటే ఈనాడు ఈ దుస్థితి ఉండేది కాదు.
    అసలు ఎవరు కారణం?
    “విడుదల” చేయడం కుదరదు. ఎన్ని ఎన్ని ఎన్ని సంకెళ్ళలో బందీ అయి ఉన్నాడో!
    ఒక్కొక్క సంకెల గురించి ఒక్కొక్క అధ్యాయం రాస్తే ఒక పెద్ద గ్రంథం అవుతుంది.
    అప్పుడు అదొక మత దురహంకార గ్రంథం, రచయిత ఒక మతోన్మాది అనే పేరు వస్తుంది.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీలక్ష్మి గారి స్పందన: *మురళీకృష్ణ గారు నమస్తే శుభోదయం అద్భుతమైన మీ రచన పూర్తిగా చదివిన చదువుతూ ఉంటే రక్త మరిగిపోతోంది అంటారే అలా అయింది. ఎందుకు అంటే అప్పుడు మనకి విద్యను దూరం చేసి మన దేశాన్ని ఆంగ్ల విద్య మనదేశంలో ప్రవేశపెట్టి బానిసలు చేసుకున్నారు. ఇప్పుడు మన దేవుడిని దూరం చేసి మనలో మనకి భేదాలను కల్పిస్తున్నారు. అదే చాలా బాధ కలిగించేది. దేవుడు వ్యక్తిగతమే కావచ్చు కానీ మన దేవుని దగ్గరకి మనం వెళ్లాలంటే టికెట్లు ఏంటి? క్యూ ఏమిటి? మీరు రాసినది 100 కి 1000% కరెక్ట్.*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అనసూయ గారి వ్యాఖ్య: *సంచిక లోని నిను విడుదల చేస్తాం రామయ్యా.. చాలా చాలా మంచిగుంది సార్..🙏*

  5. 5

    డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు

    నిను విడుదలచేస్తాం రామయ్యా ‘..అన్న కథ అద్భుతంగా, అందరిని ఆలోచింపచేదిగా వుంది .కొండమీది గుడి గురించిన ఆ ప్రకృతి వర్ణనలు , దైవభావన గురించిన ఆ తాదాత్మ్యకత ఇవన్నీ కథ ప్రారంభంలోనే పఠితుల మనసును ఆకర్షింపచేసేసాయి . రెండో సగం కథలో రచయిత మురళీకృష్ణగారు అందరి మనోభావాలకు ప్రాతినిధ్యం వహిస్తూ సంధించిన ప్రశ్నల బాణాలు ఎవరికి తగలాలో వాళ్ళకి తగిలేవుంటాయి ..గుడి ఎందుకిలా వ్యాపారకేంద్రమయింది .? దేవాలయాలు ప్రభుత్వాలకు ఆదాయకేంద్రాలు ఎందుకయ్యాయి ..? దేవుడ్ని దర్శించుకోవాలంటే టికెట్ కొనుక్కోవాలా ..? కాలాన్ని క్యూల్లో నిలబడి వృధాపరుచుకోవాలా ?..దేవాలయాల మీది శిల్ప కళ మనకేం చెపుతోంది ..? ఇలా ఒకటా రెండా ..? దేవుడితో వ్యాపారం చేసుకునేవాళ్లకు దిమ్మతిరిగిపోయే ప్రశ్నలు ..! కథా రచన లోని వాడి, వేడి కథ స్థాయిని పెంచటమేగాక భావుకత అనేది లేని ఈ మనుషులగురించి , దైవభావనలేని దేవాలయ అధికారుల గురించి రచయిత మనసులో వున్న ఆవేదనను , ఆరాటాన్ని , తపనను బహిర్గతం చేసింది ..నిజానికి ఇవి అందరి మనసులోని ఆలోచనలు ..కానీ ఎవ్వరూ పైకి చెప్పలేదు ..వారు చెప్పారు ..అదీ భావాత్మకంగా , మనసుకు హత్తుకునేలా , నివురుగప్పిన నిప్పులాంటి ఆవేశంతో కూడిన ఆవేదనతో ..! ఇవి ఈ కథ చదువుతున్నప్పుడు నాకు కలిగిన భావాలు .అందరిని ఆలోచింపచేసేలాంటి మంచి సామజిక సబ్జెక్ట్ తీసుకొని’ కొందరి ‘ కళ్ళు తెరిపించే ప్రయత్నం చేసినందుకు మురళీకృష్ణ గారికి నా ధన్యవాదాలు …..🙏

  6. 6

    గోనుగుంట మురళీకృష్ణ

    కథ బాగుందండీ! రాను రాను దైవదర్శనం ఖరీదైన వ్యవహారం అయిపోతున్నది. అంత ఖర్చు చేయలేని పేదవారికి దేవుడి దర్శనం కరువేనా!..అందుకే “కలవారినే గానీ కరుణించలేవా! నిరుపేద మొరలేవి వినిపించుకోవా?'” అంటూ దేవుడిని ప్రశ్నించాడు ఓ సినీకవి….కథ చివరలో చెప్పినట్లు భక్తి ఉన్నవారినే దేవాలయాధికారిగా నియమించాలి…..మొదలుపెడితే విడవకుండా చదివించేటట్లు ఉంది కథన శైలి..వైవిధ్యభరితమైన అంశాన్ని ఆసక్తి గొలిపేటట్లు చెప్పినందుకు అభినందనలు.

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సలీం గారి వ్యాఖ్య: *సంచిక లో మీరు రాసిన కథ చదివాను.. ప్రసిద్ధి చెందిన గుళ్ల లో భక్తులకు ఎదురయ్యే వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టిన కథ.. గొప్ప కథ.. కథ ప్రవాహంలా సాగిపోయింది.. Daring story.. Guts ఉన్న వాళ్ళు మాత్రమే రాయగల కథ.. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా చాలా balanced గా రాశారు.. అభినందనలు..*

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శాంతిశ్రీ గారి వ్యాఖ్య:* కథ బాగుంది. వ్యాపార స్థలాలుగా మారుతున్న దేవాలయాల గురించి, మృగ్యమవుతున్న ఆధ్యాత్మిక చింతన గురించి హృద్యంగా రాసారు. చదివిన తర్వాత మనసులో కొంత విషాదం చోటుచేసుకుంది.*

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది హైమా భార్గవ్ గారి వ్యాఖ్య: *”నిను విడుదల చేస్తాం రామయ్యా!” కథ బాగా రాశారు. ప్రభుత్వాల అధీనంలో ఉన్నంత వరకు గుళ్లను పూర్తిగా దోచేసి, ఆ డబ్బుతో ఫ్రీబీస్ కోసం, ఇతర మతాల కోసం ఖర్చు చేస్తారు. ఎవ్వరూ నిలదియ్యరు. అడిగినా పట్టించుకోరు. తమిళనాడులో ప్రభుత్వం దేవాలయాల రాబడితో దేవాలయం ముందు ఏదో కట్టడాలు ప్రారంభించాలని ప్రయత్నిస్తే, కోర్టులో వేశారు. కోర్టు ప్రభుత్వాన్ని చీవాట్లు పెట్టి, ఆపింది. మరీ తమిళనాడులో ఘోరం. నాస్తికుల ప్రభుత్వం అది. అందుకే ఆలయాల కోసం ప్రత్యేకమైన బోర్డు ఉండాలనే డిమాండ్ ఎక్కువైంది.
    ఇకపోతే, ఆలయాల విషయంలో చర్చించాలంటే చాలా సమయం తీసుకుంటుంది. క్లుప్తంగా రాస్తాను. ఆలయాన్ని ఇతర మతస్తుల ప్రార్థనా మందిరాలతో పోల్చి చూడకూడదు. అక్కడ దైవానికి ఒక రూపం ఉండదు. అభిషేకాలు, షోడశోపచార పూజలు ఉండవు. ఏ సేవలూ లేకుండా, ఎప్పుడు వెళ్ళినా ఖాళీగా ఉంటాయి. శుక్రవారాలు, ఆదివారాలు రద్దీగా ఉంటాయి. మనకు అలా కాదు. ఉదయం నుండి, రాత్రి వరకు సుప్రభాత సేవ నుండి ఏకాంత సేవ వరకు రకరకాల సేవలు ఉంటాయి. మధ్యలో నైవేద్యాలు ఉంటాయి. అందువల్లే పూలు, పాలు, ఇతర పూజ సామాను అమ్మవారికి జీవనోపాధి దొరుకుతోంది. అర్చకులు కష్టపడుతూనే వుంటారు. ప్రభుత్వాలు వాళ్ళకు జీతాలు సరిగా పెంచదు. సరిగా ఇవ్వదు. తమిళనాడు గుడిలోని ఒక అర్చకుడు నాతో స్వయంగా చెప్పాడు నెలకు ఐదు వేలు ఇస్తారని. గుడిని శుభ్రం చేసే వారికి, ఇతర ఉద్యోగులకు ప్రభుత్వ జీతం అనుకుంటాను. దేవుడి డబ్బును దేవుడిని అర్చించే అర్చకులకు ఇవ్వరు. అదీ విషాదం. మళ్ళీ ఇందులో కుల ద్వేషం,(ముఖ్యంగా తమిళనాడులో వుంది). ఎంత అన్యాయం! సేవల మధ్యలో దర్శనాలు వుంటాయి. గుడికి ఆదాయం కావాలంటే సేవల బట్టి టిక్కెట్లు ఉంటాయి. డబ్బు ఇవ్వగలిగిన వారికి టిక్కెట్లు. లేనివారికి ధర్మ దర్శనం. నా చిన్నప్పుడు తిరుమలలో పెరిగాను. ప్రతి సేవకు టికెట్ వుండేది. మరీ ఖరీదు కాదు. ఇప్పుడు టికెట్ సేవలు చాలా వరకు తగ్గించి, ధర్మ దర్శనం వేళలు పెంచారు. ఒకప్పుడు ఇంత జనాభా ఉండేది కాదు. నేనే స్వయంగా చూసి, చెబుతున్నాను. హాయిగా దర్శనం అయ్యేది. ఇప్పుడు జనాభా విపరీతంగా ఉంది. అందుకే రద్దీ. కంట్రోల్ చెయ్యడం కష్టం. పైగా సోషల్ మీడియా వల్ల అందరికీ తెలిసి, చాలా దూరం నుండి తిరుపతికి వచ్చేవారు ఎక్కువ. తిరుమల లోనే ఇంత రద్దీ. అన్ని చోట్లా విపరీతం కాదు. ప్రముఖ క్షేత్రాలలో రద్దీ తప్పదు. ఇవన్నీ ఆలోచించాలి. ఒక్కటి మాత్రం నిజం. ఆలయాలను ప్రభుత్వాల నుండి విడిపిస్తే, బోర్డును ఏర్పరిస్తే, తగిన సంస్కరణలు చేసుకోవచ్చు. రచయిత ఉద్దేశం అర్థం అవుతుంది. దేవాలయ దర్శనం అనేది బిజినెస్ ట్రిప్, విహార యాత్ర కాకూడదు.*

  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మల్లాప్రగడ రామారావు గారి వ్యాఖ్య:*మీ కథ ఒక సాహసం. మన వీపు మీద చరుపు. అభినందనలు.*

  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా. చిత్తర్వు మధు గారి వ్యాఖ్య: *కథ చాలా బావుంది.ప్రతి విషయం నిజంగా జరుగుతున్నదే రాశారు.ఒక పవిత్రమైన అనుభూతిని వ్యాపార మయంగా చేసి విగ్రహారాధన లో ని ఆథ్యాత్మిక అంతరార్థం థ్వంసం చేశారు.కథ అంతా ప్రతి డిటెయిలింగ్ ఎంతో చేయి తిరిగిన రచయిత స్వయంగా అనుభూతి చెందితే తప్ప రాయలేరు. నేను కూడా చాలా సార్లు తిరుపతి లో నే ఇలా ఫీలయాను. పలుకుబడి, ధనం, రెకమెండేషన్ వున్నప్పుడు బ్రహ్మరథం పట్టి దర్శనం చేయించారు. ఏమీ లేనప్పుడు ఎంతో సేపు సామాన్యంగా దర్శనం కూడా చేసుకోవాల్సి వచ్చింది.
    హిందూ మతం గొప్పది. ఆలయాలు కులాలు బట్టి పూజా విధానాలు వివిధ రకాల ఆరాధనలలో ఎన్నో సంస్కరణలు జరగాలి అని నమ్మే వారిలో నేనొకడిని. అందుకే మీ నుండి వచ్చిన ఈ కథ ఎంతో ఆశ్చర్యం ఆనందం కలిగించింది.
    భగవంతుని కోసం ఇంత పలుకుబడి, ధనం అవసరం అయితే డబ్బు కల వర్గం ఈ మతాన్ని కులాలనీ ఒక రాజకీయ, ఆర్థిక దోపిడీకి గురి చేసి తెలివిగా దోచుకుంటున్నాయి. ఇది మారాలి అని మీ కథ ఆలోచనని తప్పకుండా కలిగిస్తుంది. అదే సాహిత్యపు లక్ష్యం, కథ సాఫల్యత.*

  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సంధ్యా యల్లాప్రగడ గారి వ్యాఖ్య: *మీ కథ చదివాను పూర్తిగా. మీ కథలో రచయితకు గుడిలో క్యూలో కలిగిన భావపరంపరంతా నాకు కలిగింది.
    నేనూ ఇది చాలా ఆలోచన చేసిన విషయము.
    గుడి నుంచి మనకు ఏం కావాలి? ఏం పొందుతున్నాము?
    ఈ ముస్లీమ్ హిందూ గోల ఎందుకు పెరిగిపోతోంది?
    గుడికి వెళ్ళటము ద్వారా కలిగేది కష్టమే. మౌనంగా గుడిలో జనాలకు అంటక కూర్చొని దేవుని ధ్యానించటము నచ్చి ఆ పద్దతిలో కంటిన్యూ అవుతున్నా.
    మీ కథ చాలా బలమైన గొంతుక. అభినందనలు.*

  13. 13

    sudheerkaspa

    దమ్మున్న రచయిత. గట్టి విషయమున్న కథ. గుడికెళ్లినప్పుడు భక్తుల మదిలో చెలరేగే బాధల్నీ, భావనల్నీ చక్కగా చెప్పారు.

    భక్తుల నుండి దైవాన్ని దూరం చేసేందుకే ప్రభుత్వాలు గొలుసులూ, గేట్లూ పెట్టింది. మనసుల్లో మనుషుల్లో దూరాలు పెంచేందుకు టిక్కెట్టు ధర వ్యత్యాసాలు కనిపెట్టింది.

    ఇప్పుడైతే అందరికీ అలవాటైపోయింది. భక్తులే కానీ భక్తి లేదు. “నాకిది కావాలి- నీకిదిస్తా” అని ఒక డీల్ కుదుర్చుకోవడానికి వెళ్తున్నారు. దేవుడేమీ జవాబివ్వడుగా డీల్ బాగా మాట్లాడుకున్నామనే ఆనందంతో తిరిగెళ్లిపోతారు భక్తులు. ఆ దైవాన్ని ఎవరెంత అవమానించినా, దేవుడినే నిలువు దోపిడీ చేసినా భక్తులకు చీమ కూడా కుట్టినట్లుండదు. అదంతే తోసుకుంటూ తొక్కుకుంటూ పోయి డీల్ సెట్ చేసుకురావాలి అంతే…

  14. 14

    కొల్లూరి సోమ శంకర్

    ఇది షామీర్ జానకీదేవి గారి వ్యాఖ్య: *అద్భుతంగా రాసారు. గుడికి వెళ్ళకుండా ఉండలేము. ఈ బాధలు తప్పటం లేదు. క్యూలో ఉన్నంత సేపూ ఇలాంటి వేదనే కలుగుతుంది. ప్రతి గుడి దగ్గరా షాపుల్లో ముస్లిమ్‍లే ఉంటారు. మన గుళ్ళన్నీ వాళ్ళే ధ్వంసం చేసారు. ఏమిటో ఈ మాయ. ఆలోచింపచేసేదిగా ఉంది.*

  15. 15

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జె. శ్యామల గారి వ్యాఖ్య: *మొత్తానికి పాట కథకు కూడా బీజం వేసి, ఫలించేలా చేసింది. ఇది అందరి అనుభవమే. మీదైన శైలి కథంతా పరుచుకుంది. మంచి కథ రాసిన మీకు అభినందనలు.
    అయితే చివర.. నాకు కొంత తికమకగా అనిపించింది.. ఎందుకంటే.. రామయ్యను కాదు గుడి నుంచి విడుదల చెయ్యాల్సింది, దైవాన్ని వ్యాపార వస్తువుగా మార్చిన ప్రభుత్వాల కబంధ హస్తాల నుంచి దైవాన్ని విముక్తుడిని చేయాలి.. అన్నారు.
    రామయ్య, దైవం ఒకరే కదా. రామయ్యను గుడి నుంచి కాదు విడుదల చేయాల్సింది.. అనడం కరెక్ట్ అనిపించింది. అదలా ఉంచితే..
    అంతలోనే .. ‘అవును.. రాముడిని గుడినుంచి విడుదల చేసి ప్రజల నడుమ నిలపాలి..’
    తర్వాత పేరాలో కూడా రామయ్య గుడి నుంచి విడుదల కావాలి…అని మళ్ళీ నొక్కి చెప్పారు.
    మరి ముందు పేరాలో ‘రామయ్యను కాదు గుడినుంచి విడుదల చేయాల్సింది..’ అని రాయడం?
    నా అవగాహనా లోపం అయితే.. వివరించండి.*

  16. 16

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీపతి లలిత గారి వ్యాఖ్య: *కస్తూరి మురళీకృష్ణ గారు వ్రాసిన కథ ‘నిను విడుదల చేస్తాం రామయ్యా‘ చదివాను. చాలా బాగుంది.
    దేవాలయంలో దైవ దర్శనంతో పాటు, ఎన్నో విషయాలు నేర్పడానికే దేవాలయాలు నిర్మించారు.
    ఇప్పుడు గుడిని అలా తీరిగ్గా చూసే వీలు లేకుండా వ్యాపార ధోరణిలో మార్చేశారు.
    దేవుడిని బందీ చేసి మనం దర్శనానికి వెళ్తున్నాం. అందులో భక్తి కనపడడం లేదు. అన్నింటా వ్యాపారం చేస్తున్నారు.
    ఇక్కడ రాసినట్లు చర్చిల్లో క్యూలు లేవు, మసీదుల్లో క్యూలు లేవు. ఎందుకంటే వాళ్ళకి మతం ముఖ్యం. మనకి మతం పేరిట వ్యాపారం, రాజకీయం ముఖ్యం.
    అసలు గర్భగుడిలో ఉన్న విగ్రహంలో ఉన్న దైవాంశ ఉందా లేక ఈ అక్రమాలు చూడలేక బయటికి వచ్చేసిందా అనే అనుమానం కలుగుతుంది. – శ్రీపతి లలిత.*

  17. 17

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వాణికుమారి గారి స్పందన: *బాగుందండి. నావి కూడా సరిగ్గా ఇలాంటి భావనలే. అందుకే హడావుడి లేని గుడికి వెళ్ళి ప్రశాంతంగా గడపాలనుకుంటాను. చాలాసార్లు సాధ్యం కాదు. సాధ్యమైనప్పుడు కలిగిన అద్భుతమైన అనుభూతి మాత్రం గుండెలో మిగిలి ఉంది.*

  18. 18

    కొల్లూరి సోమ శంకర్

    ఆత్మారాముడిని విడుదలచేసే సంకల్పం నిను విడుదల చేస్తాం రామయ్యా
    ~
    కస్తూరి మురళీకృష్ణ గారు వ్రాసిన ‘నిను విడుదల చేస్తాం రామయ్య’ కథ శీర్షికతోనే వివాదాస్పదంగా మొదలయిందనిపిస్తుంది. పాఠకుడు ఒక formed opinion తో చదవటం మొదలెట్టి, కథ సాగే కొద్దీ బొక్క బోర్లా పడతాడు.
    ప్రతి రోజూ , ప్రతి చోటా కనిపించే దృశ్యాల్ని, కథాలంకారంలో కమనీయంగా చేర్చి, కూర్చి, అమర్చి అందించాడు రచయిత.
    మన కళ్ళముందు జరిగే సంఘటనలకి మొదటిసారి అవా క్క వుతాం. రెండవసారి ఆశ్చర్యపోతాం. మూడవసారి ముక్కున వేలేసుకుంటాం. నాల్గవసారి’ ప్చ్’ అనుకుంటాం. ఆ తర్వాతనుంచీ అంతమాత్రం స్పందన కూడా ఉండదు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే వాటికి immune అయిపోతాం. ఆ తర్వాత దాన్నే ఆచారంగా ఒప్పేసుకుంటాం. కొండొకచో, తిరుమల దర్శనం ఎన్ని ఎక్కువ గంటల సమయం పడితే అంత గొప్ప పుణ్యాత్ములం అని ఆత్మవంచన కూడ చేసుకుంటాం.
    అలాంటి ఒక సందర్భాన్ని, ప్రకృతి అందాల్లో అలౌకిక తత్వం తో మునకలేసి పడమటి కేసి పయనించిన ఒక పథికుడు, మూడు దశాబ్దాల తర్వాత తిరిగి ఆ ప్రదేశానికే వచ్చినప్పుడు చూసిన పరిస్థితి అతణ్ని ఎంతగా కలవరపెడుతుందో అన్నదే ఈ కథ.
    ఒక్కొక్క సందర్భంలో రచయిత ఒక్కొక్క అవతారం దాలుస్తాడు.
    విగ్రహ సౌందర్యాన్ని చూసి నిగ్రహం కోల్పోయిన కథానాయకుడు అలౌకిక ప్రపంచం లోకి వెళ్ళిపోయాడు. ఇది రామకృష్ణ పరమహంస అరచేయి తన నుదుటిని తాకగానే, నరేంద్రుడు లోనయిన శక్తిపాత అనుభూతి లాంటి అనుభవం.
    కొండమీద ప్రతి అణువూ పవిత్రమే అంటూ సాగిన భావాలు, ప్రకృతిలో కలిసిపోయేంతగా ఉన్మత్త భావాలు మనలోని కృష్ణశాస్త్రి ని తట్టిలేపుతాయి.
    లోకంబులు, లోకేశులు .. అంటూ విహ్వ లమైన మనసు పలుకుతున్నప్పుడు, ఇన్నేళ్లుగా కరడుగట్టి ఏలుతున్న అహం ఒక్కసారిగా చచ్చి, తను ఇహంలోకొచ్చి ‘నీవే తప్ప ఇతః పరమెరుగ’ నంటూ మోకరిల్లిన గజేంద్ర మోక్ష దృశ్యం లోని పోతన కనిపిస్తాడు.
    సచ్చిదానందం, మన్ను – మిన్ను – అంతకు మించిన విశ్వం, నాలో- నా చుట్టూ- పరమార్థం కోసం జరిగే విషయాలన్నట్లుగా త్రిగుణాత్మకంగా త్రికోణ దృక్కులుగా విశ్లేషించే విజ్ఞత చూసినప్పుడు జిడ్డు కృష్ణ మూర్తి కనిపిస్తాడు.
    ఎప్పుడు ఎవరికి ఎలా జ్ఞానోదయం కలుగుతుందో, అది తనని ఏ వైపుకు తీసుకువెళ్తుందో అన్న విషయం మనిషి వూహకి అందని భగవంతుని screenplay.
    కథానాయకుడు తాను నిర్దేశించుకున్న మార్గంలో వేల మైళ్ళ దూరానికి వెళ్ళి పడమట అందలాల్ని అందిపుచ్చుకున్నా కూడా, మనసులో నిరంతర ఆలాపన తనకి జ్ఞానసిద్ధి కలిగిన ప్రదేశం. ఎప్పుడెప్పుడు మళ్ళీ వెళ్ళి ఆనాటి అనుభూతి క్షణాల్ని అనుభూ తించు కోవాలన్న తపన.. obsession.
    ఆరుద్ర చెప్పినట్టు, confusion గుప్పి టి నుండీ anxiety ముట్టడి. అది మనల్ని నిలువనీదు. అలా అతణ్ని ఆ గుడి దగ్గరికి లాక్కువస్తుంది.
    జిడ్డు కృష్ణ మూర్తి అంటాడు – we all want to be famous people, and the moment we want to be something, we are no longer free.
    ఈ కథలో మనకు ఆ విధమైన సంకెల కనిపిస్తుంది. దేవుడు స్వేచ్చగా ఉన్నాడు. కథానాయకుడు స్వేచ్చగా ఉన్నాడు. దేవుడు ప్రాచుర్యం పొందసాగాడు. కథానాయకుడు కూడా ఒక లక్ష్యం నిర్దేశించుకుని ఎడగసాగాడు. అవాల్సినదంతా అయ్యేసరికి, దేవుడు కొందరి చేతుల్లో బందీ అయ్యాడు. ఎంతో సాధించిన కథానాయకుడు కూడా, తన virgin experience with nature ని మళ్ళీ పొందలేని స్థితికి జారాడు.
    అయితే, కథాక్రమంలో అతని ఆశలు క్రమంగా ఆవిరి అవుతూంటాయి. ఆధ్యాత్మికం ముసుగులో పేరుకుపోయిన వ్యాపారాత్మక ధోరణి, అతణ్ని నిజంగానే confuse చేస్తాయి. విరక్తి, నిరసన, అంతర్మథనం, గందరగోళం లాంటి భావాలు క్రమ్ముకుంటే అతని పరిస్థితి ఎలా ఉంటుందంటే, దేశ సరిహద్దుల్లో ప్రజలకోసం ప్రాణాలొడ్డి యుద్ధం చేసి వచ్చిన సైనికుడు తన వూరికి వచ్చినప్పుడు ఎదురయ్యే సమాజం లో ఉండే వాస్తవ వికారాలు. వీళ్ళ కోసమా తాము ప్రాణాలర్పిస్తోంది అన్న నిర్వేదం !
    కథానాయకుడు కూడా ఒక సైనికుడే! అయితే ఆధ్యాత్మిక సైనికుడు. స్వేచ్చగా ప్రకృతి ఒడిలో నిర్మలంగా నవ్వుతూ భక్తులకి దర్శనమిచ్చె దేవుడు గర్భగుడిలో మగ్గిపోతూ ఉండటం, సామాన్య భక్తులు దర్శనం కోసం జైలు గది లాంటి కటకటాల గదుల్లో మగ్గిపోవడం చదివితే, రచయిత కున్న రచనా శిల్పం ఎంత ప్రభావవంతంగా ఉందో తెలుస్తుంది.
    గొప్ప భావదీప్తి వెదజల్లే వాక్యాలు –
    – అందరూ చలి చలి అంటున్నారు. కానీ, నాకు మాత్రం తల్లి చల్లని చేయితో నిమురుతున్నట్టుంది.
    – ఘాట్ రోడ్డు ని చూసి పాము కూడా కొత్త కోణాలు నేర్చుకుంటుంది.
    ఇలా చెప్పుకుంటూ పోతే, రచయితగా senior ఏ కాదు, మదిలో కదలాడే భావాల్ని see -near గా కూడా చెప్పగల సమర్థత కనిపిస్తుంది.
    చివరగా, కథానాయకుడి సంకల్పం – గుడిలోని రాముడిని విడుదల చేయటం. నిజానికి, తనలోని రాముడిని లౌకిక, ప్రాపంచిక వాసనలనుండీ విడుదలచేయడం.
    నిజానికి ఈ కథ ఆత్మాశ్రయం. ఉత్తమ పురుష లో చెప్పిన ఉదాత్త మనో క్లేశం.
    మురళీకృష్ణ గారి కథలు సాధారణంగానే చదువరిని ఆకట్టుకుంటాయి. కానీ ఈ కథ నట్లు నట్లు గా సాగి కట్టిపడేస్తుంది. అంత ప్రగాఢంగా సాగింది రచన.
    ఏ కథానయినా అయిదు నిమిషాల్లో చదివి పడేసే నేను, ఈ కథ చదువుతున్నప్పుడు అయిదు చోట్ల ఆగి మళ్ళీ చదివి అర్థం చేసుకోవాల్సివచ్చింది. ఒక్కటి ఖచ్చితంగా చెప్పగలను.
    కథ చదివిందర్వాత, ఒక్క నిమిషం స్తబ్దంగా ఉంటుంది. ఆ తర్వాత ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ తర్వాత ప్రాకృతిక శబ్దాలలో, నిశ్శబ్దాలలో ఏవేవో స్వరాలు, ఎన్నెన్నో యుగాల భావనలు, ఆలోచనలు, ఆవేదనలు, సంవేదనలు, ఆశలు, సిరాశాలు, తరగలు, తరగలుగా ఎగసెగసి పడుతున్నట్టనిపిస్తుంది.
    ఇది కథానాయకుడి భావన. నా అనుభవం.
    ఎవరికైనా, meditation లో స్థిరంగా కూర్చున్నప్పుడు కలిగే తొలి సంఘర్షణ !
    – కస్తూరి రాజశేఖర్

  19. 19

    కొల్లూరి సోమ శంకర్

    ఇది షేక్ కాశింబి గారి స్పందన: *ఓహ్.. అత్యద్భుతం.. ఇది కథ.. వ్యాసం.. విమర్శ.. ఆత్మ శోధన.. ఆధ్యాత్మిక పరిశీలన.. పేరేదైనా పెట్టుకోవచ్చు.. కానీ.. ఇది ప్రతి మనసుకు కావాల్సిన.. ప్రతి ఆత్మకు అందాల్సిన ఒక అత్యంత విలువైన దృష్టికోణం.. ఇది లేనప్పుడు ప్రాణం ఉన్నా ఉన్నా జీవి జీవించి లేనట్లే.. ఇది ఎందరో అనుభవిస్తున్న నరకయాతన.. ఇదీ అని చెప్పలేని ఒక తనకలాట.. సున్నితమైన ఈ వెలితికి అక్షర రూపం ఇవ్వడంలో మురళీ కృష్ణ గారు నూరు శాతం కృతకృత్యులయ్యారు.. ఒక గొప్ప సంఘర్షణ.. తరువాత మనసుకెంతో ప్రశాంతత లభించింది.. హృదయ పూర్వక అభినందనలు.. 🙏💐*

  20. 20

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బి. రోహిణి గారి వ్యాఖ్య:*పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మాకందరికీ అయిన అనుభవాలకు అక్షర రూపం ఇచ్చారు. పదవులు కానీ డబ్బులు కానీ ఉన్నవాళ్లకు మాత్రమే దైవ దర్శనం అనిపించేది. అక్కడికి వెళ్ళి ఆ రద్దీని చూసి, మనల్ని తోసేసి, ముందుకు వెళుతున్న వాళ్ళను చూసి బాధగా తిట్టుకోవడమే సరిపోతుంది. తరువాత అనిపిస్తుంది…అయ్యో! దైవ సన్నిధిలో దేవుడి నామస్మరణ చేయకుండా ఇలా చేసామే అని. కానీ ఆ నిమిషంలో ఆవేశం, కోపం వస్తాయి. క్యూలను ఆపేసి, గొప్పవాళ్ళను లోపలికి పంపినప్పుడు ఇంకా బాధ అవుతుంది. అందుకే సామాన్య జనాలు అసహనంతో అందరినీ తోసేస్తారు. ఇక గుడి ప్రాంగణంలోని శిల్పకళను చూడడానికి కూడా వీలుండదు. ఇంకా ఉత్తర భారత దేశంలో అయితే, దేవుడికి అడ్డంగా నిలబడి డబ్బులు ఇస్తేనే దేవుడి దర్శనం అని అడ్డంగా దోచేస్తారు. ఇవన్నీ చూసాక హాయిగా ఇంట్లో కూచుని ప్రశాంతంగా దైవ స్మరణ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది.*

  21. 21

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బెహరా సత్యనారాయణమూర్తి గారి వ్యాఖ్య:*ఇది కథ కాదు. ఒక అర్థవంతమైన అందరి ఆవేదనను రచయిత వెల్లడించారు. రచయితగా మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టే కథ. మీకు అభినందనలు. ఒక సమయంలో ఒక వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా అని అనుకున్నా, లేదు నిష్పక్షపాతంగా సామాన్య భక్తుడి మనోభావాలను వెల్లడిస్తున్నారు అని పాఠకులు చివరికి నిర్ధారణ చేసుకుంటారు. మీకు అభినందనలు. కథ తరువాత మీ గురించి పూర్తిగా తెలుసుకోవడం ఆనందంగా ఉంది. అభినందనలు.*

  22. 22

    కొల్లూరి సోమ శంకర్

    ఇది నరేంద్ర సందినేని గారి వ్యాఖ్య: *దైవ దర్శనంలో జరుగుతున్న తంతు గురించి ప్రతి ఒక్కరూ ఇలాగే ఆలోచిస్తున్నారు.అందరి ఆలోచనల ప్రతిరూపం మీ కథ. ఇవ్వాళ దైవ దర్శనం వ్యాపారంగా మారిపోయింది.ఎవరు ఏం చేయలేని స్థితికి చేరింది. నాటి పూజారులు ఎంతో విశ్వాసంతో దేవుని నమ్ముకుని బతుకు గడిపే వారు. నేటి పూజారులకు దైవం పట్ల భక్తి లేదు. దైవం సన్నిధిలోనే ఇప్పుడు అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. వ్యవస్థలో జరుగుతున్న తంతును అద్భుతంగా మీ కథలో ఆవిష్కరించడం చక్కగా ఉంది. ధన్యవాదాలు.*

  23. 23

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఎం. బిందుమాధవి గారి వ్యాఖ్య:*ప్రస్తుత కాలంలో దేవాలయానికి వెళ్ళినప్పుడు నాకు కలిగిన, కలుగుతున్న భావాలనే ఈ కథలో వివరించారు. దేవుడు వ్యాపార వస్తువు అయ్యాడు. నేను భగవంతుడిని హృదయ కుహరంలో దర్శించి ఆనందించటానికి అలవాటుపడ్డాను. టీవి ప్రవచనాల పుణ్యమా అని మా బోటివాళ్ళు గుడులకి ఎగబడ్డాక మీ బోటివాళ్ళు గుడికి రావటం మానేశారు అని మా ఇంట్లో పనిమనిషి నాతో చెప్పిన నగ్న సత్యం. నిజం.. నిజం.*

  24. 24

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వల్లభాచార్య గారి స్పందన: *”భయం లేదు దేవుణ్ణి గుళ్లో పెట్టాం” అని వ్రాశాను ముప్ఫై యేళ్ల క్రితం.
    అలా నిర్భయంగా మనమే గుళ్లో “కట్టేసిన” దేవుణ్ణి “విడుదల చేస్తా, రమ్మం”టున్నారు కస్తూరి మురళీకృష్ణ.
    ఎందుకు విడుదల చేయాల్ట? గుళ్లో ఎన్ని ఉత్సవాలు? ఎంత వైభవం? ఎన్ని కైంకర్యాలు? ఎన్ని ప్రసాదాలు? మధ్యలో నీకేం నొప్పి? అని విరుచుకుపడే “అజ్ఞాన భక్తమహాశయులూ” వుంటారు.
    ఈ కథ ఒక వ్యక్తి ఒక కొండ మీద దర్శించిన ఒక ఆలయం, దాని చుట్టూ పరచుకొన్న ప్రకృతి, మంటప స్తంభాల శిల్ప వైభవమూ, తీరుబడిగా గర్భగుడి ముంగిట నిలిచి తనివి తీరా దేవుణ్ణి కళ్ల నిండా, మనసు నిండా, ఆత్మ నిండా నింపుకొన్న అనుభవం! అదే అనుభవం “చితికి పోయిన” విషాదం!
    ముప్ఫై యేళ్ల తరువాత మళ్లీ వచ్చాడు స్నేహితుడితో కలిసి. అంతా తలక్రిందులై పోయింది. గుడికి వెళ్లే దోవంతా ఏదీ ఆ పచ్చని ప్రకృతి? సిమెంటు కట్టడాలు తప్ప?
    దేవుణ్ణి చూద్దామంటే “దర్శనం బుక్ చేసుకున్నావా?” అని ప్రశ్న! అదీ “ఆన్లైన్లో!
    పోనీ ఏ సత్రంలో నయినా వుందామంటే ఒక్కో “కులా”నికి ఒక్కో సత్రం! భగవంతుని క్షేత్రంలో కులానికొక సత్రం! ఆ కులం కానిఇతరులకు ప్రవేశం లేదు! ఆ కులం కాని వాడికి అక్కడ “అన్నం పెట్టం!”. భగవంతుని క్షేత్రంలో మా వాడయితేనే చోటిస్తాం, అన్నం పెడతాం… నివ్వెరపోతాడు!
    గుడి ముంగిట పూజ సామగ్రి అమ్మే దుకాణాలు. పూల దుకాణాలు. విగ్రహారాధకులైన హిందువులవి కావు! గోమాతను పూజించే సనాతన ధర్మావలంబకులవి కావు! విగ్రహ విధ్వంసకులవి! గో మాంస భక్షకులవి! గోమాతను వధించి,భక్షించే చేతులతో కట్టిన పూలమాలలను నా దేవుడికి ఎలా సమర్పించాలని కుమిలిపోతాడు!
    “నా దేవుణ్ణి చూడటానికి నేను డబ్బులు కట్టాలా?”
    “నా దేవుడి ప్రసాదం నేను డబ్బులిచ్చి కొనుక్కోవాలా?”
    “నా దేవుడి క్షేత్రంలో వుండటానికి నేను ఫలానా కులం వాడిని మాత్రమే కావాలా?”
    ఇప్పుడు చెప్పండి.. దేవుణ్ణి టిక్కట్ల కిటికీల నుంచి, ప్రసాదం అమ్మకాల నుంచి, కులాల బురద నుంచి, గోఘాతకుల చేతి పూల మాలల నుంచి “విడుదల” చేయాలా? వద్దా?
    దేవుణ్ణి ఆ సిమెంట్ కీకారణ్యం నుంచి “విడుదల” చేసి, మళ్లీ పచ్చని ప్రకృతి నడుమకు తీసుకురావాలా? వద్దా?
    ఒకప్పుడు నేను శ్రీకాళహస్తి ఆలయానికి వెడితే గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ, ఆలయ మంటపం అంతా దర్శించాను. ఇవాళ అటూ ఇటూ కంచె కట్టి, నేరుగా వెళ్లి నేరుగా తిరిగి రావడమే. గర్భగుడి చుట్టూ చూసే అదృష్టం లేదు.
    అలాగే శ్రీరంగ క్షేత్రం శ్రీరంగనాథుని గర్భాలయం చుట్టూ ఎన్ని ఉపాలయాలు? ఇప్పుడు ఒక్కటీ చూడలేము!
    పాతికేళ్ల క్రితం శ్రీరంగ క్షేత్ర సప్త ప్రాకారాలు, వాటిలో కొన్ని వందల ఆలయాలు చూశాను. ఇప్పుడు ఎటు నుంచి ఎటు వెళ్లాలో తెలియదు!
    కస్తూరి మురళీకృష్ణ వ్రాసిన ఈ కథ కేవలం ఒక మనిషి గుండె పగిలిన కథ మాత్రమే కాదు… సమాజం పగిలిన కథ! ఒక సమైక్య సనాతన జాతిని కులాలు ముక్కలుగా పగలగొట్టేసిన కథ! గోపూజకుల ఆలయ పవిత్రతను, వారి ఆర్ధిక, వ్యాపార మూలాలను పగలగొట్టేసి, గోఘాతకులు- గోభక్షకులు దోచుకుంటున్న కథ! దేవుడి ఆలయావరణలో వెల్లివిరిసే ఆధ్యాత్మిక వలయాన్ని ప్రభుత్వాలు పగలగొట్టేసిన కథ!
    ఒక మనిషి స్వీయ ఆధ్యాత్మికానుభవం పునాదిగా దేవుణ్ణి అమ్మేసుకుంటున్న సమాజ దారుణదృశ్యాన్ని వ్యాఖ్యానించిన కథ! మురళీకృష్ణ మాటలు మింగే “తధాకథిత సెక్యులర్” కాదు. “నసుగుడు రాతలు” వ్రాయరు. సుదీర్ఘ సెక్యులర్ గాఢనిద్రలో కూరుకు పోయిన హిందూజాతిని మేల్కొల్పడానికి అక్షర యుద్ధం చేస్తున్న లేఖీనీ యోధుడు!*

  25. 25

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వల్లభాచార్య గారి స్పందన:*మీ “రామయ్య” కథ చాలా లోతైన అంశాల విశ్లేషణకు బాటలు వేస్తుంది.
    ఆలయం చుట్టూ విస్తరించిన “ఆధ్యాత్మిక విధ్వంసం” వెనుక ప్రధాన కారణం “హిందువుల జ్ఞాన భ్రష్టత” అని నాకు అనిపిస్తోంది. గుడికి తాకిడి పెరిగిన కొద్దీ “ముట్టడి”, “దాడి” పెరుగుతాయి. బెల్లం చుట్టూ ఈగలు! ఈ తాకిడికీ, ఆ ముట్టడికీ ప్రధాన కారణం.. నాకు తోచినది.. మీ ముందు పెడుతున్నాను.
    హిందువులలో భగవత్తత్త్వ జ్ఞానం నశించి దశాబ్దాలు దాటిపోయాయి.
    హిందువులలో భక్తిదీపం కొండెక్కి కూడా దశాబ్దాలు గడచిపోయాయి.
    హిందువులలో ఆధ్యాత్మిక చింతన మరుగున పడి పోయి కూడా దశాబ్దాలు కరిగిపోయాయి.
    భగవంతుని “సర్వవ్యాపక లక్షణ స్పృహ” హిందువులలో “కను”మరుగైపోయింది.
    “తిరుమలలో వున్న శ్రీనివాసుడే నా ఊరి గుడిలోనూ వేంచేసి వున్నాడు”.. అనే నమ్మకం హిందువులకి లేదు.
    “భద్రాచల రాముడే నా ఊరి చిన్ని రామమందిరంలోనూ విరాజమానుడై వున్నాడ”న్న విశ్వాసం హిందువులలో లేదు.
    అంతెందుకు.. “సమస్త క్షేత్రాలలో కొలువై వున్న దేవీదేవతలందరూ నా ఇంట్లో వున్న చిన్ని గూడు లాంటి పూజామందిరంలోనే వున్నార”న్న “తెలివిడి” హిందువులలో లేదు.
    పార్టీ టికెట్ దొరకకపోయినా, దొరికి గెలిచి పదవి రాకపోయినా పార్టీల కండువాలు మార్చేసే “రానా”ల లాగ “ఈ దేవుడు మన కోరిక తీర్చకపోతే ఇంకో దేవుడు” అంటూ ధోవతుల రంగు మార్చేసే ఊసరవెల్లులు హిందువులు.
    చివరికి హిందూ దేవీదేవతలతో “పని” కాకపోతే దర్గాలకు పోయే కోరికల బానిసలు హిందువులు.
    మీ కథలో నాయకుడు ఇలా ప్రవాహం వెంటబడి కొట్టుకుపోయే వాడు కాడు.
    దైవీ చేతనను విగ్రహం నుంచి తనలోకి ఆవాహన చేసుకోవాలనే సాధకుడు.
    ఆలయంలోని అణువణువునా సాక్షాత్కరించే సాంస్కృతిక వైభవాన్ని తనలో నింపుకోవాలని ప్రయత్నించే ఆరాధకుడు.
    భగవత్ ప్రతిరూపమైన ప్రకృతిలోని ప్రశాంత సౌందర్య యవనిక పైన ఆ సృష్టికర్త దర్శనాన్ని చేసుకొనే తపస్వి.
    అంటే.. మీ కథానాయకుడు నిజమైన హిందువు, అసలైన భక్తుడు.
    అలాటి వాడికి ఈనాటి ఆధ్యాత్మిక విధ్వంసం కలిగించే వేదనాస్వరూపాన్ని పట్టుకోవడంలో ఎక్కడా బెసగని కథనం మీది. అభినందనలు!*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!