చిన్నారి ధరణి, అన్న సాగర్ అమ్మ నాన్నలతో వేసవి వడగాలులు, తీవ్రమైన ఎండల వేడిని తప్పించుకోవటానికి, కొత్త ప్రదేశాలు, కొత్త వ్యక్తులు వారి జీవన విధానాలు, ప్రకృతి లోని జీవులు,అందాలు చూడటానికి, తెలుసుకోవటానికి ప్రతి వేసవి సెలవుల్లో వివిధ ప్రదేశాలకు వెళుతుంటారు.
ఈ ఏడాది నీలగిరి అందాలను చూడటానికి, చల్లని ప్రదేశంలో ఒక నెల రోజులు ఉండటానికి కోటగిరి, ఊటీకి దగ్గర ఉన్న చిన్న టౌన్‌కి వెళ్లారు. హైదరాబాద్ నుండి బెంగుళూరు మీదుగా రామగిరి, మండ్య, మైసూర్
నుండి ఊటీకి కారులో బయలుదేరారు. పిల్లలు రోడ్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు.
బెంగళూరులో రాత్రి ఆగి మరునాడు ఉదయం ఊటీకి బయలుదేరారు. దోవలో రామ నగరిలో వుడెన్ ఎడ్యుకేషన్ టాయ్స్ అమ్ముతుంటే కొన్ని కొన్నారు.
ఊటీ ప్రయాణంలో తొలిమెట్టు బందీపూర్ టైగర్ రిజర్వు ఫారెస్ట్ లోకి ప్రవేశించగానే పిల్లలు ఉల్లాసంగా కేరింతలు కొట్టారు. పచ్చని దట్టమైన అడవి, పక్షుల కిలకిలారావాలు/అరుపులు వారికి ఏంతో ఆనందాన్ని ఇచ్చాయి.
దోవలో బందీపూర్ టైగర్ రిజర్వులో ట్రిప్ ముందుగానే బుక్ చేసారు. ఫారెస్ట్ వెహికల్లో అందరిని అడవిలోకి ట్రిప్ తీసుకువెళ్లారు.
దోవలో దూరంగా గుంపుగా ఆగి ఉన్న ఏనుగులను చూసారు. ముందుగానే అధికారులు చెప్పినందున ఎవ్వరు గట్టిగా మాట్లాడటం అరవటం చెయ్యలేదు. ట్రిప్‌లో జింకల గుంపు, పురివిప్పిన నెమళ్ళు, అడవి దున్నలు, దుప్పి, ఉడతలు చూసారు. అంతేనా? ఇంకా రంగురంగుల పక్షులు, సీతాకోకచిలుకలు, తూనీగలు పేరు తెలీని అనేక ఇతర పక్షులు, కీటకాలు కనిపించాయి. అనేక రకాల పెద్ద చెట్లు, రంగురంగుల పువ్వులు, గమ్మత్తైన అడవి వాసనలు, పాముల పుట్టలు, పారుతున్న సెలయేళ్ళు చూస్తూ పిల్లలు వీడియో గేమ్స్ మరచిపోయారు. బోర్ కొట్టలేదు. వింత అనుభూతికి లోనయ్యారు. దోవంతా వావ్! వావ్! అనటమే.
పిల్లలు నిజమైన అడవిలో, నిజమైన అని ఎందుకు అన్నానంటే నేటి తరం పిల్లలు రియల్ కన్నా virtual వరల్డ్‌లో ఉంటున్నారు. వారి బాల్యం మనలా ప్రకృతి ఒడిలో కాకుండా కాంక్రీట్ కీకారణ్యంలో గడుస్తోంది. నిజమైన
wow experience ని పొందారు. లంచ్ చేస్తున్నప్పుడు పిల్లలు అనేక ప్రశ్నలు వేశారు.
“నాన్నా మనకి మన సిటీలో ఇలాంటి పక్షులు ఎందుకు కనిపించవు?” అన్నాడు సాగర్.
“నాన్నా ఇక్కడ ఉన్నట్లుగా మనకి చెట్లు పూలు ఎందుకు లేవు?” అంది ధరణి.
“నాన్నా ఇక్కడ ఎంత కూల్‌గా ఉందో? మనకి ఇలా ఉంటే ఎంత బాగుంటుందో?” అన్నాడు సాగర్
“అవును. నిజమే. మనకి 10 ఏళ్ళ క్రితం వరకు చాలా కూల్‌గా ఉండేది. వానలు బాగా ఉండేవి. నెమ్మదిగా క్లైమేట్ చేంజ్ అవుతున్నది” అంది అమ్మ
“అవనీ! మర్చిపోయావా? క్లైమేట్ ఎంత ఫాస్ట్‌గా చేంజ్ అయ్యిందో. అవుతున్నదో?” అన్నారు అరవింద్.
“నాన్నా! మేము అడిగింది చెప్పు. ప్లీజ్.”
“ఓకే ఓకే. ఓపిగ్గా విని ట్రై టు అండర్‌స్టాండ్.”
“ఓకే. డాడ్.”
“ఎర్త్ మీద అధికారం కేవలం మనకి అంటే మనిషికి మాత్రమే ఉందని అనుకున్న మనిషి ప్రకృతిపై దాడి చేయడం మొదలుపెట్టాడు.”
“హౌ? ఎలా?”
“ఎలాగంటే వేలాది సంవత్సరాల క్రితం భూమి మీద మనిషి లేనప్పుడు అన్ని రకాల జీవులు (క్రీచర్స్), చెట్లు, నదులు, సముద్రాలు, అండర్ వాటర్ క్రీచర్స్ అన్ని హ్యాపీ గా ఉండేవి. బయో డైవర్సిటీ/జీవ వైవిధ్యం ఉండేది. తరవాత చాలా చాలా ఏళ్ళకి మనిషి లాంటి జీవి పుట్టింది.”
“మనిషి లాంటి జీవా/క్రీచర్?” అంది ఆశ్చర్యంగా ధరణి.
“అవును. ధరణి. అలాంటిదే. చింపాంజి లాగా. కాలక్రమేణా ఆ జీవి కూడా చేంజ్ అయ్యి మనిషిలా నుంచుని తిరగటం చేసింది.”
“wow! తర్వాత?” అన్నాడు సాగర్
“తర్వాత మనిషి లాంటి క్రీచర్కి ఉన్న తెలివితో చుట్టూ ఉన్న అనిమల్స్ని హంట్ చేసి ఫుడ్ కోసం తిరుగుతూ ఉండేవారు. wanderers. ఫుడ్ గాథేరర్స్, ఆఫ్టర్ వర్డ్స్ ఒక ప్లేస్ లో సెటిల్ అయ్యి హౌస్ కట్టుకున్నారు. ఫుడ్ కోసం తిరక్కుండా అడవిని కట్ చేసి అగ్రికల్చర్ స్టార్ట్ చేసారు. First food crop barley.”
“మేము అడిగింది ఇది కాదు” అని ధరణి అడ్డుతగిలింది.
“వెయిట్ ధరణి, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం తెలియాలంటే what and why happened తెలియాలి” అన్నారు అరవింద్.
“అలా మనిషి జర్నీ అఫ్ డెవెలప్మెంట్ అండ్ కల్చర్ మొదలయ్యింది.. ఎర్త్ ఏజ్‌ని ఒక పెద్ద గీతలా గీస్తే అందులో మనిషి పుట్టినప్పటినుండి ఇప్పటి దాకా గీతలా గీస్తే అది చాలా చిన్న గీత. అయినప్పటికీ మనిషి చేసిన చేస్తున్న నాశనం చాల తక్కువ టైంలో ఎక్కువ. అందుకు కారణం జనాభా పెరుగుతూ వచ్చింది. ఇంకా ఇంకా మనకి ఫుడ్, హోసింగ్ అవసరం ఎక్కువ అయ్యింది. అందుకని మనిషి అడవులు నరకటం మొదలుపెట్టాడు. నీటిని స్టోర్ చెయ్యటానికి డామ్స్ కట్టి నదులని డైవర్ట్ చేసాడు. అలా అలా 21వ శతాబ్దం వచ్చేసరికి భూమి చాలా మారింది.”
“అంటే? ఏమైంది ఎర్త్‌కి?”
“ఇప్పుడు మీరు చూసిన ఫారెస్ట్ కంటే వెరీ బిగ్, థిక్ అడవులు ఉండేవి. నదులు వాటర్ క్లీన్‌గా ఉండేవి. తెలుసా?”
“అవునా ! మరి ఇప్పుడు ఎర్త్ ఎలా ఉంది?” అంది ధరణి
“ధరణి బంగారు! మదర్ ఎర్త్ ఇప్పుడు చాలా సాడ్‌గా ఉంది.”
“ఎందుకు డాడ్? ఎవరు హర్ట్ చేసారు?” అన్నాడు సాగర్.
“man. అంటే మనం అందరం.”
“what we did?”
“మనం మన స్వార్థంతో చేస్తున్న పనులవల్ల భూమి/ఎర్త్, సముద్రాలూ, స్కై, గాలి మన చుట్టూ ఉండే మీరు చూసిన నేచర్ లాంటివి ఎప్పుడు లేనంతగా ఫాస్ట్‌గా విధ్వంసం అంటే destruction అవుతున్నాయని UNO రిపోర్ట్ చెప్పింది. మనుషులు పర్యావరణ సమతౌల్యం అంటే ecological balance చేసే అడవులని నరికేస్తున్నాము.”
“డాడ్ ఫారెస్ట్‌ని కట్ చేస్తే ఏమవుతుంది?”
“వేడి పెరిగిపోతుంది. మనకి కూల్‌గా లేదన్నావుగా అందుకే.”
“అడవులు కట్ చేస్తున్నాము కనక హనీ బీ, ఇతర కీటకాలకు కావలసిన ఫ్లవర్స్ ఉండటంలేదు. దాంతో అగ్రికల్చర్‌కి అవసరమైన పోలినేషన్ తగ్గిపోయి crops yield తగ్గిపోతున్నది. సో కొన్ని దేశాల్లో ఫుడ్ షార్టేజ్ (ఆహార కొరత) ఉంది. వాటర్‌ని పొల్యూట్ చేస్తున్నాము – అన్ని రసాయనాలు కలిపేసి. ఈవెన్ మన bath and kitchen వాటర్ కూడా ఎర్త్‌కి మంచిది కాదు. IPBES అంటే ఇంటర్ గవర్నమెంటల్ సైన్స్ పాలసీ ప్లాట్‌ఫామ్ ఆన్ బయోడైవర్సిటీ అండ్ ఎకో సిస్టమ్ సర్వీసెస్ చెప్పిన మాటల్లో – గత 50 ఏళ్ళలో విధ్వంసం గత శతాబ్దాల కన్నా చాల ఎక్కువ. 1970 నుండి ప్రపంచ జనాభా డబల్ రెట్టింపు అయ్యింది.”
“డాడ్ జనాభా పెరిగితే మంచిది కాదా? what will happen?” అన్నాడు సాగర్
“జనాభా పెరిగితే వాళ్ళ అవసరాల కోసం అంటే ఇళ్ళు, food, clothing, వాటర్, ఇండస్ట్రీస్, మీ స్కూల్ ఇలా అన్నింటికీ ల్యాండ్ కావాలి. ఎర్త్ మీద ల్యాండ్ లిమిటెడ్. మీ టీచర్ చెప్పారుగా ఎర్త్ 72% వాటర్ మిగిలింది ల్యాండ్
విత్ మౌంటైన్స్, deserts అని. సో మన అవసరాల కోసం ఫారెస్ట్‌ని కట్ చేస్తూ పోతున్నాము. అందువల్ల ఫారెస్ట్‌లో ఉండే ఇప్పుడు మీరు చూసిన animals, birds, insects లాంటివి వాటి హ్యాబిటాట్ అంటే నివాసం destroy ధ్వంసం అవటంతో చనిపోతున్నాయి. కొన్ని ఏనుగులు, టైగర్, చీతా, బేర్ లాంటివి ఊర్లలోకి వస్తున్నాయి. మనం భయంతో చంపేస్తున్నాము.”
“అవును టీవీ లో చూపెట్టారు.”
“మీకు తెలుసా UNO రిపోర్ట్ ప్రకారం ఉభయచరాలు అంటే నీటిలో నేల మీద ఉండే ఫ్రాగ్ లాంటివి 40%, పెద్ద చెట్లు cony ఫారెస్ట్ 34%, పగడపు దిబ్బలు అంటే coral reefs 33%, షార్క్ ఫిష్ 31%, ఫిష్, ప్రాన్ లాంటివి 27%, మామల్స్ 25%, బర్డ్స్ 14% అంతరించిపోతున్నాయిట. dying. 1980-2000 వరకు 25 crore ఎకరాల ట్రాపికల్ ఫారెస్ట్ నాశనం అయ్యాయి. బయో డైవర్సిటీ డేంజర్లో పడటానికి మెయిన్ రీజన్ అవి ఉండే నివాసాలని డిస్ట్రాయ్ చెయ్యటమే. పాపం వాటికీ ఇల్లు లేక ఎక్కడ ఉండాలో తేలిక, కొత్త చోటులో adjust అవలేక చనిపోతున్నాయి.”
“పాపం కదా నాన్నా” అంది ధరణి బాధగా.
“అవును తల్లి. అనేక జీవులు/క్రీచర్స్ చనిపోవడానికి కారణాలలో కొన్ని అవి ఉండటానికి తగిన suitable places తగ్గిపోవటం, వనరులు అంటే ఫారెస్ట్, వాటర్ ని డిస్ట్రాయ్ చెయ్యటం, పొల్యూషన్, క్లైమేట్ చేంజ్ అంటే పెరుగుతున్న వేడి, temperatures, వ్యాధులు…”
“నానా ఫ్యూ మంత్స్ బ్యాక్ అమెరికాలో ఫారెస్ట్ ఫైర్ అందుకేనా?”
“కొంతవరకు నిజం. అలంటి ప్రమాదాల్లో కూడా ఎన్నో జంతువులూ చనిపోతాయి.”
“నాన్నా! కేరళ వరదలకి కూడా క్లైమేట్ చేంజ్ కారణమా?” అన్నాడు సాగర్
“అవును. అప్పుడు కూడా జీవులు, అడవులు దెబ్బతిన్నాయి. ఇంకో ముఖ్య కారణం ప్లాస్టిక్. మా చిన్నప్పుడు ప్లాస్టిక్ చాల తక్కువగ వాడేవాళ్ళము. 1980 నుండి ఇప్పటివరకూ ప్లాస్టిక్ పొల్యూషన్ 10 రేట్లు పెరిగింది. ప్లాస్టిక్ నేలలో, నీటిలో, సముద్రాల్లో కలిసి జీవులని ఇబ్బంది పెడుతున్నది. ప్రతి ఏటా 300-400 మిలియన్ టన్నుల వ్యర్ధాలు వాటర్‌లో కలిసి వాటర్ చాలా స్పీడ్‌గా పొల్యూట్ అవుతూ తాగటానికి, పంటలకు పనికి రాకుండా పోతున్నది.”
“అవును మా టీచర్ పొల్యూటెడ్ వాటర్ వల్ల జబ్బులు వస్తాయని, వడగట్టి తాగాలన్నారు” అంది ధరణి.
“మనం చేస్తున్న గాలి, నీరు, నేల కాలుష్యం వల్ల అనేక చిన్న పెద్ద క్రీచర్స్ (జీవులు) చనిపోతున్నాయి. సాయిల్ ఫెర్టిలిటీ/భూ సారం 23% తగ్గిపోయి పంటలు సరిగా పండటం లేదు. మన ఫుడ్ కోసం, లివింగ్ కోసం మనం చేస్తున్న వనరుల /రిసోర్స్ destruction మూలంగా బయో డైవర్సిటీ దెబ్బతింటుంది. ఒక రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో ప్రతి నాలుగు జీవజాతుల్లో ఒకటి అంతరిస్తోందిట. అంటే కనిపించకుండా పోతున్నది. ఇప్పుడు తెలిసిందా మన సిటీస్ లో చెట్లు ఇందుకు తక్కువగా ఉన్నాయో?”
“నాన్నా చెట్లని నరికి ల్యాండ్‌పై బిల్డింగ్స్ కట్టారు. అందుకు” అన్నాడు సాగర్ .
“నీళ్లు ఎందుకు పొల్యూట్ అయ్యాయో తెలిసిందా?”
“నాన్నా! వాటర్‌లో కెమికల్స్ కలవటంతో” అంది ధరణి.
“గుడ్. మరి ఎర్త్‌ని ఎలా సేవ్ చెయ్యాలి?”
“ఇప్పటివరకు జరిగిన విధ్వంసాన్ని /destruction ని మార్చలేము. ఇంకా ముందు జరగకుండా వాతావరణం పాడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.”
“ఎలాగో చెప్పు నాన్న. మేము ట్రై చేస్తాము.”
“చెబుతాను. కానీ అది ఒకరిద్దరి వల్ల కాదు. అందరు అన్ని దేశాల ప్రజలు ప్రభుత్వాలు కలసికట్టుగా యుద్ధ ప్రాతిపదిక అంటే అర్జెంటుగా చర్యలు తీసుకోవాలి.”
“what are they?” అన్నాడు సాగర్.
“ex. అడవులు కట్ చెయ్యకూడదు. ఎవరైనా చేస్తే పనిష్ చెయ్యాలి. నదులు, సముద్రాల్లోకి డొమెస్టిక్, ఇండస్ట్రియల్ మురికి, కెమికల్ కలిసిన వాటర్‌ని వదలకూడదు. ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి.”
“ఎలా నాన్నా?” అంది ధరణి.
“ప్లాస్టిక్ పెన్సిల్ బాక్స్ బదులు అమ్మ స్టిచ్ చేసిన పెన్సిల్ క్లోత్ కవర్ వాడు. అలాగే ప్లాస్టిక్ లంచ్ బాక్స్ కంటే స్టీల్ బాక్స్. క్లోత్ బాగ్స్, పేపర్ కవర్లు అరటి బాదం చెట్టు ఆకులు. థింక్ థింక్. ఇంకా air-conditions ఎక్కువసేపు వాడటం తగ్గించాలి. బాడీ natural గా వేడిని తట్టుకునేలా చెయ్యాలి. అనవసరంగా వాటర్ వృథా చెయ్యవద్దు. ఎంత అవసరమో అంటే వాడాలి. కిటికీలు ఓపెన్ పెట్టి natural air, light లోపలి వచ్చేలా చెయ్యాలి. బాల్కనీ గార్డెన్స్ పెంచాలి. లిస్ట్ ఈజ్ బిగ్. మీరు ఏమి చెయ్యాలో మీ సైడ్ నుండి థింక్ చెయ్యండి. live let live. mother earth అందరిదీ.”
“నాన్నా! we want to join Eco-friendly group” అన్నారు పిల్లలు.
“తప్పకుండా.”
“అరవింద్ ఇంక బయలుదేరుదామా? చీకటి పడేలోపు చేరాలి” అంది అవని.
“చలో! బచ్చే జాయేంగే!” అని బయలుదేరారు.
డి. చాముండేశ్వరి రిటైర్డ్ సోషల్ స్టడీస్, తెలుగు ఉపాధ్యాయిని. దశాబ్దాల పాటు హైస్కూలు విద్యార్థులకు పాఠాలు బోధించారు. యాత్రలు, గార్డెనింగ్, కథారచనలో అభిరుచి. బహుముఖీన వ్యక్తిత్వం గల రచయిత్రి ఇటీవల బాలల కథలు వ్రాసి, వాటికి బొమ్మలు గీశారు.
Your email address will not be published. Required fields are marked *
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
గూఢచారి లాంటి The Wedding Guest
జీవన రమణీయం-85
‘యాత్ర’ చూద్దామా ఎపిసోడ్-11
నీలమత పురాణం – 52
మానస సంచరరే-30: మనసే అందాల బృందావనం!
All rights reserved - Sanchika™