నదీతీరాలలో ప్రయాణించాలని అనుకున్నప్పుడు, ఎందుకో శ్రీశ్రీ గారి మహా ప్రస్థానం గుర్తొచ్చింది. అందులోని ఓ కవిత తలపులలో కదలాడింది.
“మతాలు కైఫీయతులూ ఇవి కాదోయి చరిత్రసారం. ” ~ “నైలు నదీ నాగరికతతో సామాన్యుని జీవన మెట్టిది? తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవరు? ~ తక్షశిలా, పాటలీపుత్రం మధ్యధరా సముద్రతీరం హరప్పా మొహెంజోదారో, క్రో-మాన్యాన్ గుహా ముఖాల్లో చారిత్రక విభాత సంద్యల మానవ కథ వికాస మెట్టిది?”
ఈ కవితను చదివితే నైలు నదీ నాగరికత అనే అంశం మీద రాయాలని అన్పించింది.
నైలు నది ప్రవహించే తీరాలలో ముఖ్యమైనది నైలునది పుట్టుక. ఈ నైలునది ఎక్కడ పుట్టింది అంటే ఉగాండాలో పుట్టింది అంటే ఉగాండాలో పుట్టిందని అక్కడి ప్రజలు చూపిస్తున్నారు. ఇది జింజా (Jinza) అనే ప్రాంతంలో పుట్టి జింజా నుండి ప్రయాణం చేసి సూడాన్, సూడాన్ నుండి Egypt లో వున్న Aswan, Luxor, Cairo నుండి మధ్యధరా సముద్రంలో కలుస్తుంది.
10 సంవత్సరాల క్రితం ఈజిప్టులో వున్న Aswan, Luxor, Cairo లకు మేము ఒక Cruise తీసుకొని వెళ్ళాము. ఈ నైలునదిలో 7 రోజులు ప్రయానం ఆ నౌకలో చేశాము. “Egypt is gift of Nile” అని అంటారు.
ఇప్పుడు మేము 2019లో నైలు నది పుట్టిన జింజా ప్రాంతానికి వెళ్ళాము. ఇది ఉగాండాలో వుంది. నైల్ నది బురుండీ అనే ప్రాంతంలో పుట్టిందని కొందరంటారు.
నైలు నది ప్రాంతాన జీవించే ఫారోస్ ఎన్నో దేవుళ్ళని పూజించేవారు. వారు ఒక్కో ప్రాంతానికి ఒక పేరు పెట్టారు. అలా నైలు నది. ఇది Sobek “God of the Nile” అని ఫారోస్ అనేవారు, “God of crocodile” అని ఫారోస్ రాజులు అనేవారు. ఈ నది పంటల సారవంతానికి, పొలాలు అన్నంటి ఎంతో సాగుకి కారణం ఈ Nile Sobek అనే దేవుడు. ఇది ఎక్కడ ఎండిపోతుందో అక్కడ దేవుడి చెమట పడింది అని వాళ్ళ నమ్మకం.
ఈ నది ప్రపంచంలోనే అతి పొడవైన 653 కి.మీ. వాయువ్య ఆఫ్రికాలో వుంది. “Nile” అనే పదం 2 పదాల కలయిక, “Neilos” అనే పదము, నీలోస్ అంటే “Valley” లోయ అని అర్థం. “Nilus” అంటే ఈ ప్రవాహము ఎన్నో దేశాన్ని కలుపుకుందని అర్థం. ఇది 11 దేశాలని కలుపుతుంది.
అవి ఉగాండా, ఎరిట్రియా, రువాండా, కాంగో, టాంజానియా, బురుండి, కెన్యా, ఇథియోపియా, సూడాన్, దక్షిణ సూడాన్ మరియు ఈజిప్ట్.
ఈ ప్రయాణం కూడ మేము ట్రాన్సిట్‌లో ఉగాండా వరకు వెళ్తున్నామని తెలిపి మా ట్రావెల్ ఏజంట్‌ని ఉగాండాలో 7 రోజులు ఆగి వెళ్తామని అడిగితే అలాగే బుక్ చేశారు. మేము జింబాబ్వే నుండి ఉగాండాకి వెళ్ళాము. అక్కడికి వెళ్ళగానే రాత్రి 10 గంటలకి చేరాము. అక్కడికి చేరగానే ఒక టాక్సీ మాట్లాడుకొని లేక్ విక్టోరియాకి దగ్గరలో హోటల్ తీసుకున్నాము.
ప్రొద్దుననే మేము ఒక టూర్ గైడ్‌తో వెళ్ళి ఉగాండా సిటీలో వున్న అన్ని స్థలాలు చూడడానికి బయలుదేరాము. బీదదేశము. కంపాలాలోని Khazinga కి వెళ్ళాము. ఇక్కడ క్వీన్ ఎలిజబెత్ నేషనల్ పార్క్ వుంది. ఇక్కడికి వెళ్ళగానే Khazinga channel నీరు ప్రక్కన ఉన్న అన్ని జంతువులను చూశాము.
ఇక్కడ నేషనల్ పార్క్ లోపలికి వెళ్ళగానే అన్ని కొండముచ్చులు, hippopotamus దగ్గరకి వెళ్ళడానికి ఒక వాహనం వుంది. అందులో గడ్డి వుంది. అందరు ఆ hippopotamus కి గడ్డి పెడ్తున్నారు. వారి దైర్యం చూచి ఆశ్చర్యపోయారు. వారు అంత దగ్గరగా వుండి దానికి తినిపించటం నచ్చింది.
ఆ నల్లకోతులు గొరిల్లాలాగ వున్నాయి. ఆ గొరిల్లాలను చూచి ఆశ్చర్యమేసింది. అచ్చంగా మనం చేసినట్లుగాన అవి అనుకరిస్తున్నాయి. గట్టిగా అరుస్తున్నాయి. అక్కడ haringa బోట్ ట్రిప్‌లో వెళ్ళాము. దీనినే Khazinga channel అంటరు. నీటి గుర్రాలు, మొసళ్ళు చాలా వున్నాయి. అన్ని చూచి మళ్ళీ వెనక్కి వచ్చాము. Zake Kivu వరకు వెళ్ళి అక్కడి నుండి వెనక్కి వచ్చి హోటల్లో భోంచేశాము.
అక్కడ తినేసి గదికి వెళ్ళి పడుకున్నాము. మర్నాడు మేము ఈ లేక్ విక్టోరియా నుండి జింజా అనే పట్టణానికి 5 గంటలు ప్రయాణం చేసి వెళ్ళాము. ఇక్కడ ఈ జింజా నుండి నైలు నది పుట్టిన స్థలానికి వెళ్ళాము. ఒక కచోరి ఏదో కూర కూరివున్న కజ్జికాయని తిని ఆ రోజు మధ్యాహ్నం భోజనం తినేసి ఈ జింజా అనే ప్రాంతానికి వెళ్ళాము.
ఇక్కడ ఎంట్రీ ఫీజు కట్టి లోపలికి వెళ్ళాము. అక్కడ ఇద్దరు భారతీయులు 10వ సంవత్సరము పుట్టిన రోజు జరుపుకోడానికి పంజాబీవాళ్ళు లండన్ నుండి అక్కడికి వచ్చారు. వారితో పాటు కలిసి ఈ నదిలో ఎక్కడైతే ప్రారంభమౌతుందో అది చూడడానికి ఆ చెరువు మద్యలోకి వెళ్ళాలి. ఈ నది పుట్టుకను బ్రిటన్ అన్వేషి John Hanning Spoke అనే అతను కనుక్కున్నారట. మేము ఆ (source) నైలు పుట్టిన చోటకి వెళ్ళాలంటే 15000 రూ॥లు అడిగారు. చాలా ఖరీదు. మావారు వద్దు అన్నారు. అప్పుడు ఎలా అయినా వెళ్ళాలని వుంది. సరే అని ఆ ఇండియన్స్ దగ్గరికి వెళ్ళి, వారు కూడా మాతో వస్తే ఆ 15000 కి ఒక బోట్ మాట్లాడుకొని వెళ్ళాచ్చు అనుకున్నాము. వారు ఒప్పుకోలేదు. 30 వేలు ఇవ్వమని అడిగారు. అలా లండన్ వాళ్ళు కూడ ఒప్పుకోకపోతే చాలా నిరాశతో తిరిగివద్దామనుకున్నాము. అప్పుడు వాళ్ళు సరే ఒక్కొక్కరు 1000 రూ॥లు ఇవ్వండి వస్తానంటే అన్నారు, సరే అని సంతోషంగా ఒప్పుకొని ఆ బోట్ ఎక్కాము. ఆ బోట్లో లైఫ్ జాకెట్ వేసుకొని ఆ విక్టోరియా లేక్‌లో ప్రయాణం చేశాము.
చాలా ఉరవడిగా పొంగుతుంది ఆ నది. ఈ విక్టోరియా లేక్ లోనికి మేము బోట్ లో వెళ్తుంటే గాలికి మళ్ళీ అలా ఇలా బోట్ ఊగిసలాడుతుంది. అలా దానిని స్పీడ్ బోట్ లో తీసుకొని వెళ్ళి ఒక స్థలంలో మద్యగా ఒక ద్వీపం వుంది, అక్కడికి వెళ్ళి దించాడు. ఆ ద్వీపంలో చిన్న చిన్న handicrafts shops వున్నాయి. అక్కడ అన్ని తిలకిస్తూ; ఈ జింజా దగ్గర ఒక బోర్డ్ వుంది అది పూర్తిగా నీటి ఒడ్డున వుంది. అక్కడ నిలబడితే జారిపోతామేమోనని చాలా భయపడుతూ మావారి నడుము పట్టుకొని నిలబడి ఫొటో దిగాము. అక్కడ ఆ చరిత్ర గురించి చెప్పారు. అక్కడి నుండి మళ్ళీ ఆ బోట్ లో వెనక్కి వచ్చాము.
ఆ లండన్ దంపతులు ఆ బోట్ లోనే కేక్ కోశారు. ఆయనకి అక్కడ ఆ నైలు నది పుట్టిన స్థలంలో తన పుట్టినరోజు జరుపకోవాలని వచ్చారట. అక్కడే మా అందరి మద్యన కేక్ కోసారు. ఆ నైలు నది పుట్టిన స్థలంలో మేమందరం పాట పాడి ఒడ్డుకి చేరాము. నేను కూడ నా పుట్టిన రోజు ఈ నెలలోనే అయ్యింది అని చెపితే నా పేరు మీద కూడ అదే కేక్ కోసారు. నైలు నది ఉద్భవించిన స్థలంలో నా పుట్టినరోజు జరుపుకోవటం చాలా ఆనందమేసింది.
అక్కడ గాంధీ గారి నిగ్రహం వుంది. ఆఫ్రికాలో, మంగోలియాలో కూడా గాంధీ గారి విగ్రహం ఉండటం చాలా సంతోషమేసింది, మంగోలియాలో అయితే ఒక వీధి పేరు “గాంధీ వీధి” ఇలా మన గాంధీని పూజించటం చాలా ఆశ్చర్యమేసింది, సంతోషం వేసింది. అక్కడ ఒక స్థలంలో equator round బాగా నిర్మించారు. ఇక్కడి ప్రజలు మనకంఏ బీదగా వున్నారు. కాని వారి డబ్బు మాత్రం మనకంటే ఎక్కువ స్థాయిలో వున్నది.
ఉగాండా లో గొరిల్లాలు ఎన్నో సంవత్సరాల నుండి వున్నాయి. మేము ఒక మ్యూజియంకి వెళ్ళాము. 2 వేల సంవత్సరాల పూర్వము మనిషి ఈ గొరిల్లాగా వుండి ఎలా రూపాంతరం చెందారో ఒక ఫొటో పెట్టారు. ఉగాండా ప్రజలు ఆది మానవుడుగా రూపాంతరం చెందినది మా దేశం నుండే అని చెబుతున్నారు. అవన్నీ ఆశ్చర్యంగా చూశాము. అక్కడ గొరిల్లాలు చూడాలంటే కొండల ప్రాంతంలో కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ మనము చూడవచ్చును. మేము వెళ్ళిన విక్టోరియా నేషనల్ పార్క్‌లో అవి పడుకుంటూ, ఒకరి తలలో ఒకటి పేలను చూస్తూ, కొన్ని చెట్టుకొమ్మల మీద ఊగుతూ చేసిన అన్ని విన్యాసాలు చూశాము.
ఈ మ్యూజియం బయట నేను ఈదీ అమీన్ ఫోటో చూశాను. అక్కడ ఒక ఫోటో దిగాను. ఈదీ అమీన్ 1925 నుండి 2003 వరకు ఉగాండా మిలిటరీ ఆఫీసర్ గా ఉండి, 1971 నుండి 79 వరకు అధ్యక్షుడు అయ్యారు.
“Butcher of Uganda” నర పిశాచకుడిగా ప్రసిద్ధి చెందాడు. 3 లక్షల మంది భారతీయులని, పాకిస్తానీ వాళ్ళని చంపారు. ఈదీ అమీన్‌ని నర మాంస భక్షకుడు అని కూడా అనేవారు. 1979 ఏప్రిల్ 11 న ఉగాండా నుండి పారిపోయారు. 16 ఆగస్టు 2003 లో చనిపొయ్యారు. 3 లక్షల మందిని చంపారంటే మన భారతీయులు ఎన్ని కష్టాలు పడ్డారో అని చాలా చింతించాను. ప్రాణం కొరకు ఎంత పరుగెత్తారో అని చాలా బాధపడ్డాము. అక్కడ ఈ ఒలింపిక్స్‌కి సంబంధించిన మెడల్స్, అక్కడి క్రీడాకారుల చరిత్ర అన్ని ఈ మ్యూజియంలో వున్నాయి.
ఇది అన్నీ చూచి equator దగ్గరికి వెళ్ళేసరికి రాత్రి 6 గంటలకి చేరుకున్నాము. ఇది భూమి (Axis) కి North Hemisphere మరియు Southern hemisphere, Kampala నుండి 72 కి.మీ. ఇక్కడికి వెళ్ళినప్పుడు చాలా light అంటే చాలా లేనిపోకున్న భావన. ఇది Uganda land mark.
మేము ఒక పార్క్‌కి వెళ్ళాము. అక్కడ నుండి ఒక స్కూల్‌కి వెళ్ళాము. అది అనాథ పిల్లల స్కూలు. వారికి ఒక పూట భోజనానికి మేము డబ్బు కట్టి వచ్చాము. ఆ పిల్లలందరికీ గుండు చేసి వుంది. ఎందుకని అడిగితే మెయిన్‌టెనన్స్, ఇంకా శుభ్రత గురించి హెయిర్ కట్ చేశామని చెప్పారు.
ఇక్కడ ఉగాండాలో మనిషిని పోలిన జంతువులని, అడవి జాతి వారిని, ఈదీ అమీన్ పాలనని, అన్నింటినీ మించి ఈక్వేటర్, ఇంకా నైలు నది పుట్టిన స్థలాన్ని చూచి ఆనందిస్తూ ఇథియోపియా బయల్దేరాము.
నిర్విరామ విహారిణిగా పేరుపొందిన నర్మద రెడ్డి ఎన్నదగిన స్త్రీ యాత్రికురాలు. ఇప్పటివరకూ ప్రపంచంలోని 169 దేశాలను సందర్శించారు. తమ పర్యటనానుభవాలతో “ఆగదు మా ప్రయాణం”, “కొలంబస్ అడుగుజాడల్లో” అనే పుస్తకాలు వెలువరించారు. ‘ఉమెన్ ఆన్ గో’ పురస్కారం పొందారు.
One of the great fourth world country journeys with longest historical Nile river+lake Victoria.Vibrant wild life animals.Active Ugandan people, tribals.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™