పాలరాతి స్వర్గమా, అందమైన యముననే అసూయ చెందేలా చేసిన అద్భుతమా, భారతదేశపు ఖ్యాతి పెంచిన కీర్తి పతాకమా… చరిత్రలోని సజీవ ఘట్టమా.. వెన్నెల అచ్చెరొవందే ఆశ్చర్యమా.. వేల శిల్పుల అపూర్వ చాతుర్యమా… కవుల కల్పనా భావ సౌధమా.. మంచు వర్షపు వాకిట మాయని పరువమా… నీ సౌందర్యము వర్ణణాతీతము…
మరిప్పుడో.. మురుగు నిండిన యమున దుర్గంధం ఎదుట కాలుష్యపు కోరలలో చిక్కుకొని వెలవెలబోతూ.. ఓ ముంతాజ్ శతాబ్దాలపాటు నిద్రించినది చాలు. దండయాత్రలను సైతం ఎదుర్కొని స్థైర్యంతో నిలబడ్డ నీ ప్రేమకానుక మానవ తప్పిదాలను క్షమించి మానవహరాలలో నీ ప్రేమను ప్రవేశపెట్టి కాలుష్యాలను ఎదుర్కొనే మార్గాలను మాలో ప్రవేశ పెట్టి నీ ప్రేమమహల్ కాపాడుకో….!
Like Us
సరిహద్దు రేఖలనూ, మన మనస్సులనూ కప్పిన పొగమంచు : ధుంధ్
‘యాత్ర’ చూద్దామా ఎపిసోడ్-10
పదసంచిక-30
రంగుల హేల 21: ఆదత్ సే మజ్బూర్
జీవన రమణీయం-84
All rights reserved - Sanchika™