నీ జ్ఞాపకాల పొత్తిళ్ళలో పసిపాపనైనా మూసి వున్న నా కన్నుల్లో నీ రూపాన్నే కన్నా నీ మాటల స్వదమాధుర్యాన్ని మనసు నిండా నింపుకున్నా నీ ఊహల గూళ్ళలో ఆశల చిలుకల్ని పెంచుకున్నా కానీ నేస్తమా కాలమనే వేటగాడు ఆ చిలుకల్ని కసిదీరా నలిపేశాడు మాధుర్యం నిండుకున్న మాట మిగిలింది పొత్తిళ్ళు లేని పసిపాప మిగిలింది తెరుచుకున్న కళ్ళల్లో కన్నీరింకింది ఓ రెండు కన్నీటి బొట్లు అప్పుగానైనా ఇవ్వవూ!
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™