సంచికలో తాజాగా

Related Articles

9 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇచి చాడ శాస్త్రి గారి వ్యాఖ్య: *భక్త కన్నప్ప ఈ పాట అద్భుతం. ఎన్ని సార్లు విన్నామో. కానీ అప్పుడు పాట విని ఆనందించడమే కానీ ఇలా సాహిత్యం మీద దృష్టి పెట్టడం తక్కువ.*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది చంద్రశేఖర్ గారి వ్యాఖ్య: *నాకు ఎంతో ఇష్టమైన మరో గొప్ప సాహిత్య విలువలుగల గీతం. తెలుగు సినీ సాహిత్యంలో మకుటాయమానంగా, రహస్యంలోని గిరిజా కళ్యాణానికి సరి తూగ గల సాహిత్యం వేటూరి ఈ రచన. ఎరుక గలిగిన వాడు ఎరుకగా మారగా.. అనడంలోనే కవి ప్రతిభ మొత్తం ద్యోతకమౌతుంది. ఎంత వ్రాసినా ఈ పాట గురించీ తక్కువే! 👍🏼👌🏼👏🏼🙏🏼💐.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గాప్రసాద్ గారి వ్యాఖ్య: *అత్యంత అద్భుతమైన విశ్లేషణ. భక్త కన్నప్ప బాపు గారు తీయడం వలన, వేటూరి పాటల వలన అంత సుందరంగా వచ్చింది. ముఖ్యంగా ఈ పాటలో చరణం చరణం మధ్యలో బాణీ మారుతూ.. ఒక తాదాత్మ్యతని ఆవిష్కృతము చేశారు దర్శకుడు. కృష్ణంరాజు ఆ పాత్రకి జీవం పోసాడు.
    పౌరాణిక, చారిత్ర్యక చిత్రాలు బాపు తప్పితే ఎవరూ అంత బాగా తీయలేరు. 👏👏*

  4. 4

    గోనుగుంట మురళీకృష్ణ

    భక్తకన్నప్ప చలనచిత్రంలోని కిరాతార్జునీయం గాన ఖండిక విశ్లేషణ అత్యంత రమణీయంగా సాగింది. చాలా చాలా బాగుంది. వ్యాసంలో ఒక చోట “ఈ మహదానందాన్ని అనుభవిస్తూ ప్రాణం పోతే అంతకన్నా గొప్ప మరణం లేదు…” అని చదువుతూంటే, శ్రీకృష్ణుడి ని చూసిన గోపకాంత “మురళీధరా! నీ స్వర లహరులలో మరణమైనా మధురమురా… ” అనుకుంటుంది అని రాసిన సి.నా.రె. గీతం గుర్తొచ్చింది.

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది విహారి గారి వ్యాఖ్య: *🙏 నాలాంటి భావుకుడైన సున్నిత మనస్కుని మంత్ర ముగ్ధుల్ని చేసేస్తున్నారు. ఎంత లోతైన విశ్లేషణ!! సినారే, వేటూరి ఆత్మల్ని పట్టుకున్నారు. అలాగే, బాపు దర్శకత్వంలోని ఆర్తినీ నేపథ్యంతో వివరించారు. నమో నమః. మీ ప్రతిభకు జయహో! అభినందనలు అండి.*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రోహిణి గారి వ్యాఖ్య: *బాపు సినిమాలంటేనే ఎంతో కళాత్మకంగా ఉంటాయన్నది సత్యం. సీతాకల్యాణం సినిమాలో గంగావతరణం అత్యద్భుతంగా చిత్రీకరించారు. అలనాటి భక్త కన్నప్ప సినిమాలో కృష్ణంరాజు నటన ఎంతో బాగుంది. పాటలన్నీ సూపర్ హిట్స్. సినిమా చూడడమే కానీ, సాహిత్యం గురించి ఏ మాత్రం దృష్టి పెట్టలేదు. కిరాతార్జునీయం గురించి చేసిన విశ్లేషణ అద్భుతంగా ఉంది.
    అర్ధ నారీశ్వర తత్వం గురించి వివరణ చాలా బాగుంది.*

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మల్లాప్రగడ రామారావు గారి స్పందన:*కొన్ని మెట్లు ఎక్కించిన శంతనూ – శర్మిష్ఠలకు ప్రణామములు.*

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీలక్ష్మి చివుకుల గారి వ్యాఖ్య: *చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా సన్నివేశాలూ, పాటలోని సాహిత్యమూ కలిపి చదువుతున్నప్పుడు ఇంతకుముందు విన్న పాటలోని సంగీతం కూడా మనలో అంతర్లీనమై ప్రవహిస్తూ చిత్ర కావ్యంగా శోభిల్లింది. మంచి సీరీస్ చేయి తిరిగిన రచయితల చేతిలోంచి జాలువారుతోంది. అభినందనలు తెలియజేస్తూ, శ్రీలక్ష్మి చివుకుల.*

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జయసూర్య గారి స్పందన: *చాలా బాగా వేటూరి గారి కవిత్వ కథనాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు రచయిత.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!