సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణ గారి వ్యాఖ్య: *దీపావళి పోటీ కథలు శీర్షికన ప్రచురించిన రమాదేవి గారి “ఊడల మారెమ్మ” థ్రిల్లర్ జానర్ లో వ్రాసిన కథ బావుంది. ఆసక్తికరమైన కథనంతో సాగింది. పల్లెటూరు ప్రజల మూఢ విశ్వాసాలు, అమాయక ప్రజల మీద ముఖ్యంగా ఆడపిల్లల మీద దౌర్జన్యం చేసే దుర్మార్గులకు వారే ఎలా సమాధానం చెప్పారు అని చక్కగా వ్రాసారు రచయిత్రి.
    కళాగోపాల్ గారి, “తిల్య గోవిందరాజులు” పౌరాణిక జానర్ లో వ్రాసిన కథ చాలా బావుంది. పల్లవ చోళుల కాలంలో శైవులు, వైష్ణవుల(నయనార్లు, ఆళ్వార్ లు. వారి వారి భక్తి ఉద్యమాన్ని విపరీతంగా వ్యాప్తి చేశారు. అప్పటి రాజులు కూడా వారి వారి మత విశ్వాసాలకు అనుగుణంగా దేవాలయాలను నిర్మించడం చేశారు.
    శివాయ విష్ణు రూపాయ, శివ రూపాయ విష్ణవే” అనేది పరమాత్మ యొక్క వివిధ రూపాల మధ్య సంబంధాన్ని, మరియు అవి ఒకే దేవుని యొక్క వ్యక్తీకరణ అని చెప్తున్నా ఆ కాలంలో ఆచరణ సాధ్యం అయ్యేది కాదు.
    కుముదవల్లి కథ ఎత్తుగడ నుండి , చక్కటి కథనంతో సాగి, అతి చక్కటి ముగింపు ఇచ్చింది. కుముదవల్లి నాట్య ప్రదర్శన, రంగనాథుని వసంతోత్సవాలు, శితి కంఠుని ఆగ్రహం అత్యంత సహజంగా వ్రాసారు రచయిత్రి.
    అరహపిరాట్టి కథ తాతయ్య చెప్పడం చాలా బావుంది.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®